Tirumala| తిరుమల మఠాల్లో ఏమి జరుగుతోంది?
x

Tirumala| తిరుమల మఠాల్లో ఏమి జరుగుతోంది?

ఈవెంట్ కేంద్రాలుగా మారిన పీఠాధిపతుల మఠాల్లో సంస్కరణకు బీజం పడింది. అధ్యయనానికి కమిటీ నియమించింది. నివేదిక తర్వాత ఏం చేస్తారనేది వేచిచూడాలి.


తిరుమలలో పీఠాధిపతులకు కేటాయించిన మఠాలపై టీటీడీ దృష్టి నిలిపింది. మఠాల చాటున నిర్వహిస్తున్నఈవెంట్లు. అద్దెకు ఇస్తున్న గదుల వ్యవహారంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో చర్యలు తీసుకోవడానికి మొదటిసారి ఉపక్రమించింది. వాస్తవ పరిస్థితి నిగ్గు తెల్చడానికి టీటీడీ ( TTD) తొమ్మిది మందితో కమిటీ ఏర్పాటు చేసింది.

అందులో ఓ టీటీడీ రెవెన్యూ డీఈఓ, హెల్త్ ఆఫీసర్, విజిలెన్స్ అధికారి, ఇంజినీరింగ్ అధికారి, విఖానస ఆశ్రమం, మూనస్వామి మఠం, వాసవిభవన్, రాఘవేంద్రస్వామి మఠం, అహోబిలం మఠం నుంచి ఒకో ప్రతినిధిని నియమించారు. ఎప్పటి లోపు వారు నివేదిక ఇస్తారనేది మాత్రం స్పష్టత లేదు.
తిరుమలలోని 34 మఠాల్లో పూజలు, ప్రవచనాలు, యాత్రికులకు ఉచితంగా అన్నదానం చేయాలనేది ప్రధాన లక్ష్యం. ఇందుకోసం దక్షిణాది రాష్ట్రాల పీఠాధిపతులకు మాత్రమే మొదట మఠాల నిర్మాణానికి టిటిడి స్థలాలను లీజుకు ఇచ్చింది.

దక్షిణాది రాష్ట్రాల్లోని ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లోని పీఠాలకు మాత్రమే తిరుమలలో సత్రాలు ఉండేవి. ఆ తర్వాత ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన సత్రాల ఏర్పాటుకు టీటీడీ స్థలం కేటాయించింది. ఇక్కడి పరిస్థితి గాడి తప్పిందనే ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో అద్దెల నియంత్రిణ, వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేయడానికి టీటీడీ ఓ కమిటిని నియమించింది. అందులో
మాస్టర్ ప్లాన్ తర్వాత

తిరుమలలో శ్రీవారి ఆలయానికి సమీపంలోనే అర్చకుల నివాసాలు, పూటకూళ్ల ఇళ్లు కూడా కనిపించేవి. ఇదే ప్రదేశంలో కొన్ని మఠాలు కొనసాగేవి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు ఇక్కడ ఉచిత అన్నదానం తోపాటు కాసేపు సేదదీరేందుకు కూడా అనుమతించేవారు. అయితే, పెరుగుతున్న యాత్రికుల సంఖ్యకు తోడు వసతి కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో శ్రీవారి ఆలయానికి వెనుక, మాడవీధుల్లోని నివాసాలు ఖాళీ చేయించారు. (అందుకు నిదర్శనమే ఈ పాతచిత్రం) ఆ తరువాత
మాస్టర్ ప్లాన్ లో భాగంగా శ్రీవారి ఆలయానికి వెనుక భాగం, సమీపంలో ఉన్న అనేక సత్రాలను ఖాళీ చేయించారు. ధార్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చే టీటీడీ అదే బాటలో పయనించే పీఠాలకు తిరుమలలోని వేరువేరు ప్రాంతాల్లో స్థలాలు కేటాయించింది. దీంతో పీఠాధిపతులు ఆ ప్రాంతాల్లో అన్ని హంగులతో బహుళ అంతస్తుల భవనాలను నిర్మించారు.
సబ్ లీజుకు అప్పగింత
"టీటీడీ నుంచి లీజుకు తీసుకున్న స్థలాల్లో నిర్మించిన సత్రాలను ఆయా పీఠాల అధిపతులు తిరుపతి, తిరుమల ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులకు ఇచ్చారు" అనేది బహాటంగా వినిపిస్తున్న ఆరోపణలు. ఈ లీజు దారుల నుంచి ప్రతినెల రు 15 లక్షల నుంచి రూ. 20 లక్షలు మఠాలకు వెళుతున్నట్లు సమాచారం.
దశాబ్దాల కాలంగా ఈ సత్రాలను వ్యాపార కేంద్రాలుగా మార్చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే యాత్రికులు గదులు కోసం వెంపర్లాడుతుంటారు. వారిలో చాలామందిని టీటీడీ గదుల వద్దే కొందరు సత్రాల వైపునకు మళ్ళిస్తున్నట్లు చెబుతున్నారు.
"తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు గది కోసం వెళితే నాకే ఆ పరిస్థితి ఎదురైంది" అని జనసేన తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు.

వ్యాపారం ఎలాగంటే..
తిరుమలలో సత్రాల చాటున వ్యాపార కేంద్రాల నిర్వహిస్తున్నారని ఆరోపణలు బహిరంగ సత్యం. ధార్మిక ప్రవచనాలు వినిపించాల్సిన ఈ సత్రాలు ఈవెంట్ కేంద్రాలుగా మార్చివేశారు. కళ్యాణ మండపం ఉంది. విశ్రాంతి కోసం గదులు కూడా ఉన్నాయి. ఒక వివాహం జరిపించాలంటే..
1. మండపం వైశాల్యం ఆధారంగా రు. లక్ష నుంచి రు. 1.5 లక్షలు
2. మండపం పూలతో అలంకరించడానికి రు. 50 వేల నుంచి 70 వేలు
3. క్యాటరింగ్ కనీసం అంటే లక్ష ఉంటుంది
4. వధూవరులు, వారి కుటుంబాలకు విశ్రాంతి గదులు కూడా ఉన్నాయి. ఒక ఉగాది రోజుకు రూ. 1000 నుంచి రూ. 2000 వరకు ఉంటుంది.
5. అతిథులు కూర్చోవడానికి కుర్చీలు షామియానా ఇతర ఖర్చులు రు. 50 వేలు వసూలు చేస్తుంటారని చెబుతున్నారు.

ఒకోసత్రం వైశాల్యం వేరువేరుగా ఉంటుంది. వసతులు కూడా అలాగే ఉంటాయి. గదుల అద్దె కూడా మరోరకంగా ఉంటుంది. అక్కడ డిమాండ్ బట్టి ధరలు నిర్ణయించినట్లు చెబుతున్నారు. దీంతో తిరుమల కొండపై ఉన్న సత్రాల్లో చాలావరకు ఈ తరహా కార్యక్రమాల నిర్వహణకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం.
ఈ వ్యవహారాలన్నీ టీటీడీ ఉద్యోగులకే కాదు. అధికారులకు ఈ విషయాలు తెలిసిన స్పందించిన దాఖలాలు లేవని చెప్పవచ్చు. అందుకు కారణం కూడా లేకపోలేదు. తిరుమలలో సత్రాలన్నీ దేశంలోని అనేక ప్రాంతాలకు చెందిన పీఠాలకు సంబంధించినవే కావడం కూడా ఒక కారణం. అందువల్లే టిటిడి ఉన్నతాధికారులు చాలావరకు చూసి చూడనట్లు వ్యవహరిస్తుంటారని తిరుమల లో వినిపించే మాట.
మెల్లగా ప్రక్షాళన..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన మనసు ఒకటి రోజే సీఎం ఎన్ చంద్రబాబు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు.
"ప్రభుత్వ పాలనలో ప్రక్షాళన తిరువలనంచే ప్రారంభిస్తా" అని సీఎం చంద్రబాబు చెప్పిన మాటలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు.. టీటీడీ ఈవోగా వచ్చిన జే శ్యామలరావు ఉచిత అన్నదాన కేంద్రం, శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో నాణ్యత పెంచడానికి అవసరమైన చర్యలపై దృష్టి తెలిపారు. ఇది సాగుతుండగానే ఆలస్యంగా ఐదు నెలల తర్వాత టీటీడీ చైర్మన్గా బిఆర్. నాయుడును నియమించారు. బాధ్యతలు స్వీకరించక ముందే ఆయన తన అజెండాను విస్పష్టంగా ప్రకటించారు. ఆ మేరకు గత ఐదేళ్ల పాలనలో జరిగిన కొన్ని నిర్ణయాలను సమీక్షించడానికి చర్యలు తీసుకుంటూ నిర్ణయాలు కూడా చేశారు. అదే కోవలో..
సత్రాలపై దృష్టి
తిరుమలలో దేశం లోని వివిధ పీఠాధిపతులకు కేటాయించిన మఠాలపై కూడా దృష్టి సారించారు. కొండపై ఉన్న ఆ మఠాల్లో ఉన్న వసతులు ఏమిటి? పీఠాధిపతుల నుంచి లీజుకు తీసుకున్నది ఎవరు,? ఇక్కడ అందుబాటులో ఉన్న వసతులు. అంటే విశాలమైన ఫంక్షన్ హాళ్లు, గదులు ఎన్ని ఉన్నాయి? వాటి వైశాల్యం. వసూలు చేస్తున్న అద్దె. టీటీడీ ఏ ఉద్దేశంతో వీరికి కేటాయించింది. ఈ సత్రాలలో జరుగుతున్న వ్యవహారాలు ఏమిటి? అనే విషయాలను పరిశీలించడానికి తొమ్మిది మందితో కమిటీని ఏర్పాటు చేసింది. ఇది జరిగి సుమారు పది రోజులు అవుతున్న, టీటీడీ అధికారులు మాత్రం ఈ విషయాన్ని బయటికి పొక్కనివ్వలేదు. దీంతో సత్రాలపై అధ్యయనం చేయడానికి కమిటీ నియమించారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రద్దు చేస్తారా.. స్వాధీనమా
తిరుమల కొండపై ఉన్న పీఠాధిపతులకు సంబంధించిన మఠాల వ్యవహారాలను అధ్యయనం చేసిన తర్వాత ఏం చేస్తారనేది సమాధానం లభించని మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే, అనుమతులకు మించి భవనం నిర్మించిన విశాఖ శారదా పీఠం మఠం లీజు రద్దు చేస్తూ, ఆ భవనం స్వాధీనం చేసుకోవడానికి టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు సారధ్యంలో జరిగిన మొదటి పాలకమండలి సమావేశంలోని నిర్ణయం తీసుకున్నారు. మిగతా సత్రాల స్థితిగతులను సమీక్షించిన తర్వాత పాలకమండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి.
Read More
Next Story