రూ. 44 లక్షల విరాళంతో ఒకరోజు అన్నప్రసాద వితరణకు అవకాశం
x

రూ. 44 లక్షల విరాళంతో ఒకరోజు అన్నప్రసాద వితరణకు అవకాశం

తిరుమలలో దాతలే యాత్రికులకు స్వయంగా వడ్డించవచ్చు. దీనికోసం టీటీడీ ఎస్వీ అన్నదాన ట్రస్టు కూడా నిర్వహిస్తోంది.


తిరుమలలో ఆకలి అనే పదానికి చోటు లేదు. శ్రీవారిని దర్శనానికి వచ్చే యాత్రికులు కూడా తరిగొండ వెంగమాంట నిత్యాన్నదాన సత్రంలో భోజనం చేయవచ్చు. ఇక్కడ ఒక రోజు మొత్తం అన్నప్రసాదాలు అందించేందుకు రూ. 44 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ మొత్తం టీటీడీ ఎస్వీ అన్నదాన ట్రస్టుకు జమ చేసే దాత కుటుంబం స్వయంగా యాత్రికులకు ప్రసాదాలు వడ్డించవచ్చు. టీటీడీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.


శ్రీవారి దర్శనార్థం దేశవిదేశాల నుంచి వచ్చే యాత్రికుల కోసం తిరుమ‌ల‌లో టీటీడీ నిత్యాన్నదాన సత్రం నిర్వహిస్తోంది. ఇక్కడ స్టార్ హోటల్ కు ఏమాత్రం తీసిపోని రీతిలో ఆహార పదార్థాలు వడ్డిస్తారు. ఈ సత్రం నిర్వహణ కోసం టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు కూడా ఏర్పాటు చేసింది. యాత్రికులకు రుచిగా, శుచిగా అన్నప్రసాదాలు అందుబాటులో ఉంచుతుంది. ఇందుకోసం టీటీడీ విరాళాలు కూడా స్వీకరిస్తోంది. ఇక్కడ ఏ పదార్థాలు వడ్డిస్తారంటే..

ఒక పూటకు విరాళం ఎంతంటే..
నిత్యాన్నదాన సత్రంలో ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణకు రూ. 44 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఉదయం అల్పాహారం కోసం రూ.10 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం రూ. 17 లక్షలు, రాత్రి భోజనం కోసం – రూ.17 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చు అని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో బోర్డులో ప్రదర్శించడంతో పాటు అక్కడ పూజల అనంతరం అన్నప్రసాదాల వివరణ ప్రారంభిస్తారు. దాతలు వారి కోరిక మేరకు ఒకరోజు ఇక్కడ అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని కూడా కల్పించినట్లు టీటీడీ వెల్లడించింది.
తిరుమల, తిరుప‌తిలో ...
ప్రస్తుతం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1, 2లోని కంపార్ట్‌మెంట్లు, బయటి క్యూలు, పీఏసీ-4 (పాత అన్నప్రసాదం ), పీఏసీ-2, తిరుపతిలోని శ్రీగోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం, శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులు, రుయా ఆసుపత్రి, స్విమ్స్, మెటర్నిటీ ఆస్పత్రి, బర్డ్, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి, తిరుచానూరులోని అన్నప్రసాద భవనంలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది.
తిరుమలలోని ఫుడ్ కౌంటర్లలో అన్నప్రసాదాలు అందిస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1, 2లోని కంపార్ట్‌మెంట్లు, వృద్ధులు, దివ్యాంగులు వేచి ఉండే కాంప్లెక్స్, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన కాంప్లెక్స్, ప్రధాన కల్యాణకట్టలో టీ, కాఫీ, చంటిపిల్లలకు పాలు అందిస్తున్నారు. ఈ ఖర్చు మొత్తం దాతలు అందించిన విరాళాలను ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తారు. ఆ మొత్తం నుంచి వడ్డీని నిత్యాన్నదానానికి వినియోగిస్తుంటారు.
Read More
Next Story