
YCP- mango | మామిడి ధరను కదిలించిన జగన్ పర్యటన
బంగారుపాలెంలో మామిడి రైతుకు కాస్త ఊరట.
చిత్తూరు జిల్లాలో సీజన్లో మామిడి రైతులు కష్టాలు నష్టాలు మూట కట్టుకున్నారు. రైతుల కష్టాలు ఆలకించడానికి వైసిపి అధినేత వైయస్ జగన్ రావడంతో ధరల సూచీలో కూడా కదలిక కనిపించింది. ఈయన పర్యటనకు ముందు అంటే సీజన్ ప్రాణమైన కొద్ది రోజులకే చిత్తూరు, తిరుపతి. జిల్లాల కలెక్టర్లు సుమిత్ కుమార్, డాక్టర్ వి. వెంకటేశ్వర్ దశలవారీగా రైతులు, మామిడి గుజ్జు పరిశ్రమల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయడంతో..
"కిలో మామిడికి రాష్ట్ర ప్రభుత్వం 12 రూపాయలు మద్దతు ధర" ప్రకటించింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది.
ధర దక్కక..
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ మామిడి గుచ్చు పరిశ్రమల వద్ద యజమానులు, వారికోసం ఏర్పాటు చేసిన ర్యాంపుల వద్ద కూడా 80 రూపాయలకు కొనుగోలు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నాలుగు రూపాయలు అదనంగా పరిశ్రమల వద్ద రెండు లేదా మూడు రూపాయలకే కిలో కొనుగోలు చేశారు. అంటే మొత్తం మీద రైతులకు గిట్టుబాటు ధర లభించలేదు.
ప్రైవేట్ మండల వద్ద
చిత్తూరు జిల్లాలో మార్కెటింగ్ కమిటీ ద్వారా మామిడికాయల యార్డులు ఉన్నాయి. అంతేకాకుండా చంద్రగిరి నియోజకవర్గంలో పాకాల సమీపంలోని దామచర్ల వద్ద ఒకటి. పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం వద్ద మరో ప్రైవేటు మామిడి మార్కెట్ యార్డ్ ఉంది.
జిల్లా నుంచి ఇక్కడికి వచ్చే రోజుకు కనీసంగా నాలుగు నుంచి 500 టన్నుల మామిడికాయలు రైతులు తీసుకువచ్చేవారు.
జిల్లాలో దిగుబడి అధికారం కావడం వల్ల, పొరుగు రాష్ట్రాల్లో కూడా దిగుబడి గణనీయంగా ఉండడంతో రైతుకు గిట్టుబాటు ధర లభించలేదు. అందులో భాగంగానే,
చిత్తూరు జిల్లాలోని రెండు మార్కెట్ యార్డుల వద్ద కూడా మామిడి గుజ్జు పరిశ్రమల మాదిరే ఆశాజనక ధర లభించలేదు. కిలో ఒకటి లేదా రెండు రూపాయలకు మాత్రమే కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడింది.
తోటల నుంచి మామిడికాయలు కోత కూలీలు, లోడింగ్, రవాణా ఖర్చులతో పోలిస్తే అప్పులు మిగిలే పరిస్థితి ఏర్పడింది. దీంతో అనేక మంది రైతులు మామిడికాయలను రోడ్డు వెంట కాలువల్లో పారేశారు.
ఈ పరిస్థితిని అంచనా వేసిన వైసిపి ఆ పార్టీ అధినేత ysస్ జగన్ పర్యటనకు కార్యక్రమం ఖరారు చేసింది. దీంతో ప్రభుత్వంలో కదలిక రావడమే కాదు. ప్రైవేట్ మార్కెట్ యార్డుల వద్ద కూడా పరిస్థితి అనుకూలంగా మారింది.
బంగారుపాలెంలోని మార్కెట్ యార్డు వద్దకు బుధవారం ఉదయం వైయస్ జగన్ వస్తున్నారని సమాచారంతో ఇక్కడ వ్యాపారులు స్పందించారు.
"రెండు రోజుల కిందటి వరకు కిలో మామిడి ఒకటి లేదా రెండు రూపాయలకు కొనుగోలు చేసిన రైతులు ధర కాస్త పెంచారు"
కిలో మామిడి ఏడు రూపాయలకు కొనుగోలు చేయడానికి సాహసించారని కొంతమంది రైతులు బంగారుపాలెంలో బుధవారం మీడియాకు చెప్పారు.
బంగారుపాలెం మార్కెట్ యాడ్ మాజీ చైర్మన్ మాట్లాడుతూ..
"వైసిపి అధికారంలో ఉండగా కిలో 16 నుంచి 18 రూపాయల వరకు కొనుగోలు చేశాం" అని గుర్తు చేశారు. వైసిపి అధికారంలో ఉండగా మామిడి నుంచి 22 నుంచి 29 రూపాయలు వరకు కొనుగోలు చేయించిన ఘనత ఉందని ఆయన గుర్తు చేశారు.
Ys జగన్ బంగారుపాలెం వస్తున్నారని తెలియగానే, ధరల్లో కాస్త కదలిక వచ్చిన విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక్కడికి వచ్చిన రైతులు అనేకమంది కూడా ఇదే విషయాన్ని చెప్పారు.
బంగారుపాలెం మామిడి మార్కెట్ యార్డులో ఇంకో నెలపాటు సీజన్ కాయలు వస్తాయి. ఇదే ధర దక్కితే రైతుకు మేలు జరుగుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అది వేచి చూడాలి.
Next Story