
తిరుపతికి వెళ్లాలా.. చెన్నై నుంచి వస్తున్నారా? ఒక్క క్షణం ఆగండి..
ఏప్రిల్ ఒకటో తేదీ జాతీయ రహదారిపై ట్రాఫిక్ మరో మార్గంలో మళ్లింపు
హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాలా? జాతీయ రహదారి 716పై వస్తున్నారా? కర్నూలు నుంచి ఎన్ హెచ్ 40 నుంచి కడపకు రాగానే రూట్ మార్చుకోవాలి. చెన్నై నుంచి కడప మార్గంలో ప్రయాణించే వాహనదారులు రాజంపేట నుంచి మరో మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఏప్రిల్ ఒకటో తేదీ ఉదయం నుంచి రెండో తేదీ ఉదయం వరకు ఈ ట్రాఫిక్ మళ్లింపు అమలులో ఉంటుంది.
కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయం వద్ద శ్రీరామనవమి రాష్ట్ర పండుగగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ఒకటో తేదీ శ్రీకోదండరాములవారి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఆంధ్ర భద్రాద్రిగా గుర్తింపు పొందిన ఒంటిమిట్ట కోదండరామాలయం జాతీయ రహదారి 716 ( National Highway 716) పక్కనే ఉంటుంది.
"లక్షలాది మంది యాత్రికులు హాజరుకానున్న నేపథ్యంలో వాహన రాకపోకలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మళ్లించనున్నాం" అని కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ శిశ్వనాథ్ వివరించారు.
ఒంటిమిట్టలో జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కడప నగరంలో, ఒంటిమిట్ట రహదారి, రేణిగుంట రహదారిపై ట్రాఫిక్ మళ్లింపు అమలులో ఉంటుంది. ఏప్రిల్ ఒకటో తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి రెండో తేదీ ఉదయం ఎనిమిది గంటల వరకు అమలులో ఉంటుంది" అని కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ శిశ్వనాథ్ స్పష్టం చేశారు.
రేణిగుంట వద్ద
జాతీయ రహదారి-716 మీదుగా వచ్చే భారీ వాహనాలను రేణిగుంట, రాజంపేట, కడప వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల ద్వారా ఇతర మార్గాల్లో మళ్లించనున్నారు. కడప జిల్లా రాజంపేట వైపు నుంచి వచ్చే ద్విచక్ర వాహనాలు, ఆర్.టి.సి. బస్సులు ఒంటిమిట్ట మండలం సాలాబాద్ క్రాస్ వద్ద, సిద్ధవటం మండలం ఉప్పరపల్లి సాయిబాబా గుడి వద్ద ఏప్రిల్ ఒకటో తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి రెండో తేదీ ఉదయం ఎనిమిది గంటల వరకు దారి మళ్లిస్తామని ఎస్పీ షెల్కే నచికేత్ శిశ్వనాథ్ చెప్పారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
హైదరాబాద్ నుంచి కడపకు వచ్చే వాహనదారులు తిరుపతికి వెళ్లడానికి మార్గం ఖరారు చేశారు. తిరుపతి వైపు వెళ్లే వాహనాలు కడప నగరం అలంఖాన్ పల్లి ఇర్కాన్ జంక్షన్ నుంచి రాయచోటి మార్గంలోని ఊటుకూరు సర్కిల్, రాయచోటి మీదుగా తిరుపతి వెళ్ళాలి.
తిరుపతి నుంచి కడప వైపు వచ్చే భారీ వాహనాలు, రవాణా వాహనాలు రాయచోటి మీదుగా కడపకు చేరుకోవాలి. రాజంపేట వైపు నుంచి కడప వెళ్లే భారీ వాహనాలను రాయచోటి మీదుగా దారి మళ్లింపు. రాజంపేట వైపు నుంచి వచ్చే ద్విచక్ర వాహనాలు సాలాబాద్ నుంచి ఇబ్రహీం పేట, మాధవరం మీదుగా మళ్లించే విధంగా ఏర్పాట్లు చేశారు.
ఒంటిమిట్టలో పార్కింగ్
ఒంటిమిట్టలో సీతారాముల వారి కల్యాణానికి వచ్చే వాహనదారులకు 18 ప్రదేశాల్లో పార్కింగ్ సదుపాయానికి పాయింట్లు సిద్ధం చేశారు. రాజంపేట వైపు నుంచి టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనాలను సాలాబాద్ సమీపంలో పార్కింగ్ చేయడానికి ఐదు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్ట కల్యాణ వేదిక నుంచి కడప మార్గంలో 13 పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు.
కడప రహదారిలో..
కడప వైపు నుంచి ఒంటిమిట్ట వచ్చే యాత్రికుల వాహనాలు నిలుపడానికి 13 ప్రదేశాలలో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు.
1. ఫోర్ వీలర్స్: చలమయ్య యాదవ్ సైట్, మాధవరం 1 (హెచ్పి పెట్రోల్ బంక్ తూర్పు వైపు)
2. త్రీ వీలర్స్: కనకదుర్గ కళ్యాణ మండపానికి పడమటి వైపు. మాధవరం1
3.కార్ల పార్కింగ్: కనకదుర్గ కళ్యాణ మండపం తూర్పు వైపున ...మాధవరం 1
సన్నీ ఫుడ్ కోర్ట్ ఫ్యామిలి ధాబా తూర్పు వైపు, సన్నీ ఫుడ్ కోర్ట్ ఫ్యామిలి ధాబా పడమటి వైపు
4. కార్లు, ట్రాక్టర్లు, లారీల పార్కింగ్: ఫోర్ వీలర్లకు సన్నీ ఫుడ్ కోర్ట్ నుంచి పడమటి వైపు
5. సాయిబాబా గుడి, ఉప్పరపల్లి గ్రామం(ట్రాఫిక్ మళ్లింపు ప్రదేశం)
6. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం , కొత్త మాధవరం(ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఎదురుగా)
7.ఆర్.టి.సి బస్సుల పార్కింగ్: శ్రీషిర్డీ సాయి డిగ్రీ కాలేజి, ఓబుల్ రెడ్డి వాటర్ ప్లాంట్/ స్పైసెస్ బోర్డు మధ్యలో
8.ఫ్రీ బస్సులు, వి.ఐ.పి కార్ పార్కింగ్: శ్రీ షిర్డీ సాయి డిగ్రీ కాలేజి, రాయలసీమ హోటల్ (వి.వి.ఐ.పి, విఐపి ఎంట్రెన్సు ఆర్చి ఎదురుగా
9. పోలీసు వాహనాల పార్కింగ్: ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ & మయూర హోటల్, వెనుక వైపు
10. ఇతర శాఖల వాహనాలు: ఈద్గా పక్కన, ఒంటిమిట్ట (కార్ పార్కింగ్)
11. టి.టి.డి వాహనాల పార్కింగ్: కళ్యాణ వేదిక ప్రధాన ప్రవేశం ఆర్చ్ వద్ద ఉన్న సత్రం వద్ద
12. టూ వీలర్, కార్ పార్కింగ్: కళ్యాణ రామ టౌన్ షిప్, బ్రిడ్జి పక్కన, దర్జిపల్లి రోడ్, కొత్త పల్లి గ్రామ సమీపంలో
రాజంపేట రహదారి వైపు పార్కింగ్ ప్రదేశాల వివరాలు:
1.ఆర్.టి.సి బస్సులు: సాలాబాద్ క్రాస్ వద్ద
2.ఫోర్ వీలర్ , టూ వీలర్లు: మదరసా, మలకాటి పల్లి గ్రామం
3.ఫోర్ వీలర్, టూ వీలర్ పార్కింగ్: మలకాటి పల్లి గ్రామం వద్ద
4వి.ఐ.పి కార్ పార్కింగ్: బి.సి బాయ్స్ హాస్టల్, ఒంటిమిట్ట వద్ద
5 వి.ఐ.పి కార్ పార్కింగ్: దుర్గమ్మ గుడి ముందు వైపు, ఒంటిమిట్ట టౌన్
Next Story

