కడప ఎంపీ అవినాష్ ఎందుకు బైఠాయించారు?
x
వాహనం ముందు బైఠాయించిన కడప ఎంపీ వైఎస్. అవానాష్ రెడ్డి

కడప ఎంపీ అవినాష్ ఎందుకు బైఠాయించారు?

పులివెందులలో ఆసక్తి పరిణామం. అవినాష్ చేసిన వ్యాఖ్యలు ఏమిటి?


పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో జరుగుతున్న ఉప ఎన్నికలో విజయం కోసం వైఎస్ఆర్ ఫ్యామిలీ పోరాటం సాగించాల్సిన పరిస్థితి అనివార్యమైంది. పులివెందులలో ఆసక్తికర పరిణామం చోటుచేసకుంది. పులివెందులలో ఉద్రిక్తతల మధ్య మంగళవారం ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ముందస్తు అరెస్టుల్లో భాగంగా పులివెందుల నివాసంలో ఉన్న కడప ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకునే సమయంలో చోెటుచేసుకున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయని అక్కడి మీడియా ప్రతినిధుల ద్వారా తెలిసింది.

కడప జిల్లా పులివెందుల తోపాటు వైఎస్ కుటుంబానికి రాష్ట్రంలో బ్రాండ్ ఇమేజ్ ఉంది. స్వయంకృత చర్యల కారణంగా రాజకీయంగా వారి పరిస్థితి ఇబ్బందిలో పడిందనడంలో సందేహం లేదు. అయితే,

కడప ఎంపి వైఎస్. అవినాష్ రెడ్డిని పోలీసులు మంగళవారం వేకువజామున ఆయన నివాసంలో ముందస్తు అరెస్టు చేశారు. ఈ సమయంలో ఆయన భార్య కూడా అడ్డుపడ్డారు. అయితే, పోలీసులు బలవంతంగా వాహనం వద్దకు ఎంపీ అవినాష్ రెడ్డిని బయటికి తీసుకుని వచ్చే సమయంలో వైసీపీ శ్రేణులు భారీగా అడ్డుపడ్డాయి. ఇంటి నుంచి బయటికి రాగానే ఎంపీ అవినాష్ రెడ్డి వాహనం వద్ద నేలపై బైఠాయించారు.
అరెస్టు చేయడానికి వీలులేదంటూ ఎంపీ అవినాష్ రెడ్డి ఎదురుతిరిగారని సమాచారం అందింది.
"తనను వైఎస్. వివేకా కేసులో అరెస్టు చేస్తున్నారేమో?" అని నేలపై బైఠాయించినట్లు పులివెందల నుంచి అందిన సమాచారం. ఇదే మాట చెబుతూ ఎంపీ అవినాష్ రెడ్డి వాహనం ఎక్కడానికి తిరస్కరించినట్లు తెలిసింది. వివేకా హత్య కేసుకు సంబంధించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఎన్నికల పోలింగ్ నేపథ్యంలోనే మిమ్మలను అరెస్టు చేస్తున్నాం. పోలింగ్ ప్రశాంతంగా జరగడం కోసమే అని సమాధానం చెప్పిన పోలీసులు ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డిని కడపకు తరలించినట్లు తెలిసింది.
Read More
Next Story