
టీటీడీ ట్రస్టుల ద్వారా పేదల ఆరోగ్య సేవలు..
2026 ప్రారంభంలోొ రూ.50 లక్షల విరాళంతో మొదటిదాతగా నిలిచిన చెన్నై వాసి.
టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ ప్రాణదానం (SV Prana Dana Trust ), శ్రీబాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టు (Sri Balaji Vara Prasidini Trust )కు విరాళాలు ప్రారంభమయ్యాయి. జనవరి ఒకటో తేదీ చెన్నై నగరానికి చెందిన పొన్నయ నాగేశ్వరన్ నూతన సంవత్సరం ఆరంభంలో రూ. 50 లక్షలు విరాళంగా అందించిన మొదటి వ్యక్తిగా నిలిచారు. రెండు రోజుల్లో 70 లక్షల రూపాయలు టీటీడీ ట్రస్టులకు అందాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం ( Tirumala Tirupati Devasthanam TTD) ద్వారా పేదరోగుల కోసం ఆస్పత్రులు కూడా నిర్వహిస్తోంది. అందులో శస్త్రచికిత్సలు, సాధారణ రోగుల కోసం స్విమ్స్ (SVIMS), వికలాంగుల కోసం (Birrds) ఆస్పత్రుల ద్వారా పేదలకు తక్కువ ధర, ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందుబాటులో ఉంచింది.
టీటీడీ నిర్వహిస్తున్న శ్రీఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కు రూ.10 లక్షలు, శ్రీబాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకు రూ.10 లక్షలు శుక్రవారం విరాళాలు అందాయి.
హైదరాబాద్ కు చెందిన రైడాన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో వంగల హర్షవర్ధన్ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ కు రూ.10 లక్షలు, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ జాయింట్ డైరెక్టర్ నేలబొట్ల శుభ సౌజన్య రూ. 10 లక్షలుశ్రీ బాలాజీ ఆరోగ్యం వరప్రసాదిని స్కీంకు డీడీలను అందజేశారు.
టిటిడి చైర్మన్ బీ.ఆర్. నాయుడుకు శుక్రవారం ఆ సంస్థల ప్రతినిధుల తరుపున ఈ మేరకు రూ. 20 లక్షల డిడిలను తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై అచంచలమైన భక్తితో టీటీడీ ట్రస్టులకు భక్తులు విరాళాలు అందించడంపై ఛైర్మన్ బీఆర్. నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
రూ.50 లక్షలు విరాళం
చెన్నైకు చెందిన పొన్నయ నాగేశ్వరన్ కుటుంబం టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు గురువారం రూ.50 లక్షలు విరాళంగా అందించారు. దాత పొన్నయ నాగేశ్వరన్ తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.
Next Story

