BREAKING | అన్నమయ్య జిల్లాలో మరో అఘాయిత్యం...
x

BREAKING | అన్నమయ్య జిల్లాలో మరో అఘాయిత్యం...

పీలేరులో ఐదేళ్ల బాలికపై లైంగికదాడి యత్నం..


అన్నమయ్య మదనపల్లె జిల్లాలో మానవత్వం మంట గలిపే మరో సంఘటన కలవరానికి గురి చేసింది. పీలేరు పట్టణంలో నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు పంజా విసిరాడు. ఈ ఘటనతో గురువారం రాత్రి పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. గురువారం సాయంత్రం ఇంటి వద్ద ఆడుకుంటున్న ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడుతూ పట్టుబడ్డాడు. స్థానికుల చేతిలో చావుదెబ్బలు తిని పీలేరు ప్రభుత్వాస్పత్రికి చేరాడు. నిందితుడిని తమకు అప్పగించాలంటూ విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు.


ఈ సంఘటనపై పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు.

24 గంటలు గడవకనే..

మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య సంఘటన రాష్ట్ర వ్యాపితంగా ఆందోళన రేకెత్తించింది. ఈ ఘటనలో నిందితుడు కులవర్ధన్ సందేహాస్పదంగా చెరువులో శవమయ్యాడు. గురువారం సాయంత్రం కులవర్ధన్ మృతేదేహానికి శతపరీక్ష నిర్వహించారు. ఆ శవాన్ని తీసుకునేందుకు కుటుంబీకులు ఎవరూ ముందుకు రాలేదు. అనాథశవంగా పోలీసులు మున్సిపల్ వాహనంలో తరలించి దహన సంస్కారాలు చేశారు. ఈ సంఘటన కనుకొనల నుంచి చెరిగిపోకముందు...

పీలేరులో మరో అఘాయిత్యం...

పీలేరు పట్టణం ఇందిరమ్మ కాలనీ వద్ద ఐదేళ్ల బాలికపై 15 ఏళ్ల యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించడంతో పారిపోయే యత్నంలో ఓ గ్రామంలో తలదాచుకున్నాడు. వెంబడించి, పట్టుకున్న ఆ కామాంధుడికి దేహశుద్ధి చేశారు. ఆ యువకుడిని పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు సమాచారం అందింది.
"అభం శుభం తెలియని బాలికపై లైంగికదాడి యత్నం జరిగిందనే సమాచారంతో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి" దీంతో పీలేరు పట్టణం, ప్రభుత్వాస్పత్రి వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..
తిరుపతి--మదనపల్లి రహదారిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉంది. దీనికి సమీపంలోనే ఇందిరమ్మ కాలనీలో వద్ద నాలుగేళ్ల బాలిక గురువారం సాయంత్రం ఆడుకుంటూ ఉంది. అదే సమయంలో తాపీ మేస్త్రీగా పనిచేసే బాలుడు (16) కన్నెశాడు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న ఆ బాలుడు గురువారం సాయంత్రం తాను పనిచేస్తున్న ఇంటి పరిసరాల్లోకి వచ్చిన ఓ నాలుగేళ్ల బాలికపై అసభ్యంగా ప్రవర్తిస్తుండడం గమనించిన స్థానికులు అతనిని అడ్డుకున్నారు. బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన అతినికి దేహశుద్ధి చేయడంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయం పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత


బాలికపై లైంగిక దాడికి యత్నించిన నిందితుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. దీంతో ఆ 16 బాలుడికి ఫిట్స్ రావడంతో పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్థానికుల దాడిలో గాయపడిన బాలుడు పీలేరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలియడంతో పట్టణ ప్రజలు అక్కడికి చేరుకున్నారు ఈ సమాచారం తెలుకున్న విద్యార్థి సంఘాల ఆందోళనతో ఉద్రిక్తత ఏర్పడింది.
"బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పలు విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు" అప్పటికే రంగప్రవేశం చేసిన పోలీసులు విద్యార్థులను శాంతింప చేశారు.

ఎమ్మెల్యే సీరియస్

పీలేరు పట్టణంలో ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి ఘటన సమాచారం తెలియగానే ఎమ్మెల్యే నల్లారి కిషార్ కుమార్ సీరియస్ గా స్పందించారు. స్థానికుల ద్వారా ఈ ఘటన సమాచారం తెలుసుకున్న ఆయన బాధిత బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి వారిని ఓదార్చారు.
"బాలికపై ఘాతుకానికి పాల్పడిన బాలుడిపై కఠిన చర్యలు తీసుకోండి" అని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, పీలేరు సీఐ యుగంధర్ ను ఆదేశించారు. పోలీస్ అధికారులతో ఆయన స్వయంగా మాట్లాడారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ, ప్రజలు ప్రధానంగా విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకుల రంగప్రవేశంతో ఉద్రిక్తంగా ఉన్నట్లు సమాచారం అందింది.
Read More
Next Story