టీటీడీ: జోరుమీదున్న ఉద్యోగుల ఎన్నికల పోరు
x

టీటీడీ: జోరుమీదున్న ఉద్యోగుల ఎన్నికల పోరు

టీటీడీలో ఎన్నికల వేడి కాకమీదుంది. 28న నిర్వహించే పోలింగ్ కోపం ఉద్యోగులు ప్రచారంలో తలమునకలుగా ఉన్నారు.


ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల శ్రీవారి సన్నిధిలో పనిచేసే టీటీడీ (Tiruma Tirupati Devasthanam)లో ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాదు. ఉద్యోగుల మధ్య కూడా పోటీ ఏర్పడింది. కులాల సమీకరణ నేపథ్యంలో సాగుతున్న పోరులో ఆధిపత్యం నిలుపుకోవాలని బీసీలు, కాపుల మధ్య సమరం సాగుతోంది. ఇందులో ఓ వామపక్ష కార్మిక సంఘం, తెరవెనుక అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతుతో జరిగే టీటీడీ ఉద్యోగుల బ్యాంకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దీంతో..

సీఐటీయూ సారధ్యంలోని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ మద్దతుతో కొందరు, వ్యక్తిగతంగా, సామాజికంగా తమ స్థానాలను పదిలం చేసుకోవాలని ఇంకొందరు నామినేషన్లు దాఖలు చేసి, ప్రతి ఉద్యోగి ఇంటికి వెళ్లి, ఓట్లు అర్ధిస్తూ, ప్రచారంలో ముమ్మరంగా ఉన్నారు. వారిలో టీడీపీ, జనసేన పార్టీల మద్దతుదారులు కూడా ఉండడం వల్ల టీటీడీ ఉద్యోగుల బ్యాంకు ఎన్నికల ప్రతిష్టాత్మకంగా మారాయి.
ఉద్యోగుల బ్యాంకు ఏమిటి?
టీటీడీ ఎంప్లాయీస్ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ , తిరుపతి (TTD Employees co-oprretive Credit Socity ltd, Tirupati ) (TTD Employees Bank) ఎన్నికలు ఈ నెల 28వ తేదీ నిర్వహించనున్నారు. సహకార శాఖ అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ఆవరణలోనే ఉద్యోగులకు సంబంధించిన బ్యాంకు ఉంది. రూ.160 కోట్ల టర్నోవర్ ఉన్న ఈ బ్యాంకులో6,362 మంది టీటీడీ ఉద్యోగులు సభ్యులుగా ఉన్నారు. వారిలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే స్విమ్స్ ఆస్పత్రి నుంచి కూడా 400 మంది ఉద్యోుగులు కూడా సభ్యులే. వారందరూ కలసి ఏడుగురు డైరెక్టర్లను ఎన్నకోవాల్సి ఉంటుంది. వారిలో ఐదుగురు ఎటు మొగ్గితే ఆ పక్క వ్యక్తి చైర్మన్ పదవి దక్కుతుంది. "సభ్యులు కాని వారు తక్కువ మంది ఉన్నారు. దానితో నిమిత్తం లేకుండా వారికి కూడా రుణాలు మంజూరు చేయిస్తున్నాం" అని ఉద్యోగ సంఘం నేత 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు.
"ఈ నెల 21వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది" అని ఎన్నికల నిర్వహణాధికారి ఉమాపతి తెలిపారు. ఈ ఎన్నికల్లో 40 మందికి పైగా అభ్యర్థులు డైరెక్టర్ పదవుల కోసం పోటీ పడుతున్నారు. "ఈ నెల 28వ తేదీ తిరుపతిలోని గోవిందరాజస్వామి హైస్కూల్, ఎస్వీ హైస్కూల్ కేంద్రాలుగా పోలింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాం" అని రిటర్నింగ్ అధికారి ఉమాపతి వివరించారు. ఇదిలా ఉండగా,
తగ్గిన ఉద్యోగులు
ఈ సంఖ్యను ఒకసారి పరిశీలిస్తే, మాత్రం దాదాపు దశాబ్దం కిందట ఉన్న 16 వేల మంది ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. రిటైర్ అయిన ఉద్యోగుల స్థానంలో పోస్టులు భర్తీ చేయని టీటీడీ యంత్రాంగం ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందిని రంగంలోకి దించింది. టీటీడీపై ఆర్థిక భారం తగ్గించే దిశగానే ఈ చర్యకు ఉపక్రమించారనేది స్పష్టం అవుతుంది. ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఇదే విషయాన్నిచెబుతున్నారు. ఈ విషయం పక్కకు ఉంచితే...
మేనిఫెస్టో కూడా విడుదల
టీటీడీ ఉద్యోగుల బ్యాంకు డైరెక్టర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు మేనిఫెస్టో కూడా ప్రకటించారు. గత పాలక మండలిలో ఎంతమందికి మేలు చేశామననేది వివరిస్తూనే, ఉద్యోగులకు సర్వీసులో ఎదురైన ఇబ్బందుల నుంచి కాపాడేందుకు ఏమి చేశామనేది కూడా ఏకరువు పెడుతున్నారు. ఈ ఎన్నికల్లో కార్మిక సంఘం, వ్యక్తిగత ప్రాబల్యంతో పాటు సామాజిక సమీకరణ ప్రధాన భూమిక పోషిస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు పదుల సంఖ్యలో అంశాలను అజెండాగా మేనిఫెస్టోతో ప్రచారం ముమ్మరం చేశారు. దీంతో టీటీడీ పరిపాలన భవనంతో పాటు, ఈ ఆవరణలోని నివాసాలు, వినాయక్ నగర్ క్వార్టర్స్ లో కూడా ప్రచారం ముమ్మరం చేశారు. దీంతో ఎన్నికల హడావిడి ముమ్మరంగా సాగుతోంది.
ఎంపిక ఉలా..
టిటిడి ఉద్యోగుల బ్యాంకు ఎన్నికల్లో కుల సమీకరణలే కీలక పాత్ర పోషిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. 6362 సభ్యులుగా ఉన్న ఈ బ్యాంకులు 7 డైరెక్టర్ల పదవుల కోసం 35 మంది పోటీలో ఉన్నారు. ఇందులో నాలుగు ప్యానళ్ళు ఏర్పడ్డాయి.
1. సిఐటియు అనుబంధం గా ఉన్న స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ పక్షాన ముగ్గురు డైరెక్టర్లు పోటీ చేస్తున్నారు.
2. . బీసీ సామాజిక వర్గం మరో ప్యానల్ గా ఏర్పడింది
3. కాపు సామాజిక వర్గానికి చెందిన చీరల కిరణ్ సారధ్యంలో ఐదుగురు డైరెక్టర్లు పోటీ చేస్తున్నారు
4. త్రిబుల్ ఆర్ గుర్తింపు ఉన్న ఈ ప్యానల్ లో నలుగురు పోటీపడుతున్నారు.
సభ్యుల ఓట్లతో ఎంపిక అయ్యే ఏడుగురు అభ్యర్థుల్లో ఒకరిని అధ్యక్షుడిగా, మరొకరి ఉపాధ్యక్షుడిగా, ఇంకొకరిని కోశాధికారిగా ఎన్నుకుంటారు. ఈ ఎన్నిక జరగడానికి ఈనెల 28వ తేదీ నిర్వహించే పోలింగ్లో విజేతలయ్యే డైరెక్టర్ల పై ఆధారపడి ఉంటుంది. ఇందులో కూడా నాలుగు ప్యానళ్ళ నుంచి సిండికేట్ వ్యవహారం లేకపోలేదని అభిప్రాయాలు ఉన్నాయి.
దీంతో ఎన్నికయ్యే డైరెక్టర్లకు డిమాండ్ కూడా ఉంటుంది. అది కూడా ఉద్యోగుల సంక్షేమం, బ్యాంకు అభివృద్ధి ప్రామాణికంగా తీసుకొని మద్దతు ఇవ్వడానికి మొగ్గు చూపుతుంటారు. మినహా ఇతరత్రా వ్యవహారాలకు ఆస్కారం ఉండబోతున్నది బ్యాంకు మాజీ డైరెక్టర్ గా పనిచేసిన ఓ నేత చెప్పిన మాట.
ఏది ఏమైనా టిటిడి ఉద్యోగుల బ్యాంకు డైరెక్టర్ల ఎంపిక కోసం జరగనున్న ఎన్నికలు టిటిడిలో కోలాహలంగా మారాయి. ఎవరికి వారు ఉద్యోగుల అభిమానం చూడడానికి అవిశ్రాంతంగా ప్రచారంలో మునిగి తేలుతున్నారు. దీంతో టిటిడిలో సందడి వాతావరణం ఏర్పడింది. ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఈ ఎన్నికల్లో ఎలాగా గెలవాలని పట్టుదలే ఉద్యోగ సంఘ నాయకుల్లో కనిపిస్తోంది. దీనికి కారణం..
ఆ ఎన్నిక జరగకపోవడమే
సాధారణంగా టీటీడీ ఉద్యోగుల గుర్తింపు సంఘానికి ఎన్నికల నిర్వహించేవారు. ఇందులో అధ్యక్షుడు నుంచి కార్యవర్గం వరకు 9 మంది నాయకులు ఉండేవారు. టీటీడీలో చిన్న, పెద్ద ఉద్యోగి, అధికారి అనే తారతమ్యం లేకుండా ఆ కార్యవర్గం సమస్యల పైన స్పందించేది. నిరసనలు కూడా దిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సమస్యల పైన అయితే రాజీలేని పోరాటం సాగించాయి. ఇది బెడదగా భావించిన టిటిడి యాజమాన్యం దశాబ్ద కాలం నుంచి టీటీడీ ఉద్యోగుల సంఘానికి ఎన్నికల నిర్వహించడం ఆపివేసింది. దీంతో రు. 160 కోట్ల టర్నోవర్ ఉన్న టీటీడీ ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ బ్యాంకు ఎన్నికలు సందడిగా మారడానికి అవకాశం కల్పించాయి.
Read More
Next Story