WONDER KIDS | సీమలో  గత రికార్డు తిరగరాసిన బాలుడు
x

WONDER KIDS | 'సీమ'లో గత రికార్డు తిరగరాసిన బాలుడు

బుడిబుడి అడుగుల వయసు. అద్భుత జ్నాపకశక్తితో India Book Of Rrcord'sలో స్థానం సంపాదించిన చిచ్చర పిడుగుల ఘనత ఇది.


రాయలసీమలో వండర్ కిడ్స్ శెభాష్ అనిపించుకుంటున్నారు. గత ఏడాది నంద్యాల రెండేళ్ల బాలుడు అరుదైన రికార్డు సాధించాడు. దీనిని అన్నమయ్య జిల్లాలో ఏడాదిన్నర వయసు బాలుడు అధిగమించాడు. మాటలు కూడా సరిగ్గా రాని వయసులో పదుల సంఖ్యలో జంతువులు, పక్షులు, వాహనాలను గుర్తించడమే కాదు. వాటి పేర్లు కూడా వడివడిగా చెప్పడంలో ఇద్దరు ఒకరికి మరొకరు తీసిపోమని చాటుకున్నారు. వారి జ్ఞాపకశక్తికి స్థానికులే కాదు. (INDIA BOOK Of Record's) నిర్వాహకులు కూడా ఫిదా అయ్యారు. ఈ వివరాల్లోకి వెళితే...

బుడిబుడి అడుగులు వేసే వయసు. మాటలు కూడా రావడం అంతంత మాత్రమే. అయితేనేం.1.5 ఏళ్లకే అన్నమయ్య (కడప) జిల్లా రాజంపేట బాలుడు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ (INDIA BOOK Of Record's) లో ఈ ఏడాది నవంబర్ 30వ తేదీ నిర్వహించిన పరీక్షలో స్థానం సంపాదించుకున్నాడు.
నంద్యాల బాలుడి పవర్
కర్నూలు జిల్లా నంద్యాలలోని బాలాజీ కాంప్లెక్స్ కె చెందిన స్వప్నిక దంపతుల కుమారుడు మోక్ష అయాన్ 23 నెలల వయసులో రెండేళ్లకు కూడా నిండని పసికూన టాలెంట్ తో ఆకట్టుకున్నాడు. 37 రకాల జంతువుల, ఏడు రకాల, పక్షులు, 12 వాహనాలు, 13 మంది జాతీయ నేతలను గుర్తించాడు. 12 రంగులు, 12 ఆక‌ృతులతో పాటు ఏ నుంచి జడ్ వరకు (A to Z) అవలీలగా చెప్పేశాడు. ఐదు జాతీయ గుర్తులు, ఐదు వ్యతిరేక పదాలు గుర్తించడం, 16 రకాల జంతువుల శబ్దాలను వీడియో తీసిన అయాన్ తల్లిదండ్రులు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులకు పంపించారు. అయాన్ పవర్ ను పరిశీలింని ఆ సంస్థ అధికారులు ధృవపత్రం, మెడల్ అందజేశారు.
బ్రేక్ చేసిన రాజంపేట బుడత

ఆ రికార్డును అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం ముకుందారగడ్డ ప్రాంతానికి చెందిన షేక్ మహమ్మద్ ముష్బాక్ సిద్ధికి తిరగరాశాడు. రెండు రోజుల కిందట నిర్వాహకుల నుంచి ధృవపత్రం అందిందని బాలుడి తల్లిదండ్రులు వీఆర్వో షేక్ ముజీబ్, షేక్ మసుద బేగం దంపతులు తెలిపారు.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరిని కలిసిన వీఆర్వో షేక్ ముజీబ్, షేక్ మసూదా బేగం దంపతులను అభినందించారు. వారి కొడుకు షేక్ మహమ్మద్ ముష్బాక్ సిద్ధికితో కాసేపు ముచ్చటించిన కలెక్టర్ శ్రీధర్.. కూడా ఆశ్చర్యపోయారు. చిన్న ప్రశ్నలు అడిగినా ఏమాత్రం జంకు లేకుండా సిద్ధికి చెప్పిన సమాధానాలు విని, మచ్చటపడ్డారు. మాటలు కూడా సరిగా రాని వయసులో ఈ బాలుడు వాహనాలు, జంతువులు, జాతీయ నేతలు, పక్షులను గుర్తించడమే కాదు. వాటి పేర్లు చకచకా చెప్పడం చూసిన కలెక్టర్ శ్రీధర్ ఆశ్చర్యపోయారు.
"ఈ బుడ్డోడి టాలెంట్ అపారం. పెద్దయ్యాక కూడా అభిరుచి అనుగుణంగా చదువులో రాణించడానికి శ్రద్ధ తీసుకోండి" అని సిద్ధికి తల్లిదండ్రులకు కలెక్టర్ శ్రీధర్ సూచించారు.
"మా కొడుకు చిన్ననాటి నుంచే చలాకీగా ఉండేవాడు" అని కలెక్టర్కు సిద్ధికి తల్లిదండ్రలు వివరించారు. ప్రస్తుతం ఒకటిన్నర సంవత్సరాల వయసులో 27 రకాల పండ్లు, కూరగాయలు, జంతువులు, పక్షులను, వృత్తులను, వాహనాలను స్వాతంత్ర సమరయోధులు మనిషి శరీర భాగాలు బొమ్మలు, ఆకారాలు చర్యల పదాలు ఆంగ్ల అక్షరాల ఆల్ఫాబెట్స్ మనుషులు, జంతువులు పక్షుల శబ్దాలు చాలా స్పష్టంగా గుర్తించడంతో ఇండియా బుక్ రికార్డ్స్ వారు ఇటీవల బాలునికి అవార్డు జారీ చేసినట్లు కలెక్టర్ కు వివరించారు.
Read More
Next Story