
మాట్లాడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు
ప్రపంచ చిత్రపటంలో రాష్ట్రాన్ని-1గా నిలుపుతా..
స్వచ్ఛత, విద్యుత్ తయారీతో ఆర్థిక సమృద్ధిపై నగరి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు శపథం.
పరిశుభ్రత, సోలార్, వ్యర్ధాల నుంచి విద్యుత్ తయారీలో ఏపీని ప్రపంచ చిత్రపటంలో మొదటిస్థానంలో నిలుపుతానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శపథం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన వెల్లడించారు. దీనికోసం ఎస్సీ,ఎస్టీల తోపాటు బీసీలకు సోలార్ పథకంలో రాయితీలు ప్రకటించారు. స్వచ్ఛంధ్ర అనేది మన జీవన విధానం కావాలని కూడా ఆయన కర్తవ్యాన్ని గుర్తు చేశారు. పరిశుభ్రత పాటించడంలో ప్రజల ఆలోచనలు మార్చుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కోరారు.
"సోలార్ వచ్చింది. పేదలకు అండగా ఉంటా. ఇళ్లపై కరెంటు ఉత్పత్తి చేసుకోండి. ఎస్సీ, ఎస్టీలకు సోలార్ ప్యానెళ్లు ఉచితంగా ఇస్తా. రైతులకు ఫ్రీగా సోలార్ పెట్టిస్తాం. బీసీలకు రూ.90 సబ్సిడీ ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 60 వేలకు తోడు రాష్ట్రం నుంచి అదనంగా రూ.20 వేలు సబ్సిడీ మంజూరు చేస్తా" అని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు.
చిత్తూరు జిల్లా నగరి జూనియర్ కాలేజీలో శనివారం మధ్యాహ్నం స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మాట్లాడారు. అంతకుముందు మైదానంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శించారు.స్వచ్ఛంధ్రా కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, చిత్తూరు ఎంపీ దగ్గమళ్ల ప్రసాదరావు, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే ఎంవీ. థామస్, జిల్లాలోని ఎమ్మెల్యేలు మురళీమోహన్ (పూతలపట్టు ), పులివర్తి నాని ( ఎమ్మెల్యే), నెలవల విజయశ్రీ (సూళ్లూరుపేట) పాల్గొన్న ఈ సభలో చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ పారిశుధ్యంపై తీసుకుంటున్న చర్యలు వివరించారు.
ఏదీ వృథా కాదు..
సృష్టిలో ఏదీ వృధా కాదు. చెత్త నుంచి కూడా సంపద సృష్టింవ వచ్చు. చెత్తను రీసైక్లింగ్ చేసి విద్యుత్ను ఉత్పత్తి చేయెచ్చు. అనే సంకల్పంతో ఏడాది క్రితం స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర ఓ ఉద్యమంగా ప్రారంభించామని ఆయన గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో జన్మభూమి, క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు చేపట్టి స్వచ్ఛత కోసం పనిచేశామని ఆయన చెప్పారు.
"పరిశుభ్రత విషయంలో మన అందరి ఆలోచనలూ మారాలి. ఇల్లే కాదు. పరిసరాలు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హితవు పలికారు. గత ప్రభుత్వం లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను పట్టణ ప్రాంతాల్లో వదిలేసి వెళ్లిపోవడం వల్ల భూమి, భూగర్భ జలాలు, వాయు కాలుష్యం పెరిగిపోయిందన్నారు.
చెత్త నుంచి విద్యుత్
రాష్ట్రంలో ఇళ్ల నుంచి సేకరిస్తున్న వ్యర్ధాల ద్వారా విద్యుత్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పారు. దీనివల్ల డ్వాక్ర సంఘాలకు ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. వ్యర్ధాల నుంచి నాలుగు యూినట్ల ద్వారావిద్యుత్ తయారీ జరుగుతోందని, రాజమండ్రి, విజయవాడలో కూడా ఇదే తరహా యూనిట్లు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. వీటితో పాటు కాంపోస్టు ఎరువు తయారీ కోసం ప్రత్యేకంగా కార్యాచరణ చేపట్టామని తెలిపారు.
"ప్లాస్టిక్, ఇ-వేస్ట్ సేకరించేందుకు 130 స్వచ్ఛ రథాలను ఏర్పాటు చేశాం, 2026 మార్చి నాటికి 660 స్వచ్ఛ రథాలను రాష్ట్రవ్యాప్తంగా తీసుకువస్తాం" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వెల్లడించారు. విద్యార్థి దశ నుంచి పిల్లలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా పాఠశాలల్లో విద్యార్ధులు పరిశుభ్రంగా ఉండడానికి "ముస్తాబు" అనే వినూత్న కార్యక్రమం చేపట్టాం" అని ముఖ్యమంత్రి వెల్లడించారు. దీనివల్ల విద్యార్ధులకు ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసమూ పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేలకు లక్ష్యాలు..
టీడీపీ పోటీకి నిలిపిన అభ్యర్థుల్లో 94 గెలిపించిన ఏకైక రాష్ట్రం ఏపీనే అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్పష్టం చేశారు. ఇది మా బాధ్యత మరింత పెంచిందని ఆయన చెప్పారు.
"ప్రజలకు సేవలు అందించడానికి 'పేదల సేవలో' కార్యక్రమంతో ఎమ్మెల్యేలకు ప్రత్యేక కార్యాచరణ ఇచ్చాం. సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ చేశాం. అన్నదాత సుఖీభవ, సామాజిక పింఛన్లు పెంచిన మొత్తంతో చెల్లిస్తున్నాం. ఏడాదికి 33 వేల కోట్ల రూపాయలు పింఛన్లు పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం" అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.
"ఈ రోజు మీలో ఇంత ఉత్సాహం ఉందంటే, అందరికీ తల్లికి వందనం అందుతోంది, స్త్రీ శక్తి కింద ఫ్రీగా బస్సులో ఎక్కడికి కావాలన్నా మా ఆడ బిడ్డలందరూ తిరిగే పరిస్థితి. ఉంది. దీపం- 2 కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం" అని కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గుర్తు చేశారు. అందరూ ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని గుర్తు చేసిన సీఎం చంద్రబాబు పారిశుద్ధ్యం మెరుగుదలకు సహకారం అందించాలని కోరారు.
"మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. తాగే నీరు సురక్షితంగా ఉండాలి. తినే తిండి కాలుష్యం లేకుండా ఉండాలి. ఇవన్నీ సవ్యంగా సాగాలంటే ఆలోచనలు కూడా బాగుండాలి" అని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
సింగపూర్ స్ఫూర్తితో..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసిన కార్యక్రమాలు ప్రస్తావించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఏమన్నారంటే..
"నేను సింగపూర్ కి వెళ్ళాను. సింగపూర్ లో రోడ్లు పరిశుభ్రంగా ఉంటాయి. . . ఆలోచన స్వచ్ఛంగా ఉంటుంది. . . గాలి స్వచ్ఛంగా ఉంటుంది . . . అందరికీ ఆదాయం పెరిగింది. . . అది చూసిన తర్వాత హైదరాబాద్ లో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో జన్మభూమి, పచ్చదనం పరిశుభ్రం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను" అని ఆ నాటి పరిస్థితిని గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత స్వచ్ఛ భారత్ రూపకల్పనలో తనదే కీలక పాత్ర అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వెల్లడించారు.
"ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెడితే, నన్ను చైర్మన్ గా పెట్టి 10 మంది సీఎంలు, అధికారులంతా కలిసి దీనికి విధివిధానాలు తయారు చేశాం" అని చెప్పారు.
ప్రతి ఇంటికీ రూ.200 ఆదాయం
రాష్ట్రంలో ఏడాది నుంచి స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం ఒక ఉద్యమంగా చేపట్టామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరులో రూ.573 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం తయారు చేశామని చెప్పారు. స్వచ్ఛాంధ్ర మిషన్ ద్వారా పట్టణ ప్రాంతాల్లో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కింద 101 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు రూ.510 కోట్లతో మంజూరు చేశామన్నారు.
"మీ ఇంట్లోనే పొడి, తడి చెత్త తో కాంపోస్ట్ గా తయారు చేస్తే, అదనంగా రూ.200 ఆదాయం వస్తుందని ఆయన గుర్తు చేశారు.
అనారోగ్య పాపం వైసీపీదే..
వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నిరసన వ్యక్తం చేశారు.
"రాష్ట్రంలో 105 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పట్టణాల్లో వదిలేసింది. ఆ చెత్త గుట్టలుగా మారింది. వర్షం పడితే, ఆ నీరంా ఇంకిపోవడంతో భూగర్భ జలాలుగా కలుషితం అయ్యాయి. ఆ నీళ్లు తాగే పరిస్థితి వల్ల రోగాలు ప్రబతులుతున్నాయి" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో చెత్త తొలగింపు ఉద్యమ స్ఫూర్తితో పని చేస్తున్నామని ఆయన చెప్పారు. దాదాపు 90 శాతం పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఈ లెగసీ వేస్ట్ అంతా కూడా క్లియర్ చేశాం. 1.12 లక్షల టన్నుల చెత్త పూర్తిగా తీసేసే బాధ్యత తీసుకుంటామని ఆయన చెప్పారు.
"పట్టణ ప్రాంతాల్లో 97.2 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 62 శాతం చెత్త సేకరిస్తున్నాం. మార్చి నాటికి వంద శాతం చెత్త సేకరించే పనులు చేపడతాం" అని ఆయన తెలిపారు.
పరిశుభ్రత కోసం తీసుకుంటున్న చర్యలు ఆయన వివరించారు.
"47 పట్టణాల్లో 30 లక్షల ఈ వేస్ట్ ని కలెక్ట్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో నూటికి నూరు శాతం ఈ - వేస్ట్ కలెక్ట్ చేసి, దానికి ప్రతి ఫలంగా కొంత డబ్బు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొస్తాం. పదమూడు నగరాల్లో రోడ్లన్నీ శుభ్రంగా చేయడానికి 71 భారీ స్వీపింగ్ మిషన్లు తీసుకువస్తున్నాం.
పట్టణాల్లో 108 మిలియన్ లీటర్ల మురుగునీరు ఉంది. 33 పట్టణాలలో 33 ప్లాంట్లు పెట్టాం. ఇంకా ఒక 82 ఏర్పాటు చేస్తాం" అని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
చెత్తతో విద్యుత్
రాష్ట్రంలో చెత్త నుంచి విద్యుత్ తయారీకి నాలుగు ప్రాజెక్టులు వచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వెల్లడించారు. విశాఖపట్నం,
గుంటూరులో ఇచ్చాయనీ, కర్నూలు, రాజమండ్రి, కడప, నెల్లూరు లో నాలుగు ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇవి కాకుండా తిరుపతి, విజయవాడలో ఇంకో రెండు ప్రాజెక్టులు ఏర్పాటయ్యే అవకాశం ఉందన్నారు.
"ఈ కార్యక్రమం డాక్రా సంఘాలకు అప్పజెప్పాం. వారు తయారు చేసిన కంపోస్ట్ ఎరువు రైతులకు సరఫరా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. తద్వారా వారి జీవనప్రమాణాలు పెరగడానికి మార్గం ఏర్పడింది" అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.
మార్చి నాటికి స్వచ్ఛరథాలు ఇంకా 660 వస్తాయి. ప్రతి ఇంట్లో ఉండే చెత్త నూటికి నూరు శాతం సేకరణకు చర్యలు తీసుకుంటామన్నారు. 2018లో రాష్ట్రాన్ని ఓడిఎఫ్ గా తయారు చేశాం. ఇప్పుడు ఓడిఎఫ్ ప్లస్ గా వెళ్తున్నాం అని కూడా ఆయన వివరించారు.
Next Story

