TTD | ఆర్జితసేవ: టికెట్ల కోటా విడుదల క్యాలెండర్ ఇదీ..
ఆన్ లైన్ లో విడుదల చేసే సేవా టికెట్ల కోటా టీటీడీ వెల్లడించింది. ఈ నెల 27వ తేదీ వరకు విడుదల చేయనున్న కోటా టికెట్ల వివరాలు ఇవి.
తిరుమల శ్రీవారి దర్శనానికి ఆన్ లైన్ లో ఆర్జిత సేవా కోటా టికెట్లు విడుదల చేస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ నెల కోటా టికెట్టు ఈ రోజు పది గంటలకు (18వ తేదీ) విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. అలాగే ఈ నెల 27వ తేదీ వరకు ఆర్జిత సేవలు, గదుల కోటా, శ్రీవాణి కోటా టికెట్లు కూడా విడుదల చేయనున్నారు. అంతేకాకుండా, పరకామణి సేవకు వెళ్లడానికి పేర్లు నమోదు చేసుకునే వెసులుబాటు కూడా కల్పించింది.
జనవరి 18 ఉదయం పది గంటలకు ఏప్రిల్ నెల ఆర్జీత సేవా టికెట్లు విడుదల చేస్తుంది. అందులో సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ టికెట్ల రిజిస్ట్రేషన్ జనవరి 18 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.
ఈ టికెట్లు తీసుకున్న వారు 20వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.
జనవరి 21: ఆర్జిత సేవా టికెట్లు ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. ఇందులో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు ఉంటాయి.
ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల ఆర్ధిత సేవా టికెట్లు కూడా అందుబాటులో ఉంటాయి.
జనవరి 21: వర్చువల్ సేవల కోటా టికెట్లు మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేస్తారు. ఇందులో వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఏప్రిల్ నెల కోటా విడుదల చేయనుంది.
జనవరి 23: అంగప్రదక్షిణ టోకెన్లు : ఏప్రిల్ నెలలో అంగప్రదక్షిణం టోకెన్ల కోటా ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
జనవరి 23: శ్రీవాణి టికెట్ల ఏప్రిల్ నెల ఆన్ లైన్ కోటా టికెట్లు ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
జనవరి 23: మార్చి నెలలో వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటా విడుదల చేయనుంది.
జనవరి 24: ఉదయం పది గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తారు.
గదుల కోటా
జనవరి 24: తిరుమల, తిరుపతిలలో ఏప్రిల్ నెల గదుల కోటా మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
జనవరి 27: శ్రీవారి సేవ సాధారణ, నవనీత, పరాకామణి సేవ కోటాలు ఉదయం 11, మధ్యాహ్నం 12, ఇంటి గంటకు యధాప్రకారం విడుదల చేస్తారు.
Next Story