మెగా బ్రదర్స్.. ఏమి చేసినా సినీ కథా చిత్రాలే!
కొణిదెల సోదరులు రాజకీయాల్లో వినూత్న ఒరవడిని కోరుకుంటారు. అందులో సినిమా తరహా ట్విస్ట్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ అదే విధానం అనుసరిస్తున్నారా?
తిరుపతి సెంటిమెంట్ పాటించిన మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి క్లాప్ కొట్టడంలో అనుసరించిన విధానంతో తీవ్ర ఉత్కంఠ రేకెత్తించారు. పార్టీ పేరు ప్రకటించడంలో కూడా ఏమాత్రం తగ్గలేదు. దాదాపు 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చిరంజీవి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సినిమా తరహాలో ఆసక్తికర సన్నివేశానికి తెర తీశారు.
థియేటర్లో ప్రేక్షకులను మూడు గంటల పాటు కుర్చీలకు అతుక్కుపోయేలా చేయాలంటే కథలో దమ్ము ఉండాలి. ఉత్కంఠ కలిగించాలి. నాలుగు ఫైట్లు, ఆరు పాటలు ఉండాలి. విలన్ తో హీరో ఛేజింగ్ ఉండాలి. మధ్యలో రసవత్తమైన సీన్లు ఉండాలి. మధ్యమధ్యలో హాస్య సన్నివేశాలు కూడా ఉంటేనే సినిమా రక్తికడుతుంది. దర్శకుడు హీరోకే పేరు వస్తుంది. నిర్మాతకు నాలుగు డబ్బులు మిగులుతాయి. స్థూలంగా సినిమా పరిశ్రమ తీరు ఇది.
సినిమా రంగం నుంచి ఆంధ్రనాట అనేకమంది కథానాయకులు చలనచిత్ర రంగంపై చెరగని ముద్ర వేశారు. అందులో ప్రధానమైన పాత్ర పోషించింది టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీరామారావు అని చెప్పడంలో సందేహం లేదు. సుదీర్ఘ విరామం తర్వాత మెగాస్టార్ కొణిదల చిరంజీవి అందుకు సాహసించారు. ఆ కథ ఏమిటో ఒకసారి చూద్దాం..
2008: ఆగస్టు 26వ తేదీ
వేదిక: తిరుపతి సమీపంలోని అవిలాల చెరువు.
అప్పటికి చిరంజీవి పార్టీ ప్రకటించలేదు. రహస్యంగా ఉంచారు. తిరుపతి సెంటిమెంటుకు ప్రాధాన్యత ఇస్తూ పార్టీని ప్రారంభించాలని ముహూర్తం నిర్ణయించారు. ఇందుకోసం తిరుపతి శివారులోని అవిలాల చెరువును చదును చేసే కార్యక్రమం ప్రారంభించారు. దీనిని తిరుపతికి చెందిన సినిమా నిర్మాత ఎన్వీ. ప్రసాద్, ఆయన బావ, మాజీ ఎమ్మెల్యే చదవలవాడ కృష్ణమూర్తి భుజానికి ఎత్తుకున్నారు. వేదిక, వందలాది ఎకరాల్లో బారికేడ్లు ఏర్పాటు, వసతుల కల్పన కార్యక్రమాలను ఏర్పాటు చేయించారు. ఇందుకోసం జనరేటర్లు, సౌండ్, లైటింగ్ సిస్టం చెన్నై నుంచి తెప్పించారు. పార్టీ ప్రకటించనున్నారనే నేపథ్యంలో చిరంజీవి అభిమాన సంఘాలతో పాటు దేశ, విదేశాల్లోని ఎన్ఆర్ఐ యువకులు భారీగా తరలివచ్చి సమన్వయం చేసుకున్నారు.
పార్టీ ప్రకటించే సమయం ఆసన్నమైంది. అంతకు ముందు రోజే మెగాస్టార్ చిరంజీవి తిరుమలలో మకాం వేశారు. సభా ప్రాంగణం కిక్కిరిసింది. జాతీయ మీడియా మొత్తం మోహరించింది. ఆకాశంలో హెలికాప్టర్ విహరిస్తోంది. అందులో కెమెరా దర్శకుడు చోటా కే. నాయుడు మొత్తం చిత్రీకరిస్తున్నారు.
అదే సమయంలో..
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. అనే పాట బ్యాక్ గ్రౌండ్లో వస్తుండగా... వేదిక వెనక వైపు అడ్డుగోడగా అమర్చిన రెండు ఇనుప రేకులు పక్కకు తప్పించారు. ఓ ఖరీదైన కారు లోపలికి సమర్పించింది. అందులో నుంచి గుణదల చిరంజీవి దిగడం, వేదిక పైకి రావడంతో కేరింతలు మిన్నంటాయి. ఆ తర్వాత ఉపన్యాసం స్క్రిప్ట్ను చిరంజీవి చదువుతూ పార్టీ విధివిధానాలను ప్రకటించారు.
మన పార్టీ పేరు ఏమిటో తెలుసా..
మీకు తెలుసా.. అని ఓ చిరునవ్వు చిందిస్తూ.. చెప్పుకోండి చూద్దాం.. అని మాటలతో హుషారెక్కించిన చిరంజీవి తన అభిమాన శ్రేణులను కేరింతలు కొట్టించారు. భారీగా టపాసులు పేలుతుండగా... ఓ ఆశ్రమం నుంచి తీసుకువచ్చిన ఫిజికల్లీ ఛాలెంజెడ్ ( వికలాంగులు) పిల్లల నుంచి ఓ బాలుడిని ఎత్తుకొని వేదిక పైకి తీసుకువెళ్లారు. ఆ బాలుడు కర్రకు కట్టిన తాడు లాగడంతో జెండా రెపరెపలాడింది.
"అదే ప్రజారాజ్యం పతాకం" ఈ పేరు ప్రకటించడానికి ఇంత కథ జరిగింది. ఈ విషయం చదవడానికి ఎంతఇప్పటి వరకు చదివారో.. ఆ రోజుల్లో చిరంజీవి ప్రకటించే పార్టీ పేరు తెలుసుకోవడానికి దాదాపు 15 రోజులు ఉత్కంఠ రాజ్యమేలింది. వేదికపై కూడా సుమారు నాలుగు గంటలసేపు మరింత ఉత్కంఠ కలిగించారు. అలా ఊపిరి పోసుకున్న ప్రజారాజ్యం పార్టీ ..
2009: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 294 సీట్లకు పోటీ చేసి 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. అందులో తిరుపతి నుంచి పోటీ చేసిన కొణిదెల చిరంజీవి, మరో చోట ఓటమి చెందార. కాగా అనంతపురం జిల్లా ఆళ్లగడ్డ నుంచి భూమా శోభ నాగిరెడ్డి కూడా ఒకరు. ఆ తరువాత ఈ సీటుకు రాజీనామా చేశారు. ఆ తరువాత
2019లో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన విషయం తెలిసిందే.
అన్న బాటలోనే...
మెగాస్టార్ చిరంజీవి మొదట్లో ప్రారంభించిన జనసేన పార్టీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యువరాజ్యం రాష్ట్ర అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. రాష్ట్ర విభజన తర్వాత..
2014: జనసేన అనే పార్టీని స్థాపించారు. జనసేన అంటే ప్రజా సైన్యం అని అర్థం అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆ ఎన్నికల్లో పోటీ చేయని జనసేన బీజేపీ, టీడీపీకిఃకి మద్దతు ఇచ్చారు.
2019 ఎన్నికలలో రాష్ట్రంలో పోటీ చేసింది. ఇందులో భీమవరం, విశాఖ జిల్లాలో కూడా పవన్ కళ్యాణ్ ఓటమి చెందారు. ఒకే ఒక చోట జనసేన ఎమ్మెల్యే గెలిచిన ఆ తర్వాత ఆయన వైసీపీతో కాలం సాగదీశారు.
2024: ఈ ఎన్నికల్లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. వైసీపీని ఓడించే లక్ష్యంగా టీడీపీ కూటమిలో బీజేపీతో జనసేన భాగస్వామ్యమైంది. రాష్ట్రంలో 21 అసెంబ్లీ స్థానాల పోటీ చేసి, అన్ని స్థానాల్లో విజయం సాధించింది. ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి విజయం సాధించడం ద్వారా డిప్యూటీ సీఎం అయ్యారు. ఇదీ స్థూలంగా జనసేన ప్రస్థానం.
సినిమా భాషలో చెప్పాలంటే... జనసేన ఆవిర్భావంలో ప్రజామద్దతు లేకపోవడం అంటే సినిమా కథలో దమ్ము లేకపోతే ఇలా ఉంటుందో ఆ పార్టీ పరిస్థితి ఎలా కనిపించింది. ఛేజింగ్ చేసి వెంటాడినట్లు, వైసీపీతో పవన్ కళ్యాణ్ పదేళ్లపాటు ఆ తరహా పోరాటం సాగించారు. ఆయనపై వైసీపీ నేతలు అనేక రకాల మాటల దాడులు చేశారు. వ్యక్తిత్వ హననం చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ కుటుంబంలోని మహిళలను కూడా రచ్చకు ఈడ్చారు. సినిమా తరహాలో వీటన్నిటిని ఒంటిచేత్తో ఎదుర్కొన్నారు గత సార్వత్రిక ఎన్నికల్లో తనను నీచంగా మాట్లాడిన వైసీపీ నాయకులు, వారి మద్దతుదారులను ప్రజాక్షేత్రంలో మట్టి కల్పించడం ద్వారా హీరోగా నిలిచారని పరిశీలకులు ఎన్నో విశ్లేషణలు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది.
ఇదేం ట్విస్ట్...
డిప్యూటీ సీఎం హోదాలో ప్రాయశ్చిత్త దీక్ష విరమణకు తిరుమలకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఆనాటి ప్రజారాజ్యం తరహాలో సస్పెన్స్, థ్రిల్లింగ్ కథాంశాన్ని సాగిస్తున్నారు. అలిపిరి పాదాల మండపం నుంచి పూజల అనంతరం బయలుదేరే సమయంలో ఓ కవర్ ఓ మెట్టు పై ఉంచి మోకాళ్ళపై ప్రణమిల్లారు. ఆ కవరు ఏమిటి? అందులో ఏముంది? అనే సస్పెన్స్ క్రియేట్ చేశారు. తిరుమల శ్రీవారిని బుధవారం ఉదయం దర్శించుకున్న తర్వాత పవన్ కల్యాణ్ ఆలయం వెలుపల వారాహి డిక్లరేషన్ పుస్తకాన్ని ప్రదర్శించారు. మినహా అందులో ఏముంది? అనే విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. తిరుపతిలో గురువారం జరిగే వారాహి సభలోడిక్లరేషన్ ప్రకటిస్తానంటూ రాజకీయంగా ఆయన అన్ని పార్టీల్లో ప్రధానంగా టీడీపీ కూటమిలో ఆసక్తిని రేకెత్తించారు.
ఇలా తిరుపతి సెంటిమెంటుకు ప్రాధాన్యత ఇచ్చిన పవన్ కళ్యాణ్ 26 ఏళ్ల తర్వాత తన అన్న కొణిదెల చిరంజీవి తరహాలోనే ఉత్కంఠ కథాంశాన్ని రాజకీయ తెరపై ఉంచారు. దాని పేరే వారాహి డిక్లరేషన్. దీనిపై ఏమి చెబుతారనే విషయంలో రాజకీయ వేదికలపై ఆసక్తి నెలకొంది.
Next Story