గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాల పేర్లు టీడీపీ కూటమి మార్చింది. అనుకూలమైన వారి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన పదవుల సంప్రదాయం మాత్రం కొనసాగుతోంది. ఆ కోవలో తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (Tirupati Urban Development Authority Tuda ) చైర్మన్ డాలర్ దివాకరరెడ్డి శుక్రవారం టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించారు.
తుడా చైర్మన్ దివాకరరెడ్డికి శ్రీవారి చిత్రపటం బహూకరిస్తున్న టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం ( Tirumala Tirupati Devasthanams TTD ) పాలక మండలి సభ్యుల సంఖ్య 30కి చేరింది. వారిలో చైర్మన్ బీఆర్. నాయుడు తోసహా 24 మంది సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఐదుగురు అధికారులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (Tirupati Urban Development Authority Tuda ) చైర్మన్ డాలర్ దివాకరరెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ప్రమాణస్వీకారంతో సభ్యుల సంఖ్య 30కి చేరింది.
శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద దివాకరరెడ్డితో టిటిడి అదనపు ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. దివాకర్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం తుడా చైర్మన, టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యుడు దివాకరరెడ్డి శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో ఆయన శ్రీవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్ర్తంతో ఆశీర్చవనాలు అందించారు. దివాకరరెడ్డికి టీటీడీ చైర్మన్ బిఆర్. నాయుడు ఆలయంలోనే రంగనాయకుల మండపం వద్ద అభినందనలు తెలిపారు. శాలువకప్పి, శుభాకాంక్షలు చెప్పారు.
30కి చేరిన సభ్యులు
టీటీడీ పాలక మండలిలో చైర్మన్ బీఆర్. నాయుడుతో పాటు 24 మంది సభ్యులు ఉన్నారు. వారిలో ఏపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండగా, తెలంగాణ నుంచి ఐదుగురు సభ్యులను టీడీపీ కూటమి నియమించింది. కర్ణాటక నుంచి ముగ్గురు, తమిళనాడు నుంచి ఇద్దరు, గుజరాత్, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరు సభ్యులుగా ఉన్నారు.
తుడా చైర్మన్ సభ్యుడు?
తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ కు క్యాబినెట్ ర్యాంక్ హోదా ఉంది. ఈ పదవిలో ఉన్న వారు టీటీడీలో ఎక్స్ అఫీషియో సభ్యుడు అయ్యే వెసులుబాటు ఉంది.
2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్. రాజశేఖరరెడ్డి సీఎం అయ్యారు. ఆ సమయంలో తుడా చైర్మన్ గా తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నియమితులయ్యారు. ఆయన కోెసం చట్టసవరణ ద్వారా టీటీడీ పాలక మండలిలో ఎక్స్ అఫీషియో సభ్యుడిని చేశారు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఏ ప్రభుత్వం వచ్చిన తుడా చైర్మన్ హోదాలోని వ్యక్తి టీటీడీ బోర్డులో సభ్యుడయ్యారు.
2007లో భూమన కరుణాకరెడ్డి టీటీడీ చైర్మన్ అయ్యారు. అప్పుడు తుడా చైర్మన్ గా నియమితులైన చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఆ అవకాశం దక్కింది.
ఆనాటి టీడీపీ ప్రభుత్వంలో లేదే..
2014 లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా ఆ పార్టీ గెలిచిన ఎం. వెంకటరమణ చైర్మన్ అయ్యారు. ఆయనకు ఎక్స్ అఫీషియో పదవి దక్కింది. కొంతకాలానికి ఆయన అనారోగ్యతో మరణించడంతో టీడీపీ కార్యదర్శి గొల్ల నరసింహయాదవ్ చైర్మన్ అయ్యారు. ఆ సమయంలో టీటీడీ బోర్డులో సభ్యత్వం ఆయనకు దక్కలేదు. ఇది అనవసరం అని సీఎం చంద్రబాబు అనుకున్నారేమో, వైఎస్ఆర్ కాలంలో చేసిన చట్టసవరణను రద్దు చేసి, తుడా చైర్మన్ కు మాత్రమే పరిమితం చేశారు.
వైసీపీ ప్రభుత్వంలో మళ్లీ..
2019 లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం తరహాలోనే జీఓ జారీ చేయడంతో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి, తుడా చైర్మన్, అలాగే టీటీడీలో ఎక్స్ అఫీషియో సభ్యుడయ్యారు. ఆ తరువాత భాస్కరరరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి కూడా తుడా చైర్మన్ పదవితో ద్వారా టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యుడు గా పనిచేశారు.
సంప్రదాయం కొనసాగింపు
తుడా చైర్మన్ కు టీటీడీ పాలక మండలిలో అవకాశం కల్పించే సంప్రదాయాన్ని టీడీపీ కూటమి కూడా కొనసాగించింది.
2024 ఎన్నికల్లో డాలర్ దివాకరరెడ్డి చంద్రగిరి నుంచి టీడీపీ నుంచి టికెట్ రేసులో నిలిచారు. అయితే, ఇక్కడి నుంచి మళ్లీ టికెట్ దక్కించుకున్న పులివర్తి నాని విజయం సాధించారు. ఇందులో డాలర్ దివాకరరెడ్డి కీలకంగా వ్యవహరించారనేది ఆ పార్టీ వర్గలు చెప్పే మాట. దీంతో డాలర్ దివాకరరెడ్డికి తుడా చైర్మన్ పదవి దక్కడం, రెండు రోజుల కిందట ఆయన అట్టహాసంగా ప్రమాణస్వీకారం కూడా చేశారు.