మానసిక వికలాంగులు ఎందుకు మరణించారు?
x

మానసిక వికలాంగులు ఎందుకు మరణించారు?

మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఇద్దరి మరణం వెనుక కారణం ఏంటి? ఇంకొందరు ఎందుకు అస్వస్థత గురయ్యారు. తిరుపతి నగరంలో ఆ పిల్లలకు ఏమి జరిగింది.


కలుషిత ఆహారం తిన్న ఇద్దరు మానసిక వికలాంగ పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఈ విషాద ఘటన తిరుపతి నగరంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే...

తిరుపతి నగరం పద్మావతిపురం సమీపంలో పాస్ ( పి ఏ ఎస్ ఎస్) అనే స్వచ్ఛంద సంస్థ మానసిక వికలాంగుల పునరావాస కేంద్రాన్ని నిర్వహిస్తోంది. ఇందులో చాలామంది మానసిక వైకల్యంతో బాధపడుతున్న పిల్లలను సంరక్షిస్తున్నారు. యధావిధిగాని మంగళవారం మధ్యాహ్నం కూడా ఆ పిల్లలకు మధ్యహ్నన భోజనం అందించారు. కొద్దిసేపటి తర్వాత ఏడుగురు పిల్లలు వాంతులు చేసుకుంటూ పడిపోయాడు. వెంటనే వారందరినీ తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఇంకొద్ది సేపటికి మరో ఐదుగురు పిల్లలు కూడా అదే విధంగా అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ పాస్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అంబులెన్స్‌లో రుయా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో శేషాచలం (16), గణపతి (30) మరణించారు. మరో పదిమంది ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

తమకు ఏమి జరిగిందో కూడా చెప్పలేని మానసిక వికలాంగ పిల్లల దయనీయ స్థితి రుయా ఆసుపత్రి వైద్య సిబ్బందిని కూడా కంటతడి పెట్టించింది. అస్వస్థతకు గురైన పిల్లలందరికీ అత్యవసర విభాగంలో చికిత్స చేస్తున్నారు. ఈ సమాచారం అందిన వెంటనే తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మానసిక వికలాంగ పిల్లలు చికిత్స పొందుతున్న రుయా ఆసుపత్రికి చేరుకున్నారు. పిల్లలకు మెరుగైన చికిత్స అందించే దిశగా ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత పిల్లలు అస్వస్థతకు గురికావడం వెనక కారణాలు తెలియలేదు. ఈ సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More
Next Story