TDP Leader murder case | కర్నూలు టీడీపీ నేత ఎందుకు హత్యకు గురయ్యారు?
x

TDP Leader murder case | కర్నూలు టీడీపీ నేత ఎందుకు హత్యకు గురయ్యారు?

రెండు కుటుంబాల మధ్య గొడవలే ఈ హత్యకు కారణమైన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆ వివరాలు వెల్లడించారు.


ఆలయం నుంచి ఇంటికి తిరిగి వెళుతుండగా, కత్తులతో దాడి చేసి, టీడీపీ నేత కాశపోగు సంజన్నను హత్య చేసిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 14వ తేదీ రాత్రి కర్నూలు నగరం శరీన్ నగర్ లో ఈ ఘటన జరిగింది. సంజన్నను హత్య చేసిన నిందితుల నుంచి ఆయుధాలు కార్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో రౌడీషీటర్లపై నిఘా పెంచామని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియాకు చెప్పారు.


కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆ వివరాలు వెల్లడించారు. రెండు కుటుంబాల మద్య గొడవలే సంజన్న హత్యకు కారణం. అని చెప్పారు. హత్యకు గురైన సంజన్న, నిందితుడి కుటుంబాల మధ్య తరచూ ఘర్షణలు జరిగాయన్నారు.

కర్నూల్ టౌన్ శరీన్ నగర్, అల్లిపీర వీరస్వామి భజన మందిరంలో భజన ముగించుకొని బయటకు వస్తున్న కాశపోగు సంజన్న(60)పై అదే ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ వడ్డె ఆంజనేయులు అతని కుమారులు, అనుచరులు, కొంతమంది కత్తులు, పిడిబాకులు, కోడవాళ్ళతో దాడి చేశారని దర్యాప్తులో తెలిందని తెలిపారు. సంజన్న కొడుకు జయరాముడు నగరంలోని 30వ వార్డు టీడీపీ కార్పొరేటర్ గా ఉన్నారు.
తన తండ్రిని హత్య చేశారనే జయరాముడు ఫిర్యాదు ఆధారంగా కర్నూలు నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 95/ 2025 కింద కేసు నమోదు చేశామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ చెప్పారు. ఈ కేసులో వడ్డే ఆంజనేయులు (ఆంజి), ఇతని ముగ్గురు కొడుకులు ముగ్గురు కుమారులు, అతని భార్య, ఇంకొంతమందిపై , దాడి, హత్య, ఎస్సీ ఎస్టీ అత్యాచారాలు చట్టం కింద కేసు నమోదు చేశామని వివరించారు. మహిళా పీఎస్ డిఎస్పి కె. శ్రీనివాసచారి చేసిన దర్యాప్తులో నిందితులు వడ్డే ఆంజనేయులు (52), అతని కొడుకులు వడ్డే శివ కుమార్ (20), వడ్డే తులసి (23), వడ్డే రేవంత్ (22), వారి అనుచరుడు మాల అశోక్(30)ను అరెస్టు చేశామని ఎస్పీ వివరించారు. నిందితులు హత్యకు ఉపయోగించిన వేట కొడవళ్లు, పిడిబాకు, రక్తపు మరకలు కలిగిన దుస్తులు, సెల్ ఫోన్లు, కర్రలు హత్యా సమయంలో వాడిన కార్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు.
హత్య కేసును ఛేదించిన D.S.P కె.శ్రీనివాసచారి, కర్నూల్ SDPO, జె. బాబుప్రసాద్, కర్నూల్ నాల్గవ పట్టణ సీఐ మధుసూదన్ గౌడ్, కర్నూల్ 3 టౌన్ సిఐ శేషయ్య, కర్నూల్ రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు, కర్నూల్ తాలూకా యుపిఎస్ సీఐ శ్రీధర్, కోడుమూరు CI తబ్రేజ్, సైబర్ సెల్ సీఐ ఎస్ వేణుగోపాల్ ఎస్ఐలు, సిబ్బందిని అభినందించారు.
Read More
Next Story