Courtesy AI
x
తిరుమల శ్రీవారి ఆలయం. లడ్డూ ప్రసాదాలు (ఫైల్)

Tirumala Record | 14 కోట్ల శ్రీవారి లడ్డూల విక్రయం

ఉచిత లడ్డూ భారం ఎంత? లడ్డూ తయారీకి ఖర్చు ఎంత?


తిరుమల శ్రీవారి దర్శనానికి యాత్రికులు కళ్లలో ఒత్తులు వేసుకుని నిరీక్షిస్తారు. స్వామివారి లడ్డూ ప్రసాదం కూడా ప్రీతిపాత్రంగా భావిస్తారు. అందుకే లడ్డూల విక్రయాల్లో తిరుమలలో సరికొత్త రికార్డు నమోదైంది. శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న తరువాత లడ్డూ ప్రసాదాల కొనుగోలు చేయడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. గత ఏడాది రికార్డులు తిరగ రాశారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు 13,95,43,231 లడ్డూలను యాత్రికులు కొనుగోలు చేశారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే, 1.76 లడ్డూలు అదనంగా విక్రయాలు జరిగాయి.

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన నెయ్యి వాడారనే ఆరోపణలు రెండేళ్లుగా కుదిపేస్తున్నాయి. టీడీపీ కూటమి వచ్చిన తరువాత అన్నప్రసాదాల తయారీకి అవసరమైన వస్తువుల కొనుగోలు. శ్రీవారి లడ్డూ ప్రసాదానికి అవసరమైన స్వచ్ఛమైన ఆవు నెయ్యి కొనుగోలుకు టీటీడీ అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.
"స్వచ్ఛమైన నెయ్యి వాడకంతో పాటు పోటు (వంటశాల)లో సిబ్బందిని పెంచడం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చాం" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు గతంలో అనేక సార్లు చెప్పారు. దీనివల్ల తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి మరింత డిమాండ్ ఏర్పడిందని ఆయన చెబుతున్నారు.
"విశేషమైన రోజుల్లో కూడా లడ్డూల కొరత లేకుండా రోజూ నాలుగు లక్షల లడ్డూల తయారీకి అవసరమైన మానవ, యంత్రాలతో కూడిన వనరులు ఉన్నాయి" అని చైర్మన్ నాయుడు చెప్పారు. పోటులో తయారు చేసిన నాలుగు లక్షల వరకు లడ్డూలు బఫర్ స్టాక్ ( Buffer Stock of Laddus ) ఉంటుందని కూడా ఆయన చెప్పారు.
తిరుమలలో 2024-25 సంవత్సరంలో 12,18,53,535 లడ్డూల విక్రయాలు జరిగాయి. ఇందులో రూ. 50, రూ. 200 విలువైన కల్యాణం లడ్డూలు కూడా ఉన్నాయి. సామాన్యా యాత్రికులకు చిన్న లడ్డూలే ఎక్కవ అందుబాటులో ఉంటాయి. ఈ సంవత్సరంతో పోలిస్తే 1.76 లక్షల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు అదనంగా విక్రయించినట్లు టీటీడీ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.

ఒక లడ్డూ తయారీ ఖర్చు ఇదీ..

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను యాత్రికులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఇందులో లాభనష్టాల బేరీజు వేయని టీటీడీ ఒకో లడ్డూ తయారీపై రూ. ఐదు నుంచి పది వరకు భారం భరిస్తోంది. ఒక లడ్డు తయారీకి టీటీడీకి కనీసంగా 55 నుంచి 60 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కానీ, చిన్న లడ్డూ సామాన్య యాత్రికులకు రూ. 50కే అందుబాటులో ఉంది. ఈ లెక్కన సామాన్య యాత్రికుల్లో రోజుకు సుమారు 65 వేల మందికి టీటీడీ ఉచితంగా పంపిణీ చేసే లడ్డూ భారం భరిస్తోంది.

ఇదీ అంచనా..

టీటీడీ ధార్మిక కార్యక్రమాలతో పాటు యాత్రికుల సదుపాయాలకు కూడా ప్రణాళికలు అమలు చేస్తుంది. ఆ వివరాలన్నీ బడ్జెట్ లో కనిపిస్తాయి. టీటీడీ ఈ ఏడాది 5,426 కోట్ల రూపాయలతో బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 5,258.68 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ సంవత్సరం 168 కోట్ల రూపాయలు అదనంగా బడ్జెట్ ఆమోదించారు. ప్రధానమైన అంశాల్లో లడ్డూల తయారీ, విక్రయాల ద్వారా ఆదాయాన్ని కూడా టీటీడీ అంచనా వేసింది.
2025-26: ఆర్థిక సంవత్సరంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల విక్రయాలతో 600 కోట్ల రూపాయల ఆదాయం అంచనా వేసింది. ఆ మేరకు దాదాపు టీటీడీ లెక్కలు ఫలించాయి.
2026-27: ఆర్థిక సంవత్సరంలో 650 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందనే టీటీడీ గణాంక విభాగం అధికారులు అంచనాలు తయారు చేశారు. ఇందేలె లడ్డూల తోసహా ఇతర ప్రసాదాల విక్రయాలు కూడా ఉంటాయి. గత ఏడాదితో పోలిస్తే, పది కోట్ల రూపాయలు ఆదాయం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నట్లు టీటీడీ గణాంక శాఖ లెక్కలు వేసింది.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన నెయ్యి, దినుసుల కోసం ఈ సంవత్సరానికి టీటీడీ 974 కోట్ల రూపాయలు కేటాయించింది.
"లడ్డూ తయారీలో నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తున్నాం" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు చెప్పారు. లడ్డూ రుచి, సువాసనకు ప్రాధాన్యత ఇవ్వడంలో టీటీడీ రాజీ పడదు. దీనికోసం శనగపిండి, ఆవునెయ్యి, చక్కెర, జీడిపప్పు, కిస్ మిస్, కలకండ, యాలకులు, ఎండుద్రాక్షతో పాటు పచ్చకర్పూరం వంటి అనేక పదార్థాలు వినియోగిస్తున్నారు.

నాలుగు లక్షల లడ్డూల తయారీకి..

తిరుమలలో రోజూ సుమారు 3.5 నుంచి 4 లక్షల లడ్డూలు తయారు చేయడంలో పోటు కార్మికులు నిరంతరాయంగా పనిచేస్తారు. ఇంత పరిమాణంలో లడ్డుల తయారీకి పది టన్నుల శనగపిండి, చక్కెర, 300 నుంచి 400 లీటర్ల స్వచ్ఛమైన ఆవు నెయ్యి, జీడిపప్పు 700 కిలోలు, కలకండ 500 కిలోలు, ఎండుద్రాక్ష 540 కిలోలు వినియోగిస్తుంటారు.

ఎంతమంది యాత్రికులు వస్తుంటారు?

తిరుమల శ్రీవారిని సగటున రోజుకు 75 వేల మంది సామాన్య యాత్రికులు దర్శించుకుంటారు. వీవీఐపీలతో పాటు సిఫారసు లేఖలతో వెళ్లే వారు, బ్రేక్ దర్శనం, రూ. 300 టికెట్, శ్రీవారి ట్రస్టుకు రూ.10,500 చెల్లించే వారిలో సర్వదర్శనానికి వెళ్లే యాత్రికులకు టీటీడీ ఓ లడ్డూ ఉచితంగా ఇస్తుంది. అదనంగా కావాలంటే రూ. 50 చెల్లించి కొనుగోలు చేయాలి. ఆ పద్ధతి ఇలా ఉంటుంది..

వైకుంఠం క్యూ కాంప్లెక్స్: నుంచి దర్శనానికి వెళ్లి, స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చే ప్రతి భక్తునికి ఒక లడ్డూ ఉచితంగా ఇస్తారు.
ఎలా తీసుకోవాలంటే: దర్శనం పూర్తయ్యాక ఇచ్చే 'దర్శనం టికెట్ టోకెన్' చూపించి లడ్డూ కౌంటర్ల వద్ద ఈ ఉచిత ప్రసాదాన్ని తీసుకోవచ్చు.
అదనపు లడ్డూలు: ఒక ఉచిత లడ్డూకు మించి అదనంగా కావాలంటే.. ఒక్కో లడ్డూకు రూ. 50 చెల్లించి ఎన్ని లడ్డూలైనా కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం అదనపు లడ్డూల కొనుగోలుపై ఎలాంటి పరిమితులు లేవు.
రోజుకు: సగటున 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు లడ్డూలు పంపిణీ చేస్తున్నారు.
బఫర్ స్టాక్: భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏడు నుంచి ఎనిమిది లక్షల వరకు లడ్డూలు బఫర్ స్టాక్‌గా సిద్ధంగా ఉంచుతున్నారు.
రికార్డు స్థాయి అమ్మకాలు: గత ఏడాదితో పోలిస్తే లడ్డూల అమ్మకాలు పదిశాతం పెరిగాయి. 2025లో మొత్తం 13.52 కోట్ల లడ్డూలు పంపిణీ అయ్యాయి.
2026 ఏప్రిల్ 10: అధికారిక లెక్కల ప్రకారం తిరుమల శ్రీవారిని 65,534 మంది యాత్రికులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 3.8 లక్షల లడ్డూలు యాత్రికులు కొనుగోలు చేశారు. ఇందులో ఉచిత లడ్డూలు కూడా ఉన్నాయి.
Read More
Next Story