కలకడ ముస్లిం కోటలో.. దేవళంపేట.. ప్రత్యేకత ఏమిటి?
x

ఝరికోన తిరునాళ్ల

కలకడ ముస్లిం కోటలో.. దేవళంపేట.. ప్రత్యేకత ఏమిటి?

చిత్తూరు:దేవరగట్టు బన్నీ ఉత్సవాన్ని తలపించే వేడుక ఎక్కడంటే..


రెండు నదుల సంగమం

ముస్లింపేటలో ఆలయం

రేపు ఝరి కోన జాతర..

రెండు నదుల సంగమ కేంద్రం. సమీపంలోనే దేవళంపేట గ్రామం. ఈ గ్రామంలో హిందువుల కంటే ముస్లిం కుటుంబాల సంఖ్యే ఎక్కువ. ఈ పల్లెకు సమీపంలో ఝరికోన వద్ద దేవరట్టు బన్నీ ఉత్సవాని తలపించే వేడుక కనువిందు చేయనుంది. ఏటా మహాశివరాత్రి తరువాతి రోజు నిర్వహించే ఈ ఉత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భారీగా హాజరవుతుంటారు. దేవళంపేట ఎదురెదురుగా ఉన్న హిందూ, ముస్తిం వీధులు స్థితి కూడా విచిత్రంగా ఉండేది.


చిత్తూరు జిల్లా పీలేరు, రాయచోటి మార్గంలో కడప జిల్లా సరిహద్దులోని కలకడ మండలం వద్ద ఉన్న దేవళంపేట, ఝరికోన జాతరకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ రెండు ప్రదేశాలు రాయచోటి నియోజకవర్గం సోంబేపల్లి మండలంలో ఉన్నాయి.
"మతసామరస్యం ఎలా ఉంటుందనేది చూడాలంటే ముస్లింలు అధికంగా ఉన్న దేవళంపేటను చూడాల్సిందే" సోంబేపల్లి మండలం అని సోత్రియం సోమవారం ( S. Somavaaram (Monday) సర్పంచ్ క్యూ. విశ్వనాథ సూచించారు.

రెండు నదుల సంగమం


పీలేరు నుంచి గంట ప్రయాణం చేస్తే కలకడ మండల కేంద్రానికి చేరవచ్చు. ఇక్కడి నుంచి రాయచోటి మార్గంలో ఆరు కిలోమీటర్లు వెళితే, బాహుదా, సత్యవతి నదుల సంగమాన్ని గమనించవచ్చు. ప్రధాన రోడ్డు పైనుంచి కిలోమీటరు వెళితే దేవళంపేట కనిపిస్తుంది. ఎవరినీ అడగకుండానే ఎదురుగా కనిపించే కామాక్షి సమేత సిద్దేశ్వరాలయం దేవళంపేటలోకి ప్రవేశించడానికి స్వాగతం పలుకుతుంది. ఈ ఆలయానికి కుడిపక్క వీధి మొత్తం దాదాపు 60 నుంచి 70 ముస్లిం కుటుంబాలతో ఉన్న వీధి. వారి వీధిలోనే మసీదు కూడా ఉంటుంది. ఈ వీధికి ఎదురుగానే సుమారు పది తెలుగు కుటుంబాలు కనిపిస్తాయి.

ప్రత్యేకత జిల్లాల విభజనకు ముందు దేవళంపేట భౌగోళిక స్వరూపా ఆసక్తికరంగా ఉండేది. కామాక్షీ సమేత సిద్ధేశ్వరాలయం వెనుక ఉన్న ముస్లింలు నివసించే వీధి కడప జిల్లాలో ఉండేది. ఈ వీధికి ఎదురుగా ఉన్న తెలుగు వారి కుటుంబాలు కలకడ మండలం ద్వారా చిత్తూరు జిల్లాలో ఉండేవి. ప్రస్తుతం సంబేపల్లి మండలంలోకి చేర్చారు.
దేవళంపేటగా చారిత్రక గుర్తింపు ఉన్న కామాక్షి సమేత సిద్ధేశ్వరాలయంలో ఛత్రపతి శివాజీ సేదదీరినట్టు కథనం ఉంది. ఇక్కడ గుడి గంటలు మోగినా, వేదమంత్రాలతో పూజలు జరుగుతుంటాయి. ఆ సమయంలో ఆలయానికి వెనుక ఉన్న ముస్లిం పేటలో ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా, ఆపేసి సహకారం అందిస్తారు. మసీదులో అల్లా.. హు అక్బర్ అని మసీదు నుంచి అజా వినిపించగానే గుడిలో కార్యకలాపాలు ఆపేస్తారు.
అని ఈ ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్టు సుధాకర్ చెప్పారు. మతసామరస్యానికి కలకడ సమీపంలోని దేవళంపేట ఆదర్శంగా నిలుస్తుందని ఆయన అన్నారు.

రథం కాలితే...

కలకడ ప్రాంత ఎన్ఆర్ఐల సహకారంతో చేయించిన రథం

చిత్తూరు జిల్లాలోని పడమటి తాలూకాలు పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పలమనేరు, కుప్పం, పూతలపట్టు నియోజకవర్గాల్లో ముస్లింల సంఖ్య నిర్ణయాత్మక శక్తిగా ఉంటుంది. అంటే ప్రతి గ్రామంలో కూడా సంప్రదాయ ముస్లిం కుటుంబాలు ఎక్కువ. ఈ పరిస్థితుల్లో 1992 డిసెంబర్ ఆరో తేదీ బాబ్రీ మసీదు తరువాత దేశంలో అల్లర్లు చేలరేగిన విషయం తెలిసిందే.

పీలేరు నియోజకవర్గం కలకడ మండలంలో కూడా ఉద్రిక్తత ఏర్పడింది. కలకడలో నిలిపి ఉంచిన దేవళంపేట ఆలయ చెక్కరథాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. దీంతో ముస్లిం పెద్దలు వెంటనే స్పందించారు.
దేవళంపేట ఆలయ అధ్యక్షుడు, పెద్దలను కలిసిన ముస్లింలు వివరణ ఇచ్చారు. దాదాపు ఐదు లక్షలు చందాలు వసూలు చేసి, రథం తయారీకి సహకారం అందించారు. అనే విషయం ఆ ప్రాంతానికి చెందిన కొందరి మాట.

ఆ రథం కాలక్రమంలో శిథిలం కావడంతో ఎన్ఆర్ఐల సహకారంతో కొత్త రథం తయారు చేయించారు. మండలంలో హిందూ, ముస్లింల మధ్య అన్యోన్యం ఉందనేది జర్నలిస్టు సధాకర్ తోపాటు సర్పంచ్ విశ్వనాథ కూడా గుర్తు చేశారు.

"దేవళంపేట ఆలయంలో పనిచేసే సిబ్బంది, సేవలు చేసే హిందువులు పది కుటుంబాలు ఉంటాయి. 70 కుటుంబాలు ముస్లింలు ఉన్నా, ఎప్పుడూ తేడాలు రాలేదు. రావు కూడా. దీనికి ప్రధాన కారణం గ్రామీణ స్నేహ భావమే ఇక్కడ కనిపిస్తుంది" అని సర్పంచ్ విశ్వనాథ అభిప్రాయపడ్డారు.

రేపు ఝరికోన జాతర


కలకడకు సమీపంలోని ఝరికోనకు ప్రత్యేకత ఉంది. బాహుదా, సత్యవతీ నదుల సంగమంతో ఝరికోనలో ప్రవాహం సాగుతుంది. దేవళంపేట వద్ద భూ గర్భంలో అదృశ్యమయ్యే నదీ ప్రవాహం ఆరు కిలోమీటర్ల దూరంలో కోనలో ఊటతో ప్రారంభమయ్యే నీరు ప్రవాహంగా మారుతుంది. దీనికి కింది భాగంలోనే రాయచోటి నియోజకవర్గంలో సంబేపల్లెలో పాటు ఐదు వేల ఎకరాలకు సాగు నీరు అందించే లక్ష్యంతో సుండుపల్లె మండలంలో ఝరికోన ప్రాజెక్టు నిర్మించారు.

కలకడకు సమీపంలో ప్రారంభమయ్య ఝరికోన వద్ద సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే జాతర కర్నూలు జిల్లాలోని ఆలూరు వద్ద జరిగే దేవరట్టు బన్నీఉత్సవాన్ని తలపిస్తుంది.
కోనకు రెండు వైపులా ఉన్న గట్లపై నుంచి కేకలు వినిపిస్తుంటాయి. గ్రామీణుల మధ్య యుద్ధం ప్రారంభం అవుతుందేమో అని అనిపిస్తుంది. దేవరఎద్దును అలంకరించి వాటి వెనుక రాజుల కాలం నాటి ఖడ్గాలతో విన్యాసాలు. కర్రలు గాలిలో ఊపుతూ కేకలతో ఝరికోన నీటి వద్దకు పరుగులెత్తడం కనిపిస్తుంది. కోన నీటిలో సారె సమర్పించడం ద్వారా ముక్కులు చెల్లించి వెనుదిరగడంతో ఈ ఉత్సవం ముగుస్తుంది.
ఝరికోన జాతరకు పీలేరు, కలకడ, రాయచోటి ప్రాంతాల నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపడానికి ఏర్పాట్లు చేశారిన ఎస్. సోమవారం గ్రామ సర్పంచ్ విశ్వనాథ చెప్పారు. ఝరికోన జాతరకు నాలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరవుతారని, స్థానికుల ఇళ్లకు బంధువుల తాకిడి కూడా ఎక్కువ ఉంటుందని ఆయన చెప్పారు. రద్దీకి అనుగుణంగా కోన వద్ద చలువ పందిళ్లు, మంచినీరు, విద్యుద్దీపాలు ఏర్పాటు చేసినట్టు ఆయన వివరించారు.

Read More
Next Story