మోదీ రాకతో... ప్రీతి కుటుంబం గృహ నిర్భంధం
x

మోదీ రాకతో... ప్రీతి కుటుంబం గృహ నిర్భంధం

కర్నూలులో 2017లో సంచలం సృష్టించిన కేసు ఇది.


ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు పర్యటన నేపథ్యంలో గురువారం సుగాలి ప్రీతి తల్లినీ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కర్నూలు నగరం 2017 సంవత్సరం ఆగస్టు 18 ఓ హాస్టల్లో సుగాలి ప్రీతి అనుమానాస్పదం మరణం సంచలనం రేకెత్తించింది. "సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్" ( Super GST Super Savings ) కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు నగరంలో రోడ్ షో నిర్వహించే సమయంలో..

"సుగాలి ప్రీతి తల్లి పార్వతి, తండ్రి రాజా నాయక్ లేదా ఆమె మద్దతు దారులతో నిరసన సెగ తగిలే అవకాశం ఉందని పోసులు గృహ నిర్బంధం చేశారు"
"మా కూతురు ప్రీతి ఆత్మహత్య చేసుకోలేదు. హత్యకు గురైంది. శివ పరీక్షలో కూడా గర్భాశయం లో వీర్యం ఉందనే విషయం డాక్టర్లు నిర్ధారించారు" అని ఆధారాలతో సహా ప్రీతి తల్లి స్పష్టం చేశారు.
కర్నూలు నగరంలో కూడా బుధవారం ఆమె కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నిందితులకు శిక్ష వేయిస్తానని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దాటవేత ధోరణితో ఉన్నారని ప్రీతి తల్లి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా పర్యటనకు వచ్చే ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి జరిగిన అన్యాయం వివరిస్తానని హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సుగాలి ప్రతి తల్లిని గృహనిర్బంధం చేసినట్లు సమాచారం అందింది.
2017 లో టిడిపి అధికారంలో ఉండగానే కర్నూలులో సుగాలి ప్రతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఓ పాఠశాల హాస్టల్ గదిలో ప్రీతి ఫ్యానుకు శవమై వేలాడుతూ కనిపించింది. దీనిపై తీవ్ర ఆందోళన చెలరేగడంతో సీఎం ఇన్ చంద్రబాబు ఆదేశాల మేరకు కేసు నమోదు చేయడంతో పాటు దర్యాప్తు కూడా ప్రారంభించారు. 2019 లో వైసీపీ ప్రభుత్వం సిపిఐకి అప్పగించింది. నెలల కాలం గడిచిన స్పందన లేదని నిరసనలకు దిగారు. ప్రతిపక్షంలో ఉండగా కర్నూలు నగరంలో పర్యటించిన సందర్భంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సుగాలి ప్రీతి కుటుంబాన్ని పరామర్శించారు. నిందితులు ఎవరైనా సరే, బయటికి తీసుకుని వచ్చి శిక్షిస్తామని కూడా హామీ ఇచ్చారు.
డిప్యూటీ సీఎం అయ్యాక కూడా జరిగిన జాప్యం నేపథ్యంలో ప్రీతి తల్లి జనసేన, కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. దీంతో కూటమి ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. అయినా జాప్యం జరుగుతోందని భావించిన ప్రీతి తల్లి పార్వతి రెండు రోజుల కిందట కర్నూలు కలెక్టరేట్ వద్ద పార్వతి ధర్నా కూడా నిర్వహించింది. దీంతో
కర్నూలు పర్యటనకు వచ్చే ప్రధాని నరేంద్రమోదీని కలవడానికి ప్రయత్నాలు ప్రారంభించారని సమాచారం అందిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ప్రధాని మోదీ పర్యటనకు ఆటంకం కలిగే ప్రమాదం ఉందని ప్రీతి తల్లి పార్వతి, తండ్రి రాజు నాయక్ ను ఇంటి నుంచి కదలకుండా కట్టడి చేశారని అక్కడి నుంచి సమాచారం అందింది.
Read More
Next Story