
ప్రజాప్రతినిధులే టార్గెట్.. నకిలీ లేఖల తయారీలో దిట్టలు..
తిరుమల శ్రీవారి దర్శనం పేరుతో మోసాలు.
శ్రీవారి దర్శనం పేరిట మోసం చేస్తే, Tirumala: One Town PS 94407 96769, Tirumala: Two Town PS Tirumala: 94407 96772 నంబర్లలో సంప్రదించాలని పోలీసులు సూచించారు.
తిరుమల శ్రీవారి యాత్రికులను బురడీ కొట్టించడానికి ఎమ్మెల్యేలు, ఎంఎల్సీ నకిలీ లేఖలు తయారీ చేయడం ప్రారంభించారు. శ్రీవారి దర్శనం చేయిస్తామంటూ మోసం చేస్తున్న ఇద్దరిని తిరుమల పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనం కోసం యాత్రికులు పరితపిస్తారు. వారి అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు ప్రజాప్రతినిధులు MLA/MLC రికమెండేషన్ లెటర్లు తయారు చేయడం ద్వారా యాత్రికుల నుంచి డబ్బు దోచుకుంటున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిఘా ఉంచిన పోలీసులు తిరుపతి జిల్లా (నెల్లూరు జిల్లా) నాయుడుపేటకు చెందిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు తిరుమల పోలీసులు వెల్లడించారు.
ఏమి చేశారంటే..
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులను బురిడీ కొట్టించాలని నాయుడుపేటకు చెందిన బల్లి ప్రవీణ్ కుమార్, దేవత చెంచుబాలాజీ గత కొంతకాలంగా MLA/MLC పేర్లతో నకిలీ లెటర్ ప్యాడ్లు తయారు చేస్తున్నట్లు పోెలీసుల విచారణలో తేలింది. శ్రీవారి బ్రేక్ దర్శనం ఏర్పాటు చేస్తామంటూ భక్తుల నుంచి రూ.10 వేలు నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నట్టు తేలింది.
తిరుపతి జిల్లా ప్రతినిధులే...
శ్రీవారికి దర్శనానికి నకిలీ లేఖలు తయారు చేయడానికి తిరుపతి జిల్లాలోని ప్రజాప్రతినిధులనే టార్గెట్ గా ఎంచుకున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన బల్లి ప్రవీణ్ కుమార్, దేవత చెంచుబాలాజీ కొంతకాలంగా సూళ్లూరుపేట MLA ఎన్. విజయశ్రీ, గూడూరు MLA పాశంసునీల్ కుమార్, MLC బల్లి కళ్యాణ్ చక్రవర్తి పేర్లను దుర్వినియోగం చేయడం ప్రారంభించారు. నకిలీ లెటర్లు తయారు చేసి హైదరాబాదుకు చెందిన భక్తులను మోసం చేస్తున్న సమయంలో పోలీసులు అరెస్టు చేశారు.
అరెస్టు చేసిన ఆ ఇద్దరి నుంచి..
నాయుడుపేటకు చెందిన బల్లి ప్రవీణ్ కుమార్, దేవత చెంచుబాలాజీ నుంచి నకిలీ పత్రాల్లో ఉపయోగించిన డేటా, బ్యాంక్ పాస్ బుక్స్, రూ.1,000 నగదు వంటి ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే గూడూరు I టౌన్ PS, తిరుమల II టౌన్ PSలో కేసులు నమోదు కాగా, నిందితులు ఇంకొన్ని మోసాలకు కూడా పాల్పడ్డట్టు విచారణలో తేలింది. ఇద్దరి నకిలీ చర్యలకు సహకరించిన పరికరాలు ల్యాప్టాప్, ప్రింటర్, మొబైల్ ఫోన్లు పోలీసుల ఇదివరకే స్వాధీనం చేసుకున్నారు.
దళారులను నమ్మకండి..
శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులు దళారుల మాటలు నమ్మవద్దుని తిరుమల పోలీసులు కోరారు. శ్రీవారి దర్శనం కోసం ఎటువంటి మధ్యవర్తులను నమ్మవద్దని, దర్శనం, సేవా టిక్కెట్లు కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లేదా కౌంటర్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయని స్పష్టంగా హెచ్చరించారు. ఎవరైనా దర్శనం పేరుతో డబ్బులు అడిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తప్పుడు రికమెండేషన్ లెటర్లపై మోసాలు ఆపేందుకు ఎస్పీ గారి ఆదేశాల మేరకు కఠిన చర్యలు, నిఘా కొనసాగుతాయని తెలిపారు.
Next Story

