నేచర్ టూరిజం: పార్లమెంటును తాకిన సైబీరియా పక్షుల సవ్వడి!
x
పులికాట్ సరస్సులో సందడి చేస్తున్న ఫ్లెమింగోలు, ఇతర జాతి పక్షుల.

నేచర్ టూరిజం: పార్లమెంటును తాకిన సైబీరియా పక్షుల సవ్వడి!

పులికాట్ సరస్సులో Nature Tourism అభివృద్ధితో మత్స్యకారులను కరుణించిన మంత్రి నిర్మలమ్మ.


పులికాట్ సరస్సులో బర్డ్-వాచింగ్ టూరిజం

పక్షుల వీక్షణకు ప్రత్యేక ట్రైల్స్

రాష్ట్రంలో పర్యాటకానికి మరింత ఊపు

అరకులోయ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత.

పది వేల మంది స్థానికులు, మత్స్యకారులకు గైడ్లుగా శిక్షణ


సైబీరియా వలస పక్షుల నిలయం పులికాట్ సరస్సు. ఇది పక్షి ప్రేమికులకు స్వర్గధామంగా మారబోతోంది. మత్స్యకారుల జీవన విధానం కూడా మారనుంది. ఆర్థిక స్థిరత్వం సాధించే రోజులు సమీపించాయి. అరకు లోయ కూడా మరింత అలరారబోతోంది.
బంగాళాఖాతం నుంచి అలల సవ్వడి. ఈ సముద్రం ముఖద్వారం సమీపంలో పరుచుకున్న చిట్టడివి. ఇక్కడి నుంచి వచ్చే నీటితో నిండిన పులికాట్ సరస్సు. సమీపంలో విదేశీ వలస పక్షుల విహారం. ఈ సరస్సు ఒడ్డున నెగళ్లు ( Fire Camp ) దగ్గర చలికాగుతూ టెంట్లు వేసుకుని స్వచ్ఛమైన వాతావరణం ఆస్వాదిస్తే ఎలా ఉంటుంది. పల్లెల్లో హోం స్టే ద్వారా కూడా గ్రామీణులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం త్వరలోనే సాకారం కానున్నాయి.
ఈ మాటలకు వాస్తవ రూపం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం బర్డ్ వాచ్ టూరిజం ప్రణాళిక ప్రకటించింది. ప్రకృతిలోని పర్యావరణాన్ని ఆస్వాదిస్తూ, అడవులు జన వనరుల మధ్య ప్రకృతి పర్యాటకానికి మరింత ఊతం ఇచ్చారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బర్డ్ వాచ్ టూరిజం అభివృద్ధికి 2026-27 బడ్జెట్ లో ఓ విధానం ప్రకటించారు.

ఈ పర్యాటక విధానంపై తమ వైపు నుంచి ఎలాంటి ప్రతిపాదన వెళ్లలేదని తిరుపతి ఏపీటీడీసీ (Andhra Pradesh Tourism Development Corporation APTDC) సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
"పులికాట్ సరస్సు ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ విధానం ప్రకటించి ఉంటుంది. దీనిపై మా శాఖకు త్వరలోనే పూర్తి వివరాలు అందే అవకాశం ఉంది. ఆ వివరాలు చూడందే ఏమీ మాట్లాడలేం" అని రవి అని అధికారి చెప్పారు.

హోం స్టేల పర్యాటకం..

"ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులోని పులికాట్ సరస్సు వద్ద విదేశీ పక్షుల సందడిని ఆస్వాదించడానికి నేచర్ టూరిజం, స్థానికులకు ఉపాధి కల్పించే దిశగా గైడ్లు నియమించడం. హోంస్టే కల్చర్ పెంపొందించడానికి మార్గం ఏర్పడింది" తమిళనాడు సరిహద్దులో ఉన్న పలవేర్కాడ్ నుంచి తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నేలపట్టు, పులికాట్ సరస్సు విస్తరించిన బీవీ. పాలెం, ఇరకందీవి ప్రాంతాలు పర్యాటకులకు స్వర్గధామం కానున్నాయి.
ఇక్కడ బర్డ్-వాచింగ్ ట్రయల్స్ అభివృద్ధి చేసి నేచర్ టూరిజం, స్థానికులకు కూడా ఉపాధి కల్పించాలనేది ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే కడప జిల్లా గండికోట వద్ద టెంట్లు, బోటింగ్ సదుపాయం పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. అదే తరహాలో..
"పులికాట్ సరస్సు ఒడ్డున నేచర్ టూరిజం అభివృద్ధిలో హోం స్టేలు అందుబాటులోకి రానున్నాయి. వారికి సాయం అందించే దిశగా పులికాట్ సరస్సు పై సంపూర్ణ అవగాహన ఉన్న వారిని గైడ్లుగా నియమించేందుకు కూడా ఆస్కారం ఉంటుంది. ఈ వసతులతో ఈప్రాంతాన్ని క్లస్టర్ గా అభివృద్ధి చేయాలనేది కేంద్ర మంత్రి నిర్మలా సీతారమన్ ప్రతిపాదించిన బడ్జెట్ లో భాగంగా ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రతినిధులు చెబుతున్నారు.

విశాలమైన సరస్సు


బంగాళాఖాతానికి ముఖద్వారంగా ఉన్న పులికాట్ సరస్సు తమిళనాడు నుంచి రాష్ట్రంలో విస్తరించి ఉంది. 600 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న ఈ సరస్సు 0.2 నుంచి 17.5 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. దీని పరివాహక ప్రాంతంలో సూళ్లూరుపేట, వాకాడు, చిట్టమూరు, దొరవారిసత్రం గ్రామాలతో పాటు శ్రీహరికోటకు వెళ్లే మార్గంలోని అటకానితిప్ప, బీవీ. పాలెం తోపాటు నదికి మధ్యలో ఇరకందీవి కూడా అత్యంత ప్రధానమైనది. ఈ దీవిలోకి వెళ్లాలంటే పులికాట్ సరస్సులో ప్రయాణం మినహా మరో మార్గం లేదు. ఇది పర్యాటకానికి అనువైన ప్రదేశం.
ఈ మార్గంలో నేచర్ టూరిజం అభివృద్ది వల్ల భద్రతా పరంగా కూడా ఎలాంటి ముప్పు ఉండబోదనేది షార్ సైంటిస్టు ఒకరు వ్యాఖ్యానించారు.

పక్షుల ప్రేమాలయం


శీతాకాలంలో పర్యాటకులు, పక్షి ప్రేమికులకు సూళ్లూరుపేట మీదుగా పులికాట్ సరస్సు చెంత వారాంతపు ప్రయాణం అద్భతంగా ఉంటుంది.

రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి టిడిపి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తోంది. శ్రీహరికోట సమీపంలోని పులికాట్ సరస్సు పరీవాహక ప్రాంతం, గ్రామాల్లో నేచర్ టూరిజం అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి. పడవల్లో ప్రయాణిస్తూ,
"పులికాట్ సరస్సులో ప్రేమాయణం సాగిస్తున్న సైబీరియా పక్షులను కెమెరాల్లో బంధించి, ప్రకృతిని ఆస్వాదించడానికి రైలు అందుబాటులోకి తీసుకువస్తాం" అని కేంద్ర మంత్రి నిర్మలమ్మ ప్రతిపాదించారు.
తిరుపతి జిల్లాలో ప్రపంచంలో రెండో పెద్దైన పులికాట్ సరస్సు అభివృద్ధికి ప్రత్యేక ప్రాజెక్టులు ప్రకటించారు. పులికాట్ సరస్సు బర్డ్ వాచింగ్ హబ్ గా మార్పు చేశారు.
1) పులికాట్ సరస్సు: పరీవాహక ప్రాంతంలో పక్షుల సందడిని ఆస్వాదించడానికి అనువైన వాతావరణం కల్పించనున్నారు. దీనికోసం మూడు అత్యాధునిక బర్డ్ వాచింగ్ ట్రయల్స్ ఏర్పాటు చేస్తారు.
2)నేచర్ టూరిజం: క్లస్టర్ పులికాట్ ప్రాంతాన్ని పర్యాటకంగానే కాకుండా,, పర్యావరణ పరిరక్షణలో భాగంగా పర్యాటక క్లస్టర్ గా మార్పు చేయబోతున్నారు.
3)మత్య్సకార, గ్రామీణులకు ఆదాయం: అటకానితిప్ప, బీవీపాలెం, నేలపట్టు, ఇరకందీవి ప్రాంతాల్లో హోం స్టేల ఏర్పాటు తోపాటు స్థానికులను గైడ్లుగా ఏర్పాటు చేస్తారు.

ఐఎంఎం సహకారంతో..

రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ప్రదేశాల్లో అరకు ప్రాంతంతో పాటు పులికాట్ సరస్సు తీరంలో నేచర్ టూరిజం ( Nature tourism) అభివృద్ధికి ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ (Indian Institute of Management IIM) సహకారం తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో వెల్లడించారు. ఈ సంస్థ ద్వారా అరకు, పులికాట్ సరస్సు ప్రాంతాల్లోని మత్స్యకారులు, ఇతరులరు గైడ్లుగా తీర్చిద్దడానికి కార్యాచరణ సిద్ధం చేసినట్లు ఆమె వెల్లడించారు.
"12 వారాల శిక్షణతో స్థానికులకు గైడ్లుగా తీర్చిదిద్దడానికి శిక్షణ ఇస్తాం. అరకు తోపాటు పులికాట్ ప్రాంత గ్రామీణులకుపది వేల మందిని సుక్షితులను చేస్తాం. తద్దారా వారి జీవన ప్రమాణాలు పెంచుతాం" అని కేంద్ర మంత్రి సీతారామన్ చెప్పారు.
రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ఇదో మరింత తోడ్పాటు అందిస్తుందని సూళ్లూరుపేట ప్రాంత సీనియర్ జర్నలిస్టు రమణయ్య అభిప్రాయపడ్డారు. పులికాట్ సరస్సు మీదుగా శ్రీహరికోట వద్ద ఉన్న షార్ కు ప్రధాన మార్గంగా ఉంది.

రోడ్డు రైలు మార్గం..

పులికాట్ సరస్సులో (Pilicat lake) విహరించే పక్షుల సందర్శనకు వెళ్లడానికి ప్రస్తుతం రోడ్డు, రైల్వే మార్గాలు కూడా ఉన్నాయి. అందులో సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ కు తిరుపతి తోపాటు చెన్నై సెంట్రల్ ( Chennai Central) నుంచి రైళ్లు అందుబాటులో ఉన్నాయి. సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ నుంచి పులికాట్ సరస్సు వద్దకు ఆటో లేదా కారు వంటి వాహనాల్లో మూడు కిలోమీటర్లు ప్రయాణించే వెళ్లడానికి మార్గం ఉంది. పులికాట్ సరస్సు చిత్తడి నేలలో నిలిచే నీటిలో ఫ్లెమింగో పక్షులతో పాటు ఇంకా అనేక రకాల పక్షులను ప్రతి ఏటా నవంబర్ నుంచి ఫిబ్రవరి నెల చివరి వరకు చూడవచ్చు.

వలస పక్షులకు నిలయం..


తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని దొరవారిసత్రం మండలంలోని నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం. 458.92 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ ప్రదేశానికి ఏటా విదేశీ పక్షులు చలికాలంలో వేల మైళ్లు ప్రయాణించి ఆహారం కోసం వస్తుంటాయని సూళ్లూరుపేట డీఎఫ్ఓ హారిక చెప్పారు. ఈ కేంద్రంతో పాటు పులికాట్ సరస్సు, బీవీ పాలెం, ఇరకం దేవి ప్రాంతాలకు సైబీరియా పక్షులు ప్రతి సంవత్సరం శీతాకాలంలో వేల సంఖ్యలో వస్తుంటాయి. ఒంటరిగా వచ్చే ఆడ, మగ పక్షుల ప్రేమాయడానికి నేలపట్టు, పులికాట్ సరస్సు కేంద్రంగా మారింది. ఇక్కడ గురుడు పోసుకునే పక్షులకు ఈత నేర్పడంతో పాటు ఆహారం వేట కూడా తల్లి పక్షి నేర్పిస్తుంది. ఆరు నెలల తర్వాత ఈ విదేశీ విధంగాను సైబీరియా ప్రాంతానికి మార్చి ఏప్రిల్ నెలలో తిరిగి వెళుతూ ఉంటాయి. పులికాట్ సరస్సు సమీప ప్రాంతాల్లో ఈ అద్భుత దృశ్యాలకు ఫ్లెమింగో ఫెస్టివల్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరిలో ఓ పండుగ నిర్వహిస్తోంది.

బోటులో ప్రయాణిస్తూ..


పులికాట్ సరస్సులో పడవలపై ప్రయాణిస్తూ కూడా ఫ్లెమింగ్ పక్షులతో పాటు మిగతా విదేశీ వలస పక్షుల సందడి ఆస్వాదించడానికి ఆస్కారం ఉంది. సూళ్లూరుపేట నుంచి సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే, మత్స్యకారులకు నిలయమైన బీవీ.పాలెం వద్దకు చేరవచ్చు. రైల్వే ట్రాక్ దాటిన తరువాత రోడ్డు మార్గంలో కొంతదూరం ప్రయాణిస్తే, ఏపీ పర్యాటక శాఖ (AP Tourism Department) రిసార్ట్స్ సమీపంలోని పులికాట్ సరస్సు స్వాగతం పలుకుతుంది. ఇక్కడ మరబోట్లపై మత్స్యకారుల సాయంతో నీటిపై ప్రయాణింవచడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ప్రదేశం రైల్వే ట్రాక్ కు అత్యంత సమీపంలోనే ఉంటుంది. బీవీ. పాలెం నుంచి సూళ్లూరుపేట వరకు పులికాట్ సరస్సు సమీపం నుంచి సాగే ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

రైల్వే ట్రాక్ సమీపంలోనే..

చెన్నై నుంచి హౌరా ప్రయాణించే మార్గంలోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ ప్రధాన మార్గం. ఢిల్లీ, చెన్నైకి కూడా అనుసంధానంగా ఉన్న సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ కు రోజూ 39 రైళ్లు ప్రయాణిస్తుంటాయి. నాలుగు రైళ్లు ఇక్కడి నుంచే ప్రయాణం ప్రారంభిస్తాయి. దేశంలో అంతర్రాష్ట్ర సబర్బన్ రైలు నడిచే ఏకైక రైల్వే ష్టేషన్ గా కూడా గుర్తింపు ఉంది. చెన్నై ఎంఎంసీ స్టేషన్ నుంచి సూళ్లూరుపేట ఈఎంయూ) రైలు ప్రయాణిస్తుంది. పులికాట్ సరస్సులోకి బంగాళాఘాతం బ్యాక్ వాటర్ చేరుతుంది. ఇవన్నీ చిత్తడి నేలలు కావడం వల్ల విదేశీ వలస పక్షులకు విడిదిగా మారింది. ఈ ప్రదేశంలో గాలి చప్పుడు, నీటి అలలు మినహా కాలుష్యానికి ఆస్కారం లేదు.

పులికాట్ సరస్సులో..

సూళ్లూరుపేట నుంచి శ్రీహరికోట వద్ద ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి వెళ్లాలంటే రోడ్డు మార్గంలో పులికాట్ సరస్సును చూస్తూ ప్రయాణించవచ్చు. ఈ మార్గానికి రెండు పక్కల విస్తరించి ఉన్న సరస్సులోని చిత్తడి నేలల్లో ఫ్లెమింగో పక్షులకు నిలయం. వాటితో పాటు 118 రకాల పక్షి జాతులు ఇక్కడ కనువిందు చేస్తాయి. ఈ మార్గంలో ఫ్లెమింగో పక్షులతో పాటు పెలికాన్స్, ఎర్రకాళ్ల కొంగలు, నారాయణ పక్షులు, నత్తగుల్ల కొంగలు, నీటికాకుల, తెల్ల కంకణాయిలు, నల్ల కంకనాణయిలు, శబరి కొంగలు, నీలొల్లి వంటి పక్షులు నీటిలో ఆహార అన్వేషణతో పాటు ప్రేమాయణం సాగించే దృశ్యాలు, చిన్న సవ్వడికే రెక్కలు విప్పి, ఆకాశంలో చక్కర్లు కొట్టే దృశ్యాలు కనువిందు చేస్తుంటాయి.
Read More
Next Story