
చిత్తూరు జిల్లా బంగారుపాలెం మామిడికాయల మార్కెట్ యార్డులో రైతులను ఉద్దేశించిన మాట్టాడుతున్న వైఎస్. జగన్
Ycp Vs Tdp | ప్రభుత్వాన్ని నిద్ర లేపడానికే వచ్చా... జగన్
RBK ల ద్వారా మామిడికాయలు కొనుగోలు చేయాలి.
మామిడికాయల కొనుగోలు చేయడంలో ప్రభుత్వం ముద్దు నిద్ర వదిలి, మిగిలిన మామిడికాయలన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వైసిపి చీఫ్ వైయస్ జగన్ డిమాండ్ చేశారు.
"మాయమాటలతో రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని నిద్ర లేపడానికి వచ్చాను" అనిys. జగన్ హెచ్చరించారు. రైతులను ఆదుకోవడానికి రైతు భరోసా కేంద్రాల ద్వారా మామిడికాయలు ప్రొక్యూర్మెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లాఠీచార్జీలో కార్యకర్తలు గాయపడిన వారిని చూసి
"మీరు పోలీసుల? రాక్షసులా" అని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలుపై జగన్ మండిపడ్డారు.

బంగారుపాలెం మార్కెట్ యార్డులో మాట్లాడుతున్న జగన్
చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలో బుధవారం మధ్యాహ్నం వైసిపి అధ్యక్షుడు వైయస్ జగన్ పర్యటించారు. నిర్ణీత సమయానికంటే. ఆలస్యంగా 11. 45. గంటలకు ఆయన హెలికాప్టర్లో బంగారుపాలెం శివారులో దిగారు. అక్కడ నుంచి మామిడి మార్కెట్ యార్డు వద్దకు చేరుకోవడానికి పోలీసుల ఆంక్షలు, వైసిపి మద్దతు ధరలపై లాఠీచార్జి వంటి ఘటన నేపథ్యంలో జగన్ గంటన్నర తర్వాత మార్కెట్ యార్డ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ రైతులతో జగన్ మాట్లాడారు.
ఆ తర్వాత రైతులను ఉద్దేశించి జగన్ ప్రసంగించే సమయంలో వైసీపీ మద్దతు దారుల రచ్చ ఆగలేదు.
"కాబోయే సీఎం జగన్.. వచ్చేది మన ప్రభుత్వమే"అనే నినాదాలతో హోరెత్తించారు.
వైసీపీ క్యాడర్ నినాదాల మధ్య రైతులను ఉద్దేశించి జగన్ మాట్లాడారు.. రైతుల కష్టాలు తీర్చడంలో టిడిపికి కూటమి విఫలం చెందిందనీ ఆరోపించారు. ప్రస్తుతం మామిడి, టమాటా తో పాటు మిర్చి, పొగాకు సాగు చేసే రైతులకు కూడా తీరని అన్యాయం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
"మామిడి రైతుకు గిట్టుబాటు ధర సక్రమంగా ఇవ్వకుండా గాడిదలు కాస్తున్నార" అని సీఎం ఎన్. చంద్రబాబును ఉద్దేశించి జగన్ పరుషంగా మాట్లాడారు.
రైతులను రౌడీలు అంటారా
నేను వస్తున్నానని తెలిసి, తమ గోడు వెల్లబోసుకోవడానికి వస్తున్న రైతులను రౌడీ షీటర్లతో పోలుస్తారా అని జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కలవకుండా అడ్డుకునేందుకు రెండువేల మంది పోలీసులను మోకరించడంతోపాటు అడుగడుగునా ఆంక్షలు విధించడానికి ఆయన తీవ్రంగా తప్పుపట్టాడు. 1,200 రైతులను అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. రైతులు బంగారుపాలెం రాకుండా అడ్డుకోవడానికి ఎందుకు ఇంత తాపత్రయపడ్డారని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. చివరికి బైక్ లపై వస్తున్న వారిని కూడా అడ్డుకోవడం వెనక మీ ఉద్దేశం ఏమిటి అని ఆయన నిలదీశారు.
కేంద్రంలో మీరు భాగస్వామి కదా
వైసిపి అధికారంలో ఉండగా కిలో మామిడి 22 నుంచి 29 రూపాయలు కొనుగోలు చేసిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.
"చిత్తూరు జిల్లాలో ధరలు లేక రైతు కన్నీరు పెడుతున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే అని జగన్ నిందించారు జిల్లాలో 42 పల్ఫ్ పరిశ్రమలు ఉన్నాయి. ఈ ఏడాది మామిడి సీజన్ మొదటి వారంలోనే కొనుగోలు మొదలుపెట్టాలి ఆ పని ఎందుకు చేయలేదు? జూన్ రెండో వారం తర్వాత మామిడి కొనుగోలు ప్రారంభించడం వల్లే అప్పటికే పంట మొత్తం మార్కెట్ను ముంచెత్తడం వల్ల ఈ పరిస్థితి దాపురించింది. పరిశ్రమలు కూడా ధరలు తగ్గించాయి. దీంతో రైతులకు అప్పులు మిగులుతున్నాయి. టిడిపి కూటమి బాధ్యత రాహిత్యమే ఈ పరిస్థితికి కారణం" జగన్ టిడిపి కూటమిపై నిప్పులు చెరిగారు.
కర్ణాటక చేసిన పని కనిపించలేదా?
పొరుగు జిల్లా దిగుబడి కొనుగోలు చేయకూడదని చిత్తూరు జిల్లాలో ఆంక్షలు విధించిన విషయాన్ని వైఎస్. జగన్ పరీక్షంగా ప్రస్తావించారు. కర్ణాటక రైతులకు ఇదే వరంగా మారిందని జగన్ చెప్పకనే చెప్పారు.
"పొరుగున ఉన్న కర్ణాటకలో కిలో 16 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. ఎన్ఢీఏలో (NDA )లో కీలక భాగస్వామిగా ఉన్న జనతాదళ్ నేత, కేంద్రమంత్రి కుమారస్వామి మద్దతుతో కర్ణాటక ప్రభుత్వం రైతులకు మేలు చేసింది. అదే కూటమిలో భాగస్వామిగా ఉన్నటి టిడిపి రాష్ట్ర రైతులకు ఎందుకు మేలు చేయలేక పోయింది" అని వైయస్ జగన్ కూటమి ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా ప్రశ్నించారు.
"ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి జిల్లాలో మామిడి రైతులకు మేలు చేయండి" అని డిమాండ్ చేశారు
ఎంతకు కొన్నారో మీకు తెలియదా?
జిల్లాలో మామిడికి మద్దతు ధర ప్రకటించారు. గుజ్జు పరిశ్రమలు 8 ఇస్తుంటే ప్రభుత్వం అదనంగా నాలుగు రూపాయల చరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. నిజంగా అదే ధర రైతులకు దక్కుతూ ఉంటే రోడ్డు ఎందుకు ఎక్కారు ఆయన ప్రశ్నించారు.
మామిడి రైతులకు మేలు చేయడానికి కేంద్రంతో సంప్రదింపులు జరిపి మిగిలిన దిగుబడినైన మద్దతు ధర కొనుగోలు చేయాలని జగన్ డిమాండ్ చేశారు.
మనుషులా? రాక్షసులా?

బంగారుపాలెంలో తన కాన్వాయ్ వెంట అనుసరిస్తున్న పార్టీ క్యాడర్, పురుగు ప్రాంతాల నుంచి వచ్చిన వారిపై లాఠీచార్జి చేయడం పట్ల వైసిపి అధినేత వైయస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"మీరు మనుషులా? రాక్షసుల?. మరి ఇంత దిగజారి వ్యవహరిస్తారా" అని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు, సమీపంలో ఉన్న పోలీసు అధికారులపై వైయస్ జగన్ నిప్పులు చెరిగారు. తన సెక్యూరిటీ వాహనం నుంచి దిగి వెళ్ళడానికి ఆయన విప్రయత్నం చేశారు.
పోలీసుల లాఠీ చార్జీలు చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన యువజన విభాగం నాయకుడు తనకు గాయమైంది.
ఆయన చూసిన తర్వాత జగన్ మరింతగా రెచ్చిపోయారు. తీవ్ర పదజాలంతో పోలీసులను హెచ్చరించారు.
" రైతులే కాదు. మీకు సమస్యలు వచ్చిన నేనే స్పందించాలి. మా పార్టీ నే మాట్లాడుతుంది" అని జగన్ గుర్తు చేశారు.
"సమస్య ఎవరిదైనా సరే ప్రభుత్వాన్ని నిలదీయడానికి నేను, పార్టీ క్యాడర్ ఇకనుంచి ముందుంటుంది" అని జగన్ ప్రకటించారు.
"జిల్లాలో అడుగడుగున చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి అడ్డుకోవాల్సిన అవసరం మీకు ఏమి వచ్చింది. బాధితులు నా వద్దకు వచ్చి సమస్యలు చెప్పుకోవాలంటే అడ్డుకుంటారా? అని తీవ్ర స్వరంతో జగన్ పోలీసులు అధికారులపై. ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాహనం డోర్ వద్ద నిలబడి ప్రదర్శించిన హావభావాలు ఆయనలో తన్నుకు వచ్చిన ఆగ్రహం కనిపించింది. అక్కడే ఉన్న మణికంఠ చందాలతో పాటు అన్నమయ్య జిల్లా sp విద్యాసాగర్ నాయుడు కూడా సర్ది చెప్పడానికి విప్లయత్నం చేశారు.
వైయస్ జగన్ పర్యటన నేపథ్యంలో రెండు జిల్లాల నుంచి పోలీసులను భారీగా రప్పించారని విషయం స్పష్టంగా కనిపించింది.
ఈ సమాచారం అందుకున్న జగన్ పోలీసు అధికారుల తీరును, ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శల వర్షం కురిపించారు. ఇది కాస్త క్యాడర్లో మరింత జోష్ నింపింది. ఆంక్షలు ప్రతిబంధకాలు ఏమాత్రం ఖాతరు చేయకుండా అశేష కార్యకర్తలు రైతులు నాయకులు జగన్ వెంట నడిచారు.
Next Story