
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు
2027 నాటికి రెవెన్యూ సమస్యలు లేని రాష్ట్రమే లక్ష్యం..
విజన్ డాక్యుమెంట్ ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
ప్రతి నెలా 9న పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ
వెడ్డింగ్ డెస్టినేషన్ కేంద్రంగా తిరుపతి
మూడు మెగాసిటీల అభివృద్ది
రాష్ట్రంలో 2027 నాటికి రెవెన్యూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పారు. గ్రీవెన్ సెల్ తరహాలోనే ప్రతి నెలా తొమ్మిదో తేదీ పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని అమలు చేస్తానన్నారు. ఈ సంవత్సరంలో సంజీవని పథకం రాష్ట్రమంతా విస్తరించనున్నట్లు కూడా ఆయన వెల్లడించారు తిరుపతిని వెడ్డింగ్ డెస్టినేషన్ కేంద్రంగానే ఈ నగరం తోపాటు అమరావతి, విశాఖను "మెగా సిటీలు"గా అభివృద్ధి చేయడానికి కార్యాచరణ సిద్ధం చేసినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వెల్లడించారు. సంక్రాంతి పండుగకు సొంత ఊరు నారావారిపల్లెలో విడిది చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ ప్రకటించారు.
" రెవెన్యూ సమస్యలు పరిష్కరించడానికి సంవత్సరం పాటు నిరంతరాయంగా జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లు పనిచేస్తారు" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పారు. ఆయన ఇంకా ఏమి చెప్పారంటే..
"గత ప్రభుత్వంలో ఇష్టం లేని వారి భూములు 22ఏలో పెట్టారు. దీనిపై గందరగోళం సృష్టించారు. మేం ఏడాది టార్గెట్ పెట్టుకుని సర్వే పూర్తి చేయిస్తాం. రూపాయి కూడా లేకుండా క్యూఆర్ కోడ్ తో పుస్తకాలు ఇస్తాం" అని ఆయన స్పష్టం చేశారు.
మూడు మెగా సిటీలు
రాష్ట్రంలో మూడు మెగా సిటీలను అభివృద్ది చేసే దిశగా కార్యాచరణ అమలు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తెలిపారు. తిరుపతి, విశాఖ, అమరావతిని మెగా సిటీలుగా తీర్చిదిద్దుతాం అని ఆయన స్పష్టం చేశారు. అందులో భాగంగానే పర్యాటక రంగాన్ని కూడా కొత్త పుంతలు తొక్కించే విధానం రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు.
"పర్యాటక రంగం అభివృద్దిలో భాగంగా తిరుపతి, రూరల్ ప్రాంతంలో హోం స్టేల కూడా ప్రాధాన్యం ఇస్తాం. చెరువులకుతిరుపతి, కెనాల్స్ కు విజయవాడ, బీచ్ కు విశాఖ ప్రసిద్ధి. ఈ ప్రదేశాల్లో పర్యాటక రంగం అభివృద్ధితో పాటు రాబోయే రోజుల్లో తిరుపతిని వెడ్డింగ్ డెస్టినేషన్ హబ్ గా మారుబోతోంది" అని ముఖ్యమంత్రి వివరించారు.
ఆరోగ్యవంతమైన నగరాలు..
ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంలో భాగంగా పరిశుభ్రంతో కూడిన ఆరోగ్యవంత నగరాలుగా తీర్చిదిద్దడానికి కూడా ప్రణాళిక అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పారు. ఆరోగ్య కరమైన సొసైటీని తయారు చేస్తాం అని చెప్పిన ఆయన ఏమన్నారంటే..
"వంద శాతం చెత్త సేకరించి శాగ్రిగేషన్ చేస్తున్నాం. తడి చెత్త నుంచి కంపోస్ట్, పొడి చెత్తను సర్య్కులర్ ఎకానమీకి పంపుతున్నాం. తద్వారా పరిశుభ్రమైన గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నాం" అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.
ఆరోగ్యాంధ్రప్రదేశ్ విషయాలను ప్రస్తావిస్తూ, ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ, కుప్పంలో సంజీవని పథకాన్ని ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అక్కడ ఈ కార్యక్రమం సఫలమైందన్నారు. ఆ ఫలితాలతో చిత్తూరు జిల్లాలో అమలు చేస్తున్న ఈ పథకాన్ని ఈ సంవత్సరం రాష్ట్రంలో విస్తరింప చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
రంగపేటకు ఎన్ హెచ్ అనుసంధానం
అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే రవాణా వ్యవస్థను మరింత వేగం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పారు. అందులో భాగంగా చిత్తూరు జిల్ల చంద్రగిరి నియోజకవర్గం రంగంపేను జాతీయ రహదారికి అనుసంధానం చేయనున్నట్లు ఆయన తెలిపారు.
చిత్తూరు జిల్లాలో అభివృద్ధికి సంబంధించి మాట్లాడుతూ,
"చంద్రగిరి మండలం మూలపల్లె రిజర్వాయర్ కు హంద్రీనీవా కాలువ ద్వారా నీటిని పైప్ లైన్ నిర్మాణంతో తీసుకుని వస్తాం. దీని వల్ల అన్ని రిజర్వాయర్లు నీళ్లతో కళకళలాడతాయి. ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహిస్తాం. డెయిరీ పెద్ద ఎత్తున టేకప్ చేస్తున్నాం. నారావారిపల్లెలో స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్ కూడా ప్రారంభించాం. స్కిల్స్ పెంచి అప్ గ్రేడ్ చేస్తాం. కేర్ అండ్ గ్రో కార్యక్రమం ద్వారా అంగన్వాడీ ఆయాలకు ట్రైనింగ్ ఇస్తాం. రంగంపేట హైస్కూల్, జూనియర్ కాలేజీ కేంద్రంగా ఎడ్యుకేషన్ పై దృష్టి పెట్టాం. శెట్టిపల్లి భూ వివాదాన్ని కూడా పరిష్కరించాం" అని వివరించారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం ద్వారా ప్రజలకు మెరుగైన పాలన అందించే దిశగానే కూటమి ప్రభుత్వం నిర్ణయాలు, పాలన ఉంటుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
Next Story

