
Police firing | మీ కోసం మేము.. మా నీడే మాకు రక్ష
తిరుపతికి సమీపంలోని కల్యాణి డ్యాం వద్ద పోలీస్ అధికారులకు ఫైరింగ్ పై శిక్షణ జరిగింది.
చురచురమంటున్న ఎండలు. ఎదురుగా టార్గెట్. చేతిలో తుపాకి. ఎదురుగా ఉన్నది శత్రువే అనుకోవాలి. గురి తప్పకూడదు. ట్రిగ్గర్ నొక్కితే బుల్లెట్ వృత్తాకారంలోని టార్గెట్ ఛిద్రం కావాలి. ఈ లక్ష్యంపై సాధన కోసం పోలీస్ ఫైరింగ్ ప్రాక్టీస్ జరిగింది. తిరుపతికి సమీపంలోని కల్యాణి డ్యాంకు సమీపంలోని ఫైరింగ్ రేంజ్ లో సోమవారం పోలీస్ అధికారులు ప్రాక్టీస్ చేశారు.

తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్థనరాజు ఈ ఫైరింగ్ క్యాంప్ తనిఖీ చేశారు. స్వయంగా వివిధ రకాల తుపాకులతో పొజిషన్ లో ఫైరింగ్ ప్రాక్టీస్ చేసి సిబ్బందిలో ఉత్సాహం, మనోధైర్యాన్ని నింపారు. నేర పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవడం ప్రధానమైనదనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
"వీఐపీలే కాదు. ప్రజల రక్షణ కూడా ప్రధానం. సిబ్బంది శరీర దారుఢ్యంపై శ్రద్ధ తీసుకోవాలి" అని ఎస్పీ హర్షవర్థనరాజు సూచించారు. ఫైరింగ్ పై సిబ్బందికి ఆయన సూచనలు చేశారు. వివిధ రకాల ఆయుధాలతో ఫైరింగ్ చేయడంలో ప్రతిభ చూపిన సివిల్, ఏాఆర్ పోలీస్ అధికారులను ఆయన అభినందించారు.

ట్రైన్ ఐపిఎస్ బి. హేమంత్, అదనపు ఎస్పీలు ఐ. రామకృష్ణ (తిరుమల), నాగభూషణం క్రైమ్స్, శ్రీనివాసరావు సాయుధ దళం, డీఎస్పీలు, సిఐలు, ఏఆర్ (Armed Reservie Police - AR Police) పోలీసు అధికారులు, సిబ్బందికి ఫైరింగ్ ప్రక్రియ సూచనలు చేశారు. ప్రతి బుల్లెట్ లక్ష్యం (Taget) పై బుల్ పడే విధంగా సుక్షితులు కావాలని సూచించారు.
తిరుపతికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. దేశంలోనే కాకుండా, విదేశాల నుంచి కూడా యాత్రికులు వస్తుంటారనే విషయాన్ని ఎస్పీ హర్షవర్ధనరాజు గుర్తు చేశారు. వారికి రక్షణ కల్పించడంలో ఎలాంటి లోటుపాట్లకు జాగ్రత్తలు పాటించడం ద్వారా పోలీస్ శాఖ ప్రతిష్టను ఇనుమడింప చేయాలన్నారు.
Next Story