
TIRUMALA | వైకుంఠ ద్వార ప్రవేశం... యాత్రికులకు ఓ పరీక్ష...
24 లక్షల్లో 1.80 లక్షలు అదృష్టవంతులు ఎవరో.. ? మంగళవారం ఉదయమే సమాధానం...
తిరుమల శ్రీవేంకటేశ్వర దర్శనం, వైకుంఠ ద్వారంలో ప్రవేశం యాత్రికులకు పరీక్షగా మారింది. దరఖాస్తు చేసుకున్న 24 లక్షల మందిలో 1.80 లక్షల మందిని ఎంపిక చేయడం కూడా టీటీడీ ఐటీ విభాగం (TTD IT Department) యంత్రాంగానికి అగ్నిపరీక్షలా మారింది. డిసెంబర్ 30వ తేదీ నుంచి ఒకటో తేదీ వరకు ఇబ్బందులు లేకుండా మొదటి వైకుంఠ ద్వార దర్శనాలు దక్కించుకునే అదృష్ట యాత్రికుల సంఖ్య మంగళవారం తేలిపోనుంది. ఈ సస్పెన్స్ మంగళవారం ఉదయం నుంచి వీడనుంది.
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్లకు రిజిస్ట్రేషన్ గడువు సోమవారంతో ముగిసింది. వైకుంఠ ద్వార ప్రవేశం, శ్రీవారి దర్శనం దక్కే యాత్రికుల అదృష్టానికి టీటీడీ పరీక్ష పెట్టింది. ఎంతమందికి మూడు రోజుల దర్శనానికి అనుమతి దక్కుతుందనేది మంగళవారం తేలిపోతుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిని డిప్ పద్ధతిలో ఎంపిక చేసి, వారి సెల్ ఫోన్లకు ఎస్ఎంఎస్ లు పంపడానికి టీటీడీ ఐటీ విభాగం కసరత్తు చేయడం అనడం కంటే, వారికి పరీక్షగా మారింది.
మూడు రోజుల్లో 1. 80 లక్షల మందికే సాధ్యం?
తిరుమల శ్రీవారిని మూడు రోజులు 1.80 లక్షల మందికి దర్శనం చేయించడానికి సాధ్యం అవుతుంది. వైకుంఠ ద్వార దర్శనాలకు పారదర్శక విధానం అమలులోకి తెచ్చాం అని టీటీడీ పాలక మండలి చైర్మన్ బీఆర్. నాయుడు ప్రకటించారు వెబ్ సైట్లు అందుబాటులోకి వచ్చిన తరువాత ఐదు రోజుల్లో 24 లక్షల మంది టోకెన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారిలో అదృష్టవంతులు ఎవరనేది మంగళవారం తేలిపోతుంది.
ముగిసిన రిజిస్ట్రేషన్
వైకుంఠ ఏకాదశి ప్రారంభమయ్యే ఈ నెల 30వ తేదీ నుంచి 2026 జనవరి ఒకతో తేదీ శ్రీవారి దర్శనానికి టీటీడీ రిజిస్ట్రేషన్ కోసం టీటీడీ వెబ్ సైట్లను గత నెల 27వ తేదీ అందుబాటులోకి తెచ్చింది. ఆ మూడు రోజుల దర్శనాల కోసం 24 లక్షల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వాస్తవానికి ఆ మూడు రోజుల్లో 1.80 లక్షల మందికి మాత్రమే శ్రీవారి దర్శనం, వైకుంఠ ద్వార ప్రవేశానికి సాధ్యం అవుతుంది. లక్కీ డిప్ ఎలా తీస్తారనేది తేలలేదు. ముందు పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిని ప్రామాణికంగా టోకెన్లు జారీ చేస్తారా? లేక లక్కీ డిప్ ఏ పద్ధతిలో నిర్వహించారు? ఎవరికి టోకెన్లు దక్కబోతున్నాయనే వివారాల ఆధారంగా ఆ విషయం స్పష్టం కావడానికి కొన్ని గంటల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఈ డిప్ ద్వారా టోకెన్లు
ఈ ఏడాది డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి, 31న ద్వాదశి, 2026 జనవరి ఒకటో తేదీ దర్శనాలకు ఇప్పటికే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న యాత్రికులను ఈ డిప్ ద్వారా ఎంపిక చేయనున్నారు. తద్వారా వారి సెల్ ఫోన్లకు మెసేజ్ పంపించనున్నారు. ఆ సందేశంలో ఉన్న లింకు ద్వారా టోకెన్ డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
టీటీడీ అధికారుల ద్వారా తెలిసిన సమాచారం మేరకు మూడు రోజుల దర్శనాలకు కోసం దేశంలోని అనేక ప్రాంతాలకు చెందిన శ్రీవారి భక్తుల్లో 9.6 లక్షల మంది వెబ్ సైట్లలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే ఓ దరఖాస్తు ద్వారా 1+3 అంటే 24,,05,237 మంది యాత్రికుల పేర్లు టీటీడీ వెబ్ సైట్, వాట్సాప్, ఈ గవర్నెస్ ద్వారా నమోదు చేసుకున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ( Tirumala Tirupati Devasthanams TTD) మొబైల్ యాప్ లోనే 13.4 లక్షల మంది పేర్లు నమోదయ్యాయి. TTD Website లో 9.3 లక్షలు, Pe Government Whats App ద్వారా 1.5 లక్షల మంది యాత్రికులు వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల దర్శనాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు.
ఈ వ్యవహారం పక్కన ఉంచితే..
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమలలో ఒకటి, తిరుపతిలో తొమ్మిది కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా ఏ రోజుకు ఆ రోజు టోకెన్లు జారీ చేసి, పది రోజుల పాటు దర్శనాలు కల్పించే విధానం వైసీపీ ప్రభుత్వంలో ప్రారంభమైంది. ఈ పద్ధతి టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక గత ఏడాది, ఈ సంవత్సరం జనవరిలో కూడా నిర్వహించారు. ఈ సంవత్సరం జనవరి తొమ్మిదో తేదీ తిరుపతిలోని రెండు కేంద్రాలు బైరాగిపట్టెడ, శ్రీనివాసం యాత్రికుల సముదాయం కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించడం, 40 మంది గాయపడిన సంఘటన నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించారు.
" యాత్రికులకు పారదర్శకంగా టోకెన్లు జారీ చేయాలని ఆన్ లైన్ విధానం అందుబాటులోకి తెచ్చాం" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు ప్రకటించారు. అంతేకాదు, ఆ విధానం అమలులోకి తెచ్చారు. ఈ సంవత్సరం జనవరిలో కూడా వైసీపీ బాటలోనే వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజుల పాటు ద్వారాలు తెరిచి ఉంచడం ద్వారా దాదాపు ఏడు లక్షల మంది యాత్రికులకు శ్రీవారి దర్శనం కల్పించారు. ఈసారి మాత్రం పద్ధతి మార్చారు. ఎన్ని లక్షల మందికి దర్శనం దక్కుతుంది. పరిణామాలు ఎలా ఉంటాయనేది కాలం చెప్పే సమాధానం కోసం వేచి ఉండాల్సిందే...
Next Story

