వైసీపీని పవన్ ఒక్క సీటుకు ఎలా.. పరిమితం చేస్తాడబ్బా..!
x

వైసీపీని పవన్ ఒక్క సీటుకు ఎలా.. పరిమితం చేస్తాడబ్బా..!

వైసీపీని వదిలనని ఎప్పుడో చెప్పా. సీట్లు బుద్ధి రాలేదు. మళ్లీ ఎన్నికల్లో పాతాళానికి తొక్కేస్తానని కళ్యాణ్ భీకర ప్రతిజ్ఞ చేశారు. దీనికి భూమన సవాల్ ఏమిటి


రాష్ట్రంలో ఎన్నికలు జరిగి మూడు నెలలు కావస్తోంది. అంటే ఇంకా ఎన్నికలకు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఆగాలి. ఒకవేళ జెమిలి ఎన్నికలు జరగకుంటే మాత్రమే. రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు వస్తే వైసీపీని ఒక్క సీటుకు మాత్రమే పరిమితం చేస్తా అని డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ కొణిదల పవన్ కళ్యాణ్ భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఆయన మాటలను పరిశీలిస్తే, కడప జిల్లా పులివెందులలో వైయస్ జగన్ విజయం తథ్యం అనే విషయము స్పష్టమవుతుంది.

"రాష్ట్రంలో వైసీపీ ఐదేళ్ల పాలనలో అనేక అరాచకాలకు పాల్పడింది. సనాతన హిందూ ధర్మంపై దాడి చేసింది" అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూటిగా నిందించారు. అందువల్లే 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైసీపీని తిరస్కరించారు. అయినా వారికి బుద్ధి రాలేదని కూడా వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే..
ఆ వ్యాఖ్యలపై వైసీపీ ఘాటుగానే స్పందించింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి రెండు సవాళ్లు సంధించారు. వివరాల్లోకి వెళితే..
తిరుపతి వేదికగా గురువారం రాత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ -2024 వెల్లడించారు. ఈ సభలో ఆయన మతం, హిందూ సనాతన ధర్మం, వైసీపీ టార్గెట్ చేసి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అది కూడా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన వ్యవహారాలను ప్రధాన అస్త్రంగా ఎంచుకున్నాదనే విషయం స్పష్టంగా అర్థం అవుతుంది.
రాజకీయాలను మతాలకు ముడి పెట్టే ముందుకు సాగుతున్నారని విషయం కూడా అక్షరజ్ఞానం లేని వారికి కూడా సరళంగా అర్థం అవుతుంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందనే విషయం చాలా సున్నితమైనది. భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. దీనిపై సుప్రీంకోర్టు కూడా కీలక వ్యాఖ్య చేసింది.
"విచారణ జరగకముందే కల్తీ జరిగిందని ప్రకటన చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుంది. కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలు ఉన్నాయా?" అనడంతో పాటు " కనీసం దేవుడిని అయినా రాజకీయాలకు దూరంగా ఉంచండి" అని కూడా సుప్రీం కోర్టు హితవు పలికింది. అయితే.
టీడీపీ కూటమి నాయకులు ఎవరు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్నట్టు కనిపించలేదు. అందులో ప్రధానంగా జనసేన పార్టీ అధ్యక్షుడిగా కాకుండా, తాను ఈ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిని అనే విషయాన్ని కూడా మరిచిపోయి. తిరుమల, లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారమే ప్రధాన అంశంగా మతానికి ముడిపెట్టి వైసీపీ పాలనలో సాగిన అంశాలను కీలక అస్త్రాలుగా ఎంచుకున్నారు. పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..
వదిలే సమస్య లేదు
వైసీపీ పాలనలో అరాచకాలే కాదు. హిందూ సనాతన ధర్మానికి విఘాతం కల్పించిన మాజీ సీఎం వైఎస్ జగన్ వదిలిపెట్టే సమస్య లేదని డిప్యూటీ సీఎం, జనసేన పవన్ కళ్యాణ్ తిరుమల వెంకన్న పాదాల చెంత ఉన్న తిరుపతిలో ప్రతినబునారు. గతంలో నేను తిరుపతిలో వారాహి యాత్ర నిర్వహించినప్పుడు తిరుమల లడ్డు అపవిత్రం అవుతోందని చెప్పినా.. వైసీపీ పాలకులు, ప్రధానంగా టీటీడీ పాలకమండలి చైర్మన్, సభ్యులుగా పని చేసిన వైవీ. సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, వారి సారధ్యంలోని సభ్యులెవరూ చెవికి వేసుకోలేదని నిరసన వ్యక్తం చేశారు.
"ఇప్పటికీ చెబుతున్న లడ్డూ వ్యవహారంలో మాజీ సీఎం జగన్ ను నిందించడం లేదు" అని పవన్ సన్నాయి నొక్కులు నొక్కుతూ, టీటీడీ చైర్మన్లుగా పని చేసిన వారిదే బాధ్యత అని మాజీ చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిని టార్గెట్ చేశారు.
వైసీపీ ఐదేళ్ల పాలనలో సాగించిన అరాచకాన్ని ఓటర్లు అసహించుకున్నారు. అందుకు సాక్ష్యం గత సార్వత్రిక ఎన్నికల్లో 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు. మళ్లీ ఎన్నికలు రానివ్వండి. ఒక సీటుకు పరిమితం చేస్తా. ఏమంటారు అలా చేద్దామా? అని వారాహి డిక్లేషన్ సభకు అశేషంగా హాజరైన పార్టీ శ్రేణులు అభిమానులను ఉత్తేజం చేసే వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు సబబుగా లేదని సీపీఎం రాష్ట్ర నేత కందారపు మురళి వ్యాఖ్యానించారు. "ఏకపక్షంగా దాడి చేశారు. తిరుమల శ్రీవారు మతసామరస్యానికి ప్రతీక" అనే విషయాన్ని కూడా విస్మరించారు. "పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మత ఉద్రిక్తతలకు దారి తీసే విధంగా ఉన్నాయి" అని కూడా కందారపు మురళి ఆందోళన వ్యక్తం చేశారు. కాగా,
లడ్డూ కల్తీ వ్యవహారం వారి తీరు వల్లే జరిగింది అనే పవన్ కళ్యాణ్ పదేపదే పునరుద్ఘాటించారు. "జగన్ ను ఏ రోజు ఒక పల్లెత్తు మాట అనలేదు. సీఎంగా ఉన్నప్పుడు స్థాయి పెరిగిందని ఏడుకొండలవాడుకి కూడా అపచారం చేస్తే, మెత్తగా ఎందుకు ఊరుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి మాటలు మాట్లాడే రోజును వైసీపీ నాయకులే తెప్పించారు." అని కూడా వ్యాఖ్యానించారు. ఎవరైతే సనాతన విరోధులో.. ధర్మాన్ని మట్టిలో కల్పిస్తామన్నారో వాళ్లతోనే గొడవ పెట్టుకోవడానికి" వచ్చానని వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్ కయ్యానికి సిద్ధంగా ఉన్నాననే సంకేతం ఇచ్చినట్లు కనిపిస్తోంది. "నేను సనాతన ధర్మాన్ని ప్రేమిస్తా, మిగతా మతాలను గుండెల నిండా నింపుకున్నా" అని కూడా పవన్ కళ్యాణ్ చెబుతూనే, కల్తీ లడ్డు అయోధ్య రామాలయానికి పంపించారు. అని కూడా ఆరోపించారు.
ఏ విచారణ అయినా రెడీ..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై టిటిడి మాజీ చైర్మన్, వైసిపి అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి మాటలతో ర్యాగింగ్ చేశారు. లడ్డు వ్యవహారంలో తాము ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని తెగేసి చెప్పారు.

" పవన్ కళ్యాణ్ మాటలు జనసేన పీఠాధిపతి తరహాలో అనుగ్రహ భాషణం చేశారు" అని వ్యంగ్యాస్త్రాలు సందించారు. కూతురికి డిక్లరేషన్ ఇవ్వడం ద్వారా ప్రచారం పొందడానికే అంటూ, ఇన్నేళ్లపాటు తన బిడ్డలను పవన్ కళ్యాణ్ తిరుమలకు ఎందుకు తీసుకురాలేకపోయారో.. చెప్పాలని కూడా కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ డైలాగులు, పీఠాధిపతులను తలదన్నే రీతిలో మాటలు చూస్తుంటే గబ్బర్ సింగ్ సినిమా పేరు ప్రస్తావించకుండా 'కెవ్వు కేక' పాటను తలపించే రీతిలో ఉన్నాయని సెటైర్లు వేశారు.
తిరుమల శ్రీవారి వైభవాన్ని, వైష్ణవ తత్వాన్ని చాటిన 13 మంది ఆళ్వారుల తర్వాత పవన్ కళ్యాణ్ 14వ స్వామీజీగా అవతరించినట్లు ఉందని చురకలంటించారు. పవన్ కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి ప్రసాదం పీఠాధిపతి లెవెల్ లో మాట్లాడారు. అయోధ్యకు కల్తీ చేసిన లడ్డు పంపించారని చేసిన ఆరోపణలను ఖండించారు. క్షుద్ర రాజకీయానికి పవన్ కళ్యాణ్ తెర తీశారు అంటూ ఘాటైన వ్యాఖ్య చేశారు.
ఇది నా సవాల్
శ్రీవారి లడ్డులో కల్తీ జరిగినట్లు తెలిస్తే ఏ శిక్షకైనా సిద్ధం. అని కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. జగన్ పై దాడి చేయడం ద్వారా సనాతర ధర్మాన్ని పరిరక్షించాలనుకునే ఆయుధంగా మలచాలనుకుంటున్నావా? తద్వారా హైందవ జాతిని కించపరుస్తున్నావ్. హిందూ జాతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావ్. అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"లడ్డులో పశువుల కొవ్వు వాడారని తిరుమలలో ప్రమాణం చేస్తావా" అని కూడా కర్ణాకర్ రెడ్డి సవాల్ విసిరారు. నెయ్యిలో కల్తీ చేసి ఉంటే దేనికైనా సిద్ధం అన్నారు. శ్రీ వాణి ట్రస్ట్ లో అవినీతి జరిగిందని వేంకటేశ్వరస్వామి పాదాలపై ప్రమాణం చేస్తావా" అని కూడా కరుణాకరరెడ్డి మరో సవాల్ చేశారు. దీనికి జనసేన పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో వేచిచూద్దాం.
Read More
Next Story