
తిరుమలలో సూర్యప్రభ వాహనంపై ఊరేగుతున్న మలయప్పస్వామి (ఫైల్)
తిరుమలలో 25న 'అర్ధ బ్రహ్మోత్సవం'
సూర్యజయంతి రోజు ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ.
టీటీడీ ఆలయాల్లో ఈ నెల 25 తేదీ ఒక రోజు బ్రహ్మెత్సవం నిర్వహించనున్నారు. ఈ సంవత్సరం రథసప్తమి (సూర్యజయంతి)
ఆదివారం రావడం ప్రత్యేకత. రథసప్తమికి ముందు తిరుమల తోపాటు, తిరుచానూరు, టీటీడీ అనుబంధ ఆలయాల్లోలో ఈనెల 20వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆ రోజు ఆర్జిత సేవలను కూడా రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
ఇదీ ప్రత్యేకత
తిరుమలలో సూర్యజయంతి నాడు ఉభయ దేవేరులతో మలయప్ప స్వామివారు, తిరుచానూరులో పద్మావతీ అమ్మవారు తోపాటు మిగతా ఆలయాల్లో కూడా స్వామివార్లు ఓకే రోజు అన్ని వాహనాలపై ఊరేగుతూ దర్శనం ఇస్తారు. బ్రహ్మోత్సవాల సమయంలో తొమ్మిది రోజులు ఉదయం, రాత్రి మలయప్పస్వామి వారిని ఒకో వాహనంపై ఊరేగిస్తారు. సూర్యజయంతి నాడు స్వామివారిని రెండు గంటల తేడాతో ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని వాహనాలపై ఒకే రోజు ఊరేగింపు నిర్వహించడం వల్ల దీనికి అర్ధ బ్రహ్మెత్సవం అని కూడా పరిగణిస్తారు.
ఈ ఏడాది మరో ప్రత్యేకత
ఈ ఏడాది రథసప్తమి ఆదివారం రావడం ప్రత్యేకత సంతచరించుకుంది. పురాణాల ప్రకారం సూర్యుడికి ఆదివారం ఇష్టమైన రోజు కావడం వల్ల ఈసారి రథసప్తమికి మరింత విశేషమైనదని ఆగమశాస్త్ర పండితులు చెప్పారు.
20వ తేదీ:తిరుచానూరులో..
విశేష పర్వదినాలకు ముందు ఆలయాలను శుద్ధి చేయడం అనేది ఆచారం. అందులో భాగంగా రథసప్తమిని పురస్కరించుకుని ఈ నెల 20వ తేదీ తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఆ రోజు ఆర్జీత సేవలు కూడా రద్దు చేశామని తెలిపారు.
25న రథసప్తమి
తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారు జనవరి 25 తేదీ రథసప్తమి పర్వదినం సందర్భంగా ఏడు ప్రధాన వాహనాలపై అమ్మవారు ఊరేగుగూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
ఒకే రోజే వాహనసేవలు
ఆదివారం ఉదయం 7 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం
ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు హంస వాహనం,
ఉదయం 10 నుంచి 11 గంటల వరకు అశ్వ వాహనం
ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు గరుడవాహనంపై ఊరేగుతూ అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు చిన్నశేషవాహనం
సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు చంద్రప్రభ వాహనం
రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు గజ వాహనంపై దర్శనమిస్తారు.
తిరుమంజనం
తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయంలో సాయంత్రం 3.30 నుంచి 4.30 గంటల వరకు శ్రీకృష్ణస్వామివారి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
ఆర్జిత సేవల రద్దు
రథసప్తమి రోజు అమ్మవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, కుంకుమార్చన, బ్రేక్ దర్శనం, ఊంజల సేవ, వేదాశీర్వచనంలను టీటీడీ రద్దు చేసింది. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కనే ఉన్న శ్రీసూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6 నుంచి 7 గంటల వరకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
20న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి 20వ తేదీ ఆలయంలో ఉదయం 6.30 గంటల నుంచి తొమ్మదిగంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. అనంతరం సర్వదర్శనం భక్తులు శ్రీపద్మావతీ అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా కల్యాణోత్సవం సేవను రద్దు చేశారు.
Next Story

