TTD | శ్రీరంగంతో తిరుమలకు ఈ అనుబంధం ఏనాటిదో..
x

TTD | శ్రీరంగంతో తిరుమలకు ఈ అనుబంధం ఏనాటిదో..

శ్రీవైష్ణవాలయాల మధ్య కూడా చారిత్రక అనుబంధం ఉంది. దీనిని టీడీడీ కొనసాగిస్తున్న టీటీడీ శ్రీరంగనాథుడికి పట్టువస్రాలు సమర్పించింది.


ధారణంగా స్నేహబంధం విడదీయలేనిది. కుటుంబ అనుబంధాలు చాలా గొప్పవి. శతాబ్దాల కాలంగా తమిళనాడులోని శ్రీరంగంతో తిరుమలకు ఉన్న ఆధ్మాత్మిక వారసత్వ అనుబంధాన్ని టీటీడీ కొనసాగిస్తోంది. అందులో భాగంగా బుధవారం టీటీడీ పక్షాన ఈఓ జే. శ్యామలరావు శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయానికి పట్టువస్త్రాలు సమర్పించారు.

ప్రతి సంవత్సరం కార్తీకమాసం తరువాత వచ్చే ఏకాదశి రోజున శ్రీరంగం ఆలయానికి టీటీడీ పట్టువస్త్రాలు అందజేస్తుంది. ఆ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.
వారసత్వ అనుబంధం
దేశంలోని శ్రీవైష్ణవ ఆలయాలకు కేంద్రం శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం. ఔరంగజేబు కాలంలో జరిగిన ఆలయాల దండయాత్ర నేపథ్యంలో కలిగియుగవైకుంఠంలో ఉభయదేవేరులతో పాటు శ్రీరంగనాథుడి విగ్రహాలను తిరుమలలో భద్రపరిచారు. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఔరంగజేబు తిరుమల పైకి కూడా దండయాత్ర చేయాలని తిరుపతికి చేరుకున్నారు. ఆ సమయంలో స్థానిక హిందూ, ముస్లింలు ఔరంగజేబును నిలువరించి, బీబీనాంచారి పాత్ర సృష్టించి, శ్రీవేంకటేశ్వరుడిని అల్లుడిగా వివరించినట్లు చారిత్రక కథనం.
దీంతో శాంతించిన ఔరంగజేబు శ్రీవారికి కానుక సమర్పించి, వెనుదిరిగారనేది చారిత్రక ఆధారకథనం. దీంతో ఆ నాటి నుంచి దశాబ్దాల కాలంగా శ్రీరంగం వైష్ణవక్షేత్రానికి తిరుమలలోని శ్రీవారి ఆలయానికి ఉన్న అనుబంధం మరింత బలపడినట్టు చరిత్రకారులే చెప్పడమే కాదు. టీటీడీ అధికారులు కూడా ఓ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. శ్రీరంగం ఆలయ అధికారులు కూడా తిరుమల శ్రీవారికి కానుకలు సమర్పించడం ఆనవాయితీగా పాటిస్తున్నారు.

అందులో భాగంగా, బుధవారం తమిళనాడులోని శ్రీరంగంలోని ప్రముఖ శ్రీవైష్ణవ క్షేత్రం శ్రీరంగనాథస్వామికి టీటీడీ ఈఓ జె. శ్యామలరావు బుధవారం పట్టువస్త్రాలు సమర్పించారు. దేశంలోని ముఖ్యమైన పుణ్యక్షేత్రాలకు టీటీడీ 2008 నుంచి పట్టువస్త్రాలు సమర్పిస్తోంది. అందులో భాగంగా "ఈ ఏడాది కూడా శ్రీరంగం ఆలయానికి పట్టువస్త్రాలను సమర్పించాం" అని ఈఓ శ్యామలరావు తెలిపారు.
ఆలయ సంప్రదాయంతో స్వాగతం

తిరుమల నుంచి పట్టువస్త్రాలు తీసుకుని వెళ్లిన టీటీడీ ఈఓ శ్యామలరావుతో పాటు ఆయన సారధ్యంలో వెళ్లిన తిరుమల ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం, టీటీడీ సిబ్బందికి శ్రీరంగం ఆలయం వద్ద క్షేత్ర మర్యాదలతో అక్కడి అధికారులు స్వాగతించారు. శ్రీరంగనాథుడి ఆలయ ప్రధానద్వారం వద్ద టీటీడీ ఈఓకు శ్రీరంగం ఆలయ జాయింట్ కమిషనర్ మరియప్పన్ స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతికి టీటీడీ ఈఓ శ్యామలరావు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ తరువాత ఈ లాంఛనాలు పూర్తయ్యాక ప్రధానఆలయంలోని శ్రీరంగనాథుడి మూలవిరాట్టు దర్శనం చేసుకున్నారు. ఆలయంలోని ఉపఆలయాలను దర్శనం చేసుకున్నారు.
తిరుమలకు పట్టువస్త్రాలు
తిరుమలలో ఆణివార ఆస్థానం నిర్వహించే సమయంలో శ్రీరంగం నుంచి ఆలయ అధికారులు పట్టువస్త్రాలు తీసుకుని వచ్చి, సమర్పిస్తారు. ఏడాదికి ఓసారి ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా పాటిస్తున్నారు.


Read More
Next Story