చెరగని ’తొలి సంతకం‘
x

చెరగని ’తొలి సంతకం‘

ఉమ్మడి రాష్ట్రంలో దివంగత వైఎస్. రాజశేఖరరెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే ఉచిత విద్యుత్ ఫైల్ పై చేసిన తొలి సంతకం లక్షల మంది రైతుల తలరాతలు మార్చింది. హామీ ఇవ్వకున్నా, విద్యుత్ బకాయిలు రద్దు చేయడం ద్వారా ఆదర్శ రాజకీయ నేతగా చరిత్రలో నిలిచారు.


తొలి సంతకం అంటే ఇచ్చిన మాటకు కట్టుబడడం. ప్రజల ఆశలు సాకారం చేయడం. ఆ రోజు ఉచిత విద్యుత్ ఫైల్ పై వైఎస్ఆర్ చేసిన సంతకం రాజకీయ యవనికపై చెదరని జ్షాపకంలా మిగిలింది. హామీకి అర్థం, విలువను చాటి చెప్పి రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన క్షణాలను ఒకసారి మననం చేసుకుందాం..

’మాట తప్పను. మడమ తిప్పను‘ అనే మాటను అక్షరసత్యం చేసిన వ్యక్తి వైఎస్. రాజశేఖరరెడ్డి. అధికారం చేపట్టగానే ఇచ్చిన హామీ మేరకు ఉచిత విద్యుత్ అందించడానికి ఫైల్ పై మొదటి సంతకం చేసిన ఆయన విలువలు చాటి చెప్పిన మొదటి వ్యక్తి అని చెప్పడంలో సందేహం లేదు.





రైతుల కష్టాలు ఆలకించి..
’ప్రజాప్రస్ధానం‘ పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ వైఎస్ఆర్ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం నుంచి ఇచ్చాపురం వరకు మండుటెండల్లో 1,470 కిలోమీటర్లు అవిశ్రాంతంగా పాదయాత్ర సాగించారు. అప్పటి సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు ఏమాత్రం భేషజాలకు పోకుండా డాక్టర్ వైఎస్ఆర్ కు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దారిపొడవునా, డాక్టర్ వైఎస్ఆర్ అన్ని వర్గాల ప్రజానీకంతో మమేకం అయ్యారు. తెలంగాణా ప్రాంతంలో పర్యటన సాగే సమయంలో ఆయన రైతుల కష్టాలు స్వయంగా గమనించారు.
పొలాల్లో సాగులో ఉన్న పంటలు కాపాడుకునేందుకు రాత్రిళ్లు కూడా పడిగాపులు కాస్తున్నామనే రైతుల ఆవేదన స్వయంగా ఆలకించారు. పగలు పాదయాత్ర సాగే సమయంలో నీరు లేక ఎండుతున్న పంటలు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ చలించిపోయారు. రైతుల కష్టాలు స్వయంగా అర్థం చేసుకున్న ఆయన..
ఉచిత విద్యుత్ హామీ..
పగలే రైతులకు నిరంతరాయంగా ఏడు గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇవ్వడంతో పాటు మ్యానిఫెస్టోలో ప్రకటించారు. ఈ హామీని టీడీపీ నేతలు గేలి చేశారు. ’ఉచిత విద్యుత్ వల్ల తీగలపై దుస్తులు ఆరవేయడానికి పనికి వస్తుంది’ అని హేళనగా మాట్లాడారు. అ తరువాత జరిగిన ఎన్నికల్లో ఉచిత విద్యుత్ హామీ బ్రంహ్మాండంగా పనిచేయడంతో 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకుని వచ్చింది. ఇందులో వైఎస్ఆర్ పాత్ర మాత్రమే కీలకం అనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో అధికారంలోకి తీసుకుని వచ్చిన ఆయన మాట నిలుపుకున్నారు.
తొలి సంతకం
అనేక నాటకీయ పరిణామాల మధ్య ఆయన ఎట్టకేలకు సీఎల్పీ నేతగా ఎంపికయ్యారు. అనంతరం హైదరాబాద్ ఎల్.బీ. స్టేడియంలో జరిగిన అశేష జనసందోహం మధ్య 2004 మే 14వ తేదీన సీఎంగా వైఎస్. రాజశేఖరరెడ్డి ప్రమాణస్వకారం చేసిన వేదికపైనే ఉచిత విద్యుత్ ఫైల్ పై సంతకం చేశారు.న అప్పటి వరకు ఉన్న విద్యుత్ బకాయిలను కూడా రద్దు చేశారు. ఏటా దరఖాస్తు చేసుకున్న రైతులకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు కూడా మంజూరు చేయడానినికి ఆదేశాలు జారీ చేశారు. ’నాయకుడు అంటే ఇలా ఉండాలి. ప్రజల్లో విశ్వసనీయత పెంచుకోవాలి’ అని మాటకు కట్టుబడిన వ్యక్తిగా ఆయన ఇప్పటకీ నీరాజనాలు అందుకుంటున్నారు.
2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్ సరఫరా ఇస్తానని విభజిత రాష్ర్ట సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత విఫలం చెందారు.
Read More
Next Story