టీటీడీకి రూ. 9 కోట్ల భారీ విరాళం
x

టీటీడీకి రూ. 9 కోట్ల భారీ విరాళం

తిరుమలలో యాత్రికుల భవనాలు ఆధునీకరించాలని కోరిన ఎన్ఆర్ఐ మంతెన


తిరుమలలో సాధారణ యాత్రికుల వసతి సముదాయాల ( Pilgrim Amenities Complex PAC) ఆధునీకరణకు తొమ్మిది కొట్ల రూపాయల విరాళం అందింది. మూడు PAC లను ఆధునీకరించడానికి ప్రవాస భారతీయుడు, పారిశ్రామికవేత్త భారీ విరాళం అందించారని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు వెల్లడించారు. తిరుమలలో టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి బుధవారం విజయనగరం ఎంపీ అప్పలనాయుడుతో కలిసిటీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమి చెప్పారంటే..




"మంతెన రామలింగరాజు కూతురు నేత్ర వివాహం జరిగింది. కూతురు నేత్ర, అల్లుడు వంశీ పేరిట శ్రీవారికి విరాళం అందించారు" అని టీటీడీ చైర్మన్ నాయుడు తెలిపారు. విరాళం చెక్కును తిరుమలలో ఎంపీ అప్పలనాయుడు సమక్షంలో చెక్కు అందించారు. ఈ విరాళాన్ని తిరుమలలో యాత్రికులకు ఉచితంగా వసతి కల్పించడానికి అందుబాటులో ఉన్న పీఏసీ-1,2,3 భవనాలు ఆధునీకరించడంతో పాటు వసతులు మరింత మెరుగు పరచడానికి వినియోగిస్తామని బీఆర్. నాయుడు తెలిపారు. టీటీడీ ట్రస్టులకు గతంలో కూడా మంతెన రామలింగరాజు 16 కోట్ల రూపాయలు అందించారని కూడా ఆయన గుర్తు చేశారు.


Read More
Next Story