
తిరుమల శ్రీవారి ఆలయం (ఫైల్)
తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
సామాన్య యాత్రికులకే ప్రాధాన్యం. జనవరి 25న రథసప్తమి
తిరుమలలో విశేష పర్వదినాలను పరిగణలోకి తీసుకున్న టీటీడీ వీఐపీ ( VIP break darshan ) బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆ రోజుల్లో మాత్రం సామాన్య యాత్రికులకు దర్శనాలకు ప్రాధాన్యం ఇస్తామని టీటీడీ ప్రకటించింది. ఈ సంవత్సరం డిసెంబర్ నెల నుంచి జనవరి వరకు పర్వదినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు ఉండవు.
డిసెంబర్ 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. అందువల్ల వీఐపీ దర్శనాలకు ఆస్కారం ఉండదు.
౩౦వ తేదీ వైకుంఠ ఏకాదశి కావడం వల్ల 29వ సిఫారసు లేఖలు తీసుకోరు. అంటే, డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉండడం వల్ల వీఐపీ దర్శనాలు రద్దు చేశారు.
జనవరి 25వ తేదీ రథసప్తమి (సూర్యజయంతి) రోజు తిరుమల మరింత ప్రత్యేకంగా మారుతుంది. దీనిని ఒకరోజు బ్రహ్మెత్సవంగా కూడా పరిగణిస్తారు. బ్రహ్మోత్సవాల్లో మాదిరే ఉదయం నుంచి రాత్రి వరకు ఉభయదేవేరులతో కలిసి శ్రీమలయప్పస్వామివారు అన్ని వాహనాలపై మాడవీధుల్లో విహరిస్తూ, గ్యాలరీల్లోని యాత్రికులకు దర్శనం ఇవ్వనున్నారు. దీంతో ఆ రోజు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. ఆ రోజుల్లో ముందు రోజు వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని టీటీడీ స్బష్టం చేసింది.
Next Story

