కేంద్ర ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలుంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందనే విషయం మరోసారి స్పష్టమైంది. రాష్ట్రంలో నాలుగు కేంద్రీయ విద్యాలయాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. పేద విద్యార్థులకు తక్కువ ఫీజుతో గుణాత్మక విద్య బోధనకు అనుమతి సాధించడంలో సీఎం నారా చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో ఫలితం సాధించారు. రాష్ట్రానికి మంజూరైన నాలుగు కేంద్రీయ విద్యాలయాల్లో రెండు చిత్తూరు జిల్లాలోనే ఏర్పాటు కానున్నాయి. అందులో ఒకటి చిత్తూరుకు, మరొకటి కుప్పం ఇంకొకటి అమరావతి, శ్రీకాకుళం జిల్లా పలాసలో ఒక కేంద్రీయ విద్యాలయంలో 2006-27 విద్యా సంవత్సరం నుంచి బోధన ప్రారంభం కానుంది.
9 కేంద్రీయ విద్యాలయాలకు అనుమతి
రాష్ట్రంలో టీడీపీ కూటమి ఏర్పడిన ఏడాదిన్నర కాలంలో తొమ్మిది కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు అనుమతి సాధించింది. ఎన్టీఏ కూటమితో మిత్రత్వం వల్ల సాధ్యమైందనే విషయం మరోసారి తేటతెల్లమైంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా మంజూరు చేసిన నాలుగు కేంద్రీయ విద్యాలయాలతో ఆ సంఖ్య 48కి చేరనుంది.
కేంద్రం అనుమతి మంజూరు చేసిన కేంద్రీయ విద్యాలయాల్లో 2006-27 విద్యా సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో పనిచేయనున్నాయి. ఈ ఏడాది చివరిలో కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానించనునున్నాయి. ఈ సంస్థల ద్వారా రానున్న విద్యా సంవత్సరం నుంచి 4,000 మంది పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందుబాటులోకి రానుంది. అంటే ఒకో విద్యాలయంలో వెయ్యి మంది విద్యార్థులకు అడ్మిషన్లు లభిస్తాయి. ఆరో తరగతిలో చేరే విద్యార్థులు 12వ తరగతి పూర్తయ్యే వరకు ఇక్కడే చదువు సాగుతుంది.
శ్రీకాకుళం జిల్లా పలాసలో కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయడంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్పదింంచారు.
"ఎన్నో సంవత్సరాల కలసాకారమైంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి లభించిన గౌరవం" అని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. విద్యను అగ్రగామిగా నిలపడానికి ఇది ఘనమైన అడుగుగా ఆయన అభివర్ణించారు.
రాష్ట్రానికి నాలుగు.. చిత్తూరుకు రెండు
రాష్ట్రానికి మంజూరైన నాలుగు కేంద్రీయ విద్యాలయాల్లో సీఎం నారా చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్గం బైరుగానిపల్లెలో ఒకటి ఏర్పాటు అవుతుంది. చిత్తూరుకు సమీపంలోని మంగసముద్రం వద్ద మరో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు మార్గం ఏర్పడింది. దీనివల్ల రాష్ట్రంలో నాలుగు వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవడం ద్వారా ప్లస్ టు వరకు ఉన్నతమైన విద్య చదవడానికి అవకాశం ఏర్పడింది.
కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
"గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు గుణాత్మక విద్యను చేరువ చేయడంలో అందించిన సహకారానికి ధన్యవాదాలు" అని ప్రధాని నరేంద్ర మోదీ, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు కృతజ్ణతలు తెలిపారు. మంత్రి నారా లోకేష్ స్పందనలో..
"రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి ఇది గొప్ప శక్తి ఇచ్చింది" అని ప్రస్తావించారు.
చిత్తూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో గ్రామీణ, సుదూర ప్రాంతాల విద్యార్థులకు ఒకే చోట అవకాశ కల్పించడం ద్వారా విద్యావకాశాలు మెరుగుకావడానికి పేద విద్యార్థులకు అందించిన సహకారంగా రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.
48కి పెరిగిన సంస్థలు
రాష్ట్రానికి మంజూరు చేసిన నాలుగు కేంద్రీయ విద్యాలయాలతో ఆ సంఖ్య 48కి పెరగనుంది. ఆ విద్యాలయాల్లో ఆరవ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకోవడానికి విద్యార్థులకు అవకాశ లభిస్తుంది. ప్రతి కేంద్రీయ విద్యాలయంలో 1,000 మంది విద్యార్థులు చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇదిలావుంటే..
2019 నాటికి 33 మాత్రమే రాష్ట్రంలో కేంద్రీయ విద్యాలయాలు అందుబాటులో ఉన్నాయి. గడచిన ఐదేళ్లలో రెండు మాత్రమే ఏర్పాటు చేయడానికి అనుమతి సాధించగలిగారు.
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదిన్నరలో తొమ్మిది కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు అనుమతి సాధించారు. దీనికి ఎన్టీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ప్రధానంగా సీఎం నారా చంద్రబాబు తీసుకున్న చొరవ, కేంద్రం సహకారంతోనే ఇది సాధ్యమైందనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది.
శ్రీకాకుళం జిల్లా పలాసలోె