
కడప జిల్లా రాజంపేటలో అగ్నిప్రమాదం. సజీవదహనమైన వ్యక్తి
కడప:చుట్టుముట్టిన మంటల.. పొగతో ఒకరి సజీవ దహనం
రాజంపేట వద్ద లాడ్జిలో 36 మందికి తృటిలో తప్పిన ప్రాణగండం.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సకాలంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది రంగంలోకి దిగడంతో అదృష్టవశాత్తు 36 మంది ప్రాణాలతో బయటపడ్డారు.
"రాజంపేట పట్టణంలోని దీప్ లాడ్జిలో బుధవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. చుట్టుముట్టిన పొగతో ఊపిరాడక ప్రాణభయంతో లాడ్జిపైకి కొందరు చేరుకున్నారు. జనసంచారం తక్కువగా ఉండే ఆ సమయంలో లాడ్జిపై నుంచి కేకలు వినిపించడం, దట్టమైన పొగ గమనించిన కొందరు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. రాజంపేట ఏఎస్పీ రాంనాథ్ హెడ్గే ఘటనపై సమీక్షిస్తున్నారు.
కడప జిల్లా రాజంపేట పట్టణంలో జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలు ఇవి. రాజంపేట పట్టణం రైల్వే స్టేషన్ కు వెళ్లే మార్గంలో డీప్ లాడ్జి ఉంది. బుధవారం అర్ధరాత్రి ఈ లాడ్జిలో ఒక్కసారిగా మంటలు జరగయ్యాయి. క్షణాల వ్యవధిలోనే 22 గదులకు వేగంగా మంటలు వ్యాపించాయి. మూడు అంతస్తులో ఉన్న ఈ లాడ్జిలో అన్ని గదులకు పొగ చుట్టుముట్టింది, లోపల నిద్రిస్తున్న వారు బయటకు వచ్చిందో కూడా తీవ్ర ఇబ్బందిపడ్డారు.
ఈ అగ్నిప్రమాదం జరిగిన సమయం అర్ధరాత్రి కావడంతో జనసంచారం తక్కువగా ఉండే ఈ మార్గంలో సహాయక చర్యలు వెంటనే చేపట్టలేకపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సకాలంలో రావడంతో భారీ ప్రాణనష్టం జరగకుండా కాపాడారు. లాడ్జిలో మంటలు వ్యాపించి దట్టమైన పొగ అలుముకుంది. సకాలంలో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అలాగే ప్రమాదంలో చిక్కుకున్న వారిని కిటికీలా గుండా కిందకు దించి కాపాడారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
ఒకరి సజీవ దహనం
రాజంపేట పట్టణంలోని డీప్ లాడ్జిలో అగ్నిప్రమాదం జరిగే సమయానికి గదుల్లో 33 మంది ఉన్నట్లు అధికారులు ద్వారా తెలిసిన సమాచారం. ఈ ప్రమాదంలో ప్రొద్దుటూరు మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన వెంకట శ్రీనివాస్ అనే వ్యక్తి సజీవ దహనం అయ్యారని తెలిసింది. గదిలో నిద్రిస్తుండగా దట్టమైన పొగలు చుట్టుముట్టడంతో ఊపిరాడక మరణించినట్లు భావిస్తున్నారు.
32 మంది సురక్షితం
ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న బాధితులను పరామర్శిస్తున్న రాజంపేట ఏఎస్పీ రాంనాథ్ హెడ్గే
రాజంపేట పట్టణంలోని లాడ్జిలో అగ్నిప్రమాదం జరిగిందని సమాచారం అందగానే అగ్నిమాపక దళ సిబ్బంది రంగ ప్రవేశం చేశారు. గదుల్లో చిక్కుకున్న 32 మందిని సురక్షితంగా బయటికి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తీవ్రంగా గాయపడిన వారందరినీ చికిత్స కోసం రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న బాధితులను రాజంపేట ఏఎస్పీ రాంనాథ్ హెడ్గే పరామర్శించారు. వారందరికీ మెరుగైన చికిత్స అందించడానికి శ్రద్ధ తీసుకున్నట్లు చెప్పారు.
"బాధితుల్లో ఎవరికీ ప్రాణాపాయం లేదు. కుటుంబీకులు ఆందోళన చెందవద్దు. ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డారు" అని రాజంపేట ఏఎస్పీ రాంనాథ్ హెడ్గే సూచించారు.
లోపాలు ఆలస్యంగా గుర్తించారు..
రాజంపేట పట్టణంలోని దీప్ లాడ్జిలో అగ్ని ప్రమాదం జరిగిన ఘటన నేపథ్యంలో నిబంధనలు తెరపైకి వచ్చాయి. ఘటనా స్థలాన్ని రాజంపేట అర్బన్ పోలీసుల పరిశీలించి కేసు నమోదు చేశారు. అగ్ని బాపక నిబంధనలు పాటించడంలో లోపాలు ఉన్నాయా అనే కోణంలోకి అధికారులు విచారణ జరుపుతున్నారు. అంటే అనుకోని ప్రమాదం జరిగితే, వెంటనే ఆ ప్రమాదాన్ని నివారించడానికి అవసరమైన పరికరాలు ఉన్నాయా లేదా అనేది కూడా తరచూ తనిఖీలు చేసిన దాఖలాలు లేవనే విషయం ఇక్కడ స్పష్టమవుతున్నట్టు స్థానికులు చెప్పారు.
Next Story

