తిరుపతికి పెద్ద పండుగ వచ్చిందబ్బో..
బ్రహ్మోత్సవాలు జరిగేది తిరుమలలో కదా! తిరుపతికి ఆ కళ ఎందుకు వచ్చిందనే కదా. సందేహం. అదేంటో చూద్దాం రాండి...
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వస్తున్నాయంటే ఊరంతా సంబరమే. తిరుపతి ప్రజలకు పెద్ద పండుగ వచ్చినట్లే. కొండపై ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుందో.. అదంతా తిరుపతి నుంచే ప్రారంభం అవుతుంది. ఎలాగంటే.. తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే వేళ..
తమిళమాసం (తై మాసం, పెరటాసి నెల) కూడా ప్రారంభం అవుతుంది. వీటిని తిరుమల శనివారాలు అని కూడా పవిత్రంగా భావిస్తారు. తిరుపతి వాసులే కాదు. తమిళులు కూడా శ్రీవేంకటేశ్వరస్వామి మాలధారణ, పసుపు దుస్తులతో నిష్టగా ఉంటారు. ఇప్పటికే తిరుమల శనివారాల్లో రెండు గడిచిపోయాయి. అసలు విషయానికి వద్దాం..
ఇది పెద్ద పండుగ
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుపతి వాసులే కాదు. చుట్టుపక్కల పల్లెల వారికి కూడా పెద్ద పండుగే. ఈ పెరటాసి మాసంలో మాలధారణ చేయకున్నా సరే. చాలా మంది మాంసం ముట్టరు. నియమ నిష్టలతో ఉంటారు. ఇదిలా ఉంటే పాత తిరుపతి వాసుల ఇళ్లలో పండుగ కళ కనిపిస్తుంది. పాతతరం, వారి వారసులైన ఇక్కడి స్థానికులకు తమిళనాడుతో సంబంధాలు ఉంటాయి. బ్రహ్మోత్సవాల వేళ బంధువులు కూడా స్థానికుల ఇళ్లకు రావడం ఆనవాయితీగా భావిస్తుంటారు.
తిరుపతి కళకళ
తిరుమల బ్రహ్మోత్సవాలకు సిద్ధం అవుతోంది. ఇంకో మూడో రోజుల్లో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. నెల నుంచి టీటీడీలో కీలకమైన విద్యుత్ , ఇంజినీరింగ్ విబాగాల ఆధ్వర్యంలో తిరుమలను సర్వాంగ సుందరంగా తీర్చదిద్దే పనులు పూర్తి చేశారు. అదేవిధంగా తిరుపతిలో కూడా ఆర్టీసీ బస్టాండ్ నుంచి బైపాస్ రోడ్డు, కపిలతీర్ధం సర్కిల్ మీదుగా అలిపిరి వరకు విద్యుద్దీపాల అలంకరణ కనువిందు చేస్తోంది. దేవతామూర్తు కటౌట్లతో పాటు నందిసర్కిల్, అలిపిరి సర్కిల్ లోని గరుడ విగ్రహం, తిరుమలకు వెళ్లే ఆర్చికి చేసిన అలంకరణ కనువిందు చేస్తోంది.
శ్రీవారి పాదాలమండపంతో పాటు అలిపిరి చెక్ పోస్టు వరకు రోడ్డుకు రెండుపక్కల విద్యుద్దీపాలు ఆధ్యాత్మిక కళకు కొత్త సొబగులు అద్దారు. ఈ కాంతుల మధ్య ఏడుకొండలు ఆహ్వానిస్తున్నట్లు భక్తిభావాన్ని పెంచుతున్నాయి. అలిపిరి వద్ద కళాకాంతులు వర్ణనాతీతం. కనులారా వీక్షించాల్సిందే.
Next Story