తిరుమలకు ప్రత్యేక టీటీడీ కేంద్రీయ కార్యాలయం
x

తిరుమలకు ప్రత్యేక 'టీటీడీ కేంద్రీయ కార్యాలయం'

యాత్రికులకు సేవలు సరళం చేయడానికే అంటున్న అదనపు ఈఓ.


తిరుమలలో మరో కేంద్రీకృత పరిపాలనా భవనం నిర్మాణానికి అడుగులు పడ్డాయి. తిరుమలలో మరో టీటీడీ పరిపాలనా భవనం నిర్మించనున్నారు. దీని కోసం మంగళవారం అధికారులు పరిశీలించారు. శ్రీవారి ఆలయానికి వెళ్లే ప్రధాన మార్గానికి సమీపంలోని రాంబగీచ అతిథి వసతి సముదాయానికి బస్టాండ్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం అనువైనదిగా భావించారు.

"తిరుమలలో యాత్రికులకు సేవలు అందించే కార్యాలయాలన్ని ఒకే గొడుకు కిందకు తీసుకుని రావాలనేది ప్రధాన లక్ష్యం" అని టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి చెప్పారు.

తిరుపతి నగరం కపిలతీర్థం మార్గంలో ఉన్న టీటీడీ ప్రధాన పరిపాలన భవనం చిన్న రాష్ట్రానికి సరితూగే శాఖ శాఖలు నిర్వహిస్తోంది. తిరుమల తోపాటు దేశంలోని టీటీడీ అనుబంధ ఆలయాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, హిందూ ధర్మప్రచార పరిషత్ (హెచ్డీపీపీ) కార్యక్రమాలతో పాటు టీటీడీ ఆస్పత్రుల పరిపాలనా వ్యవహారాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం టీటీడీలో శాశ్వత ఉద్యోగులు ఏడు వేల మంది ఉద్యోగులు పరిపాలన, ఆలయ నిర్వహణ, కీలక విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 14,200 మంది పారిశుద్ధ్యం తోపాటు భద్రతా విధులు, అన్నప్రసాదం విభాగం, గార్డెనింగ్ విభాగంలో సేవలు అందిస్తున్నారు. మొత్తం మీద 22 వేల మంది ఉద్యోగులు టీటీడీలో పరిపాలన, ఆలయ వ్యవహారాలు, యాత్రికులకు సేవలు అందించడంలో కీలకంగా ఉన్నారు.

తిరుమలలో.. మరో టీటీడీ కార్యాలయం...

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలనా యంత్రాంగం భక్తులకు మరింత చేరువగా ఉండాలనే లక్ష్యంతో తిరుమలలోని కేంద్రీయ కార్యాలయ వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించింది. 2025 జూలై 23వ తేదీ జరిగిన టీటీడీ పాలక మండలిలో కూడా తీర్మానం చేశారు.
"తిరుమలలో యాత్రికులకు సేవలు అందించే కార్యాలయాలు వేర్వేరుగా ఉన్నాయి. వాటన్నింని ఒకే గొడుకు కిందకు తీసుకుని రావాలని నిర్ణయించాం" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు కూడా బోర్డు ఆమోదించిన తీర్మానాన్ని గుర్తు చేశారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి రోజూ సగటున 65 వేల నుంచి 80 వేల మంది యాత్రికులు వస్తుంటారు. యాత్రికులకు నేరుగా సేవలు అందిచండంలో తిరుమలలోని వివిధ విభాగాలు తిరుపతిలోని ప్రధాన పరినాలనా భవనానికి ఏమాత్రం తీసిపోవు. తిరుపతిలోని టీటీడీ ఈఓకు సమానమైన హోదాతో అదనపు ఈఓ కార్యాలయం తోపాటు తిరుమలలో యాత్రికులకు గదులు కేటాయించే కార్యాలయం ఒక చోట,
శ్రీవాణి టికెట్ల జారీ కేంద్రం ఇలా ఒకో కార్యాలయం ఒకో చోట ఉంది. వాటన్నింటిని ఆర్బీజీహెచ్ (యాత్రికుల వసతి) సముదాయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో తిరుపతి తరహాలోనే తిరుమలలో కూడా కేంద్రీకృత పరిపాలనా భవనం అవసరాన్ని గుర్తించారు. టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి తిరుమలలో ఆ స్థలంతో పాటు మిగతా అనేక ప్రాంతాలను పరిశీలించారు.

మరో కార్యాలయం ఎందుకు?

తిరుపతిలో ప్రధాన పరిపాలనా భవనం (Administrative Building) ఉంది. తిరుమలలో కేంద్రీయ కార్యాలయాన్ని (Central Office/CRO) కీలక నిలయంగా మార్చడానికి ప్రధాన కారణాలు గుర్తించినట్లు గతంలోనే టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు ప్రస్తావించారు. కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండడం వల్ల యాత్రికులకు కష్టాలు దూరం చేయడమే ప్రధాన ఉద్దేశం అన్నారు. తిరుమలలో పరిపాలన, యాత్రికులకు సేవలు అందించే విభాగాలు, ఇతర కార్యాలయాలు, వాటి పనితీరు ఇదీ..
1. క్షేత్రస్థాయి పర్యవేక్షణ
యాత్రికులు క్షేత్రస్ధాయిలో ఎదుర్కునే సమ్యలు నేరుగా పర్యవేక్షించడానికి సులువుగా ఉంటుంది.
2) టీటీడీ ఈఓ, జేఈఓ (ప్రస్తుతం అదనపు ఈఓ) ఛాంబర్లు ఉండడం వల్ల వేగవంతమైన నిర్ణయాలకు ఆస్కారం.
3) తిరుమలలో దర్శనం, వసతి, అన్నప్రసాదం విభాగాల మధ్య సమన్వయం సాధించడం.
4) సిఫారసు లేఖలతో వచ్చే యాత్రికులకు వసతి గదుల కేటాయింపు వంటి సేవలు సులభతరం.

97 స్వతంత్ర విభాగాలు

తిరుమలలో 97 వరకు స్వతంత్ర టీటీడీ విభాగాలు యాత్రికుల సేవలు అందిస్తున్నాయి. వాటిలో క్రియాశీలంగా పనిచేసే విభాగాలు తిరుమలలోనే ఉన్నాయి.
1) కేంద్రీయ విచారణ కార్యాలయం (CRO) ద్వారా రోజూ ఎనిమిది నుంచి తొమ్మిది వేల గదులు కేటాయిస్తుంటారు.
2) సమాచార కేంద్రం. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (VQC)
3) దర్శన నిర్వహణ విభాగం
4) శ్రీవారి ఆలయ విభాగం (Peishkar Office) ఆలయ వ్యవహారాల్లో ప్రధానమైనది. ఆలయంలో పూజలు, ప్రసాదాల పర్యవేక్షణ జరుగుతుంది.
5) అన్నప్రసాద విభాగం కార్యాలయం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం నిర్వహణ చేస్తుంది.
6) విజిలెన్స్ & సెక్యూరిటీ: భద్రతా పరమైన అంశాల పర్యవేక్షణ.
7) ఆరోగ్య విభాగం (Health Dept) అత్యత ప్రధానమైంది. ఇది పారిశుధ్యం, శానిటేషన్ పర్యవేక్షిస్తుంది.
8) ఇంజనీరింగ్ విభాగం: రోడ్లు, భవనాలు, నీటి సరఫరాలో మరో ప్రధాన విభాగం
9) కల్యాణకట్ట: తలనీలాలు సమర్పించే విభాగం. టీటీడీకి ఏటా 1,500 కోట్ల రూపాయలు అందిస్తున్న శాఖ ఇది.
10) వైద్య విభాగం: అశ్విని ఆస్పత్రి ద్వారా తిరుమలలో యాత్రికులకు ప్రథమ చికిత్స కేంద్రాలు నిర్వహిస్తున్నారు. అత్యవసర సేవలు అందించడంలో 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉంటారు. మెరుగైన చికిత్స అవసరమైతే తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి తరలించి, ఉచితంగానే కార్పొరేట్ వైద్యం అందిస్తారు. ఇవి కాకుండా...
11) తిరుమలలో యాత్రికులకు పరోక్షంగా ఉపయోగపడే కార్యాలయాలు కూడా నిర్వహిస్తున్నారు
"యాత్రికులకు మరింత మెరుగైన ఇబ్బందిలేని విధంగా సేవలు అందించాలనేది లక్ష్యం. దీని కోసం కేంద్రీయ కార్యాలయ వ్యవస్థను బలోపేతం చేయాలని బోర్డు నిర్ఱయించింది. కార్యాలయాన్ని కేంద్రీకృతం చేసే కార్యాచరణ ప్రకటిస్తాం" అని టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి చెప్పారు.

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులకు ఉచిత సేవలతో పాటు, రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆర్జిత సేవలతో పాటు అన్నప్రసాదం, వెంగమాంబ భవన నిర్వహణ కార్యాలయాలు కూడా వేర్వేరుగా ఉన్నాయి. వీటితో పాటు యాత్రికులకు క్యూలో పాలు, ఉప్మా, అన్నప్రసాదం నిరంతర సరఫరా. వసతి ఉచిత డార్మిటరీలు (PACs), తక్కువ ధరలో గదులు (రూ. 50, రూ. 100), ధర్మరథాలతో ఉచిత రవాణా సేవలకు 60 విద్యుత్ బస్సులు నిర్వహిస్తున్నారు.
అదనపు ఇంకా ఏమి చెప్పారంటే..
తిరుమలలో టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి అనేక ప్రదేశాలను పరిశీలించారు ఆయన వెంట తిరుమల ఎస్టేట్ ఆఫీసర్ వేంకటేశ్వర్లు, వీజీఓ సురేంద్ర, ఈఈలు శ్రీనివాసరావు, వేణు గోపాల్, డీఈ చంద్ర శేఖర్ తో సహా ఆయా విభాగాల అధికారులు కూడా ఉన్నారు.
తిరుమలలో కేంద్రీకృత టీటీడీ పరిపాలనా భవన నిర్మాణానికి రాంభగీచా బస్టాండ్ కు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. అధికారులతో అక్కడే సమీక్షించి, అభిప్రాయాలు తీసుకున్నారు.
తిరుమలలోని ఏటీసీ వద్ద రెవెన్యూ విభాగానికి కాటేజీ కేటాయింపుపై స్థలాన్ని పరిశీలించిన అదనపు ఈఓ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆకాశగంగ వద్ద దుకాణాలను పరిశీలించారు‌.
Read More
Next Story