స్లీపర్ బస్సుల్లో.. మృత్యువుతో ప్రయాణమా..?!
x
నాయుడుపేట-పూతలపట్టు జాతీయ రహదారి నేండ్రగుంట వద్ద ప్రయాణికులను కాపాడిన రెయిలింగ్

స్లీపర్ బస్సుల్లో.. మృత్యువుతో ప్రయాణమా..?!

చిత్తూరు వద్ద 38 మందికి తప్పిన ముప్పు. తెలుగు రాష్ట్రాల్లో మూడు సంఘటనలు.


జాతీయ రహదారులపై స్లీపర్ బస్సుల్లో ప్రయాణం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. మితిమీరిన వేగం ప్రాణాలు తీస్తున్న వరుస సంఘటనలు కలవరానికి గురిచేస్తున్నాయి.

రాష్ట్రంలోని మూడు వేర్వేరు ప్రదేశాల్లో శనివారం జరిగిన సంఘటలే ఇందుకు నిదర్శనం. చిత్తూరు జిల్లాలో 30 మంది ప్రయాణికులు త‌ృటిలో మృత్యువు నుంచి తప్పించుకున్నారు. రెయిలింగ్ లేకుంటే మాత్రం తిరుపతికి సమీపంలో మరో ఘోర దుర్ఘటన జరిగేది.
తెలుగు రాష్ట్రాల్లో విశాఖ వద్ద బస్సు దగ్ధం కావడం, జాతీయ రహదారి 65పై లారీని ప్రయివేటు బస్సు ఢీకొనడం, జాతీయ రహదారి71పై అదుతప్పి డివైడర్ ను ఢీకొన్న ఘటనలు మళ్లీ ప్రయివేటు ఓల్వో బస్సులపై తీవ్ర చర్చకు ఆస్కారం ఏర్పడింది.
చిత్తూరు జిల్లా నేండ్రగుంట వద్ద శనివారం తెల్లవారుజామున నాయుడుపేట, పూతలపట్టు జాతీయరహదారి -71 ( National Highway 71) పై జరిగిన సంఘటనలో సుమారు 30 మందికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఎదురుగా వెళుతున్న లారీని తప్పించే యత్నంలో ప్రయివేటు స్లీపర్ బస్సు అదుపుతప్పింది. డివైడర్ ను ఢీకొట్టి వ్యతిరేక రోడ్డుపైకి దూసుకుని పోయింది. ఈ కుదుపులకు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు.

శ్రీవారి దర్శనానికి వస్తూ..

బెంగళూరు నుంచి చోప్రా స్లీపర్ బస్సులో 30 మంది ప్రయాణికులు తిరుపతికి బయలుదేరారు. పూతలపట్టు దాటిన తరువాత చోప్రా స్లీపర్ బస్సు శనివారం తెల్లవారుజామున పాకాల పోలీస్ లిమిట్స్ పరిధిలో ప్రయాణిస్తోంది. నేండ్రగుంట వద్దకు వచ్చే సరికి ఎదురుగా వెళుతున్న లారీని తప్పించేందుకు స్లీపర్ బస్సు డ్రైవర్ ప్రయత్నించాడు. అప్పటికి మితిమీరిన వేగంతో ఉన్న బస్సు అదుపుతప్పి, అవతలి వైపు రోడ్డుపైకి దూసుకుని పోయింది. డివైడర్ను ఢీకొట్టి ఆగిపోవడంతో బస్సు ముందు భాగం బాగా దెబ్బతినింది. ఈ కుదుపులకు బస్సులోని ప్రయాణికులు నిద్ర నుంచి మేల్కొని హాహాకారాలు చేశారు.
"ముందు వెళుతున్న లారీ ఒక్కసారిగా స్లో అయింది. దీంతో బస్సును అదుపు చేయడానికి కుడిపక్కకు తిప్పడం వల్ల అదుపుతప్పింది" అని ప్రయివేటు బస్సు డ్రైవర్ హర్షవర్ధన్ పోలీసులకు వివరణ ఇచ్చారు.

చిన్నగాయాలతో..

అదుపుతప్పిన బస్సులో కుదుపులకు ప్రయాణికులు ఒత్తిడికి లోనయ్యారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రయివేటు బస్సు సిబ్బంది, ప్రయాణికులను మరో వాహనంలో తిరుపతికి వెళ్లడానికి ఏర్పాట్లు చేశారు. ఈ సంఘటన సమాచారం అందుకున్న చంద్రగిరి నియోజకవర్గం పాకాల పోలీసులు స్పందించారు. సీఐ చిన్నదోవిందు ప్రమాద స్థలానికి చేరుకున్నారు.
"జాతీయ రహదారి 17పై నేండ్రగుంట వద్ద వేకువజామున 3.30 గంటలకు జరిగింది. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు" అని పాకాల సీఐ చిన్నగోవిందు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని ఆయన చెప్పారు.

కాపాడిన రెయిలింగ్...

మితిమీరిన వేగంతో ఉన్న ప్రయివేటు వస్సు అదుపు తప్పి పక్క రోడ్డకు దూసుకునిపోయింది. జాతీయ రహదారిపై ఉన్న రెయిలింగ్ (పిట్టగోడ)ను ఢీకొని ఆగిపోయింది. ఆ ప్రదేశానికి కిందనే సర్వీసురోడ్డు (పాకాలకు వెళ్లే మార్గం) ఉంది. పిట్టగోడ లేకుంటే మాత్రం, అంతఎత్తు నుంచి బస్సు పడిపోయి ఉంటే, ప్రమాద తీవ్రత ఊమించడం కూడా కష్టమే. ఈ పరిస్థితుల్లో

మృత్యుశకటాలైన ఓల్వో బస్సులు...

రాష్ట్రంలో కర్నూలు జిల్లా చిన్నటేకూరుపేట వద్ద బస్సు దగ్ధంలో 21 మంది సజీవదహనమైన విషాద సంఘటన నుంచి వరుస ప్రమాదాలతో ప్రభుత్వం కూడా సీరియస్ గా స్పందించింది. ప్రయివేటు ఓల్వో బస్సులపై తీవ్ర చర్చ జరుగుతోంది. మార్కాపురం ఘటన నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి, హెం మంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్షించిన విషయం తెలిసిందే.
"అవసరమైతే స్లీపర్ బస్సులను రద్దు చేయడానికి వెనుకాడం" అని రవాణా శాఖ మంత్రి రాంప్రసాదరెడ్డి వ్యాఖ్యానించడం ప్రమాదతీవ్రతను గుర్తు చేస్తోంది.
రాష్ట్రంలో ప్రధానంగా తిరుపతి, విజయవాడ, విశాఖ ప్రధాన కేంద్రాల నుంచే కాకుండా జిల్లాల నుంచి ప్రయివేటు బస్సులు ప్రధానంగా ఓల్వో సర్వీసులు ఏపీఎస్ఆర్టీసీకి సవాల్ గా మారాయి. ఆర్టీసీ బస్సుల సంఖ్య (సర్వీసులు) పెంచకపోవడం, "వన్ ఇండియ- వన్ పర్మిట్ " విధానం ప్రయివేటు యాజమాన్యంలోని బస్సులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. పొరుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని, ఏపీ, తెలంగాణ కేంద్రాలుగా అంతర్రాష్ట్ర సర్వీసులు నడపడంలో ప్రయివేటు బస్సుల యాజమాన్యాలు ఏమాత్రం తగ్గేది లేదంటున్నారు.

ఇదీ సాక్ష్యం..

తిరుపతి ఏపీఎస్ఆర్టీసీ సెక్టార్ నుంచి రాష్ట్రంలోనే కాకుండా అంతరాష్ట్ర సర్వీసులుగా ప్రైవేటు ఏసీ స్లీపర్ బస్సులు 201, ఏసీ సీటింగ్ స్లీపర్ 20, ఏసీ కోతులు 251, నాన్ ఏసీ స్లీపర్ బస్సులు 22, నాని ఏసి సీటర్ బస్సులో 53 మొత్తం 326 బస్సులు తిరుపతి సెక్టార్ నుంచి మాత్రమే నడపుతున్నారు. విజయవాడ, నెల్లూరు, హైదరాబాద్ తో పాటు జిల్లా కేంద్రాల నుంచి నడిచే బస్సులు వెయ్యికి పైగానే ఉంటాయనడంలో సందేహం లేదు.
తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే 750 కిలోమీటర్ల దూరానికి సుమారు 10 గంటల ప్రయాణం చేయాలి. తిరుపతి నుంచి బెంగళూరు 120 కిలోమీటర్లు, విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు దాదాపు 16 గంటల ప్రయాణం చేయాలి, చెన్నై వంటి నగరాలకు మూడున్నర గంటల్లో చేరవచ్చు. ఇవన్నీ అంతర్రాష్ట్ర రహదారులను కేంద్ర జాతీయ రహదారుల శాఖ లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ఆరు లైన్లు నాలుగు లేన్ల రోడ్లను నిర్మించింది. ఈ రహదారులపై వాహనాలను వేగం నియంత్రించే విధానమే లేపడం గమనించదగిన విషయం.
"హైదరాబాద్ ఓఆర్ఆర్ తరహ స్పీడ్ డిటెక్షన్ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల వాహనాల వేగానికి కళ్లెం వెయ్యొచ్చు. ఆర్టీసీ బస్సులే కాదు. ప్రైవేటు బస్సులకు స్పీడ్ లిమిట్ ఇన్బిల్ట్ డివైజ్ ( Built-in Speed Device )ఉంది" అని కూడా ఆర్టీవో మురళీమోహన్ చెప్పారు.
జాతీయ రహదారులపై ప్రతి 50 కిలోమీటర్లకు ఆపోజిట్ డైరెక్షన్లో రెండు కెమెరాలు ఏర్పాటుచేసి కమాన్ కంట్రోల్లో వేగాన్ని పర్యవేక్షించే విధానం ఉండడం మేలు చేస్తుందని కూడా రవాణా శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు.

జాతీయ రహదారి 65పై...


హైదరాబాద్ నుంచి ఏలూరు వెళుతున్న ఇంటర్సిటీ ప్రయివేటు ట్రావెల్స్ బస్సు జాతీయ రహదారి 65 (National Highway 65) ముందు వెళుతున్న లారీని ఢీకొన్న సంఘటనలో 16 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగే సమయానికి బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారని మీడియా కథనాలు చెబుతున్నాయి. తలుపులు తెరుచుకోని స్థితిలో అత్యవసర ద్వారం నుంచి ప్రయాణికులు బయటపడ్డారు. డ్రయివర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. గాయపడిన వారిని తెలంగాణ లోని కోదాడ ఆస్పత్రికి తరలించారు.

Read More
Next Story