పద్మావతీ అమ్మవారి కార్తీకమాస బ్రహ్మోత్సవాలకు ముహూర్తం..
x
తిరుచానూరు పద్మావతి ఆమ్మవారి ఆలయం. పద్మపుష్కరిణి (ఫైల్)

పద్మావతీ అమ్మవారి కార్తీకమాస బ్రహ్మోత్సవాలకు ముహూర్తం..

తిరుచానూరులో నవంబరు 17 నుంచి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు..


తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరిగాయి. శ్రీవారి పట్టపురాణి శ్రీపద్మావతీ అమ్మవారి కార్తీకమాస బ్రహ్మోత్సవాలకు తిరుచానూరు సిద్ధం అవుతోంది. నవంబర్ 17వ తేదీ నుంచి ధనుర్ లగ్నంలో ప్రారంభమయ్య ఉత్సవాలు 25వ తేదీ వరకు కనువిందుగా నిర్వహించడానికి టీటీడీ సమాయత్తం అవుతోంది.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 11వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారని టీటీడీ అధికారులు వెల్లడించారు.
తిరుచానూరులో పద్మావతీ అమ్మవారికి బ్రహ్మత్సవాలకు నవంబర్ 16వ తేదీ సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు. తిరుమల తరహాలోనే తిరుచానూరులో కూడా పల్లకీపై అమ్మవారు ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు. ఇక్కడ నిర్వహించే బ్రహ్మోత్సవాలకు కూడా ప్రత్యేకత ఉంది. కార్తీకమాసం అంటే మహిళలకు ప్రీతిపాత్రం. అమ్మవారికి కూడా ఈ మాసంలోనే ఉత్సవాలు నిర్వహిస్తారు.

తిరుచానూరు పద్మపుష్కరిణిలో యాత్రికుల పుణ్యస్నానాలు (ఫైల్)

తిరుచానూరులో బ్రహ్మెత్సవాలు ముగిసే 25వ తేదీ పద్మపుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి యాత్రికులు ప్రాధాన్యత ఇస్తారు. తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు నుంచి వచ్చే యాత్రికుల సంఖ్య గణనీయంగా ఉంటుంది.
బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.

వాహనసేవలు ఇలా...
17-11-2025 (సోమవారం) ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. రాత్రికి పద్మావతి అమ్మవారు చిన్నశేషవాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ దర్శనం ఇస్తారు.
18వ తేదీమంగళ వారం: ఉదయం పెద్దశేషవాహనం
రాత్రి:హంసవాహనం
19 బుధవారం: ఉదయం ముత్యపుపందిరి వాహనం
రాత్రి: సింహవాహనం
20వ తేదీ గురువారం: ఉదయం కల్పవృక్ష వాహనం
రాత్రి: హనుమంతవాహనం
21వ తేదీ శుక్ర వారం : ఉదయం పల్లకీఉత్సవం
రాత్రి: గజవాహనం
22వ తేదీ శనివారం: ఉదయం: సర్వభూపాలవాహనం
సాయంత్రం:స్వర్ణరథం
రాత్రి: గరుడవాహనం
23వ తేదీ ఆదివారం: ఉదయం: సూర్యప్రభ వాహనం
రాత్రి:చంద్రప్రభ వాహనం
24వ తేదీ: సోమవారం: ఉదయం: రథోత్సవం
రాత్రి:అశ్వ వాహనం
25వ తేదీ మంగళవారం ఉదయం బ్రహ్మోత్సవాల్లో కీలకఘట్టం పంచమీతీర్థం జరుగుతుంది. రాత్రి ధ్వజావరోహణం చేయడం ద్వారా బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి అవుతాయి.
శ్రీరంగం నుంచి సేవకులు

తిరుమలతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో వాహనసేవల కోసం పల్లకీ మోయడానికి ప్రత్యేకంగా వాహనబేరర్లు ఉన్నారు. తిరుచానూరు పద్మావతీ అమ్మవారి బ్రహ్మెత్సవాలకు మాత్రం ప్రత్యేకత ఉంది. వైష్ణవక్షేత్రాలకు మూలకేంద్రం అయిన తమిళనాడులోని శ్రీరంగంలో ఉన్న శ్రీరంగనాథఆలయం నుంచి వైష్ణవులు వాహనం మోయడానికి తిరుచానూరుకు రావడం ఇక్కడ ప్రత్యేకత.
చారిత్రక నేపథ్యం..
వైష్ణవ ఆలయాలకు మూలం శ్రీరంగంలోని రంగనాథుడి ఆలయం. ఆ ఆలయంతో తిరుమల శ్రీవారి క్షేత్రానికి అనుబంధం ఉందనేది చారిత్రక కథనం. 679 శతాబ్దం ఔరంగజేబు కాలంలో ఆయన సేనలు ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో శ్రీరంగనాథుడి తోపాటు ఉభయ నాంచారుల విగ్రహాలను తిరుమలకు తీసుకుని వచ్చి భద్రపరిచారు. ఈ విషయం తెలిసిన ఔరంగజేబు తిరుమల ఆలయంపైకి దండయాత్రకు వచ్చారంట. తిరుపతిలోని కపిలతీర్థం సమీపంలో హిందువులే కాదు. ముస్తింలు కూడా అడ్డు చెప్పారంట. శ్రీవెంకటేశ్వరుడి భార్యల్లో బీబీనాంచారి కూడా ఉన్నారు. అని గుర్తు చేశారంట. అంతే, దండయాత్రకు వచ్చిన ఔరంగజేబు శాంతించి, వెనుదిరుగుతూ, శ్రీవేంకటేశ్వరుడిని అల్లుడిగా పరిగణించి ఓ కాసులహారం సమర్పించి తిరిగి వెళ్లిపోయారనేది కథనం.
టీటీడీలో ఇప్పటికీ ఔరంగజేబు కానుకగా సమర్పించిన హారం ఉండడం గమనార్హం.
ఆ తరువాత ఉభయ నాంచారులతో పాటు శ్రీరంగనాథుడి ఉత్సవమూర్తులను తిరిగి శ్రీరంగం చేర్చడం ద్వారా వైష్ణవాలయాలకు కేంద్రంగా ఉన్న ఆ ప్రాంత విశిష్టతకు తిరుమల రక్షణగా నిలిచిందినేది ఓ కథనం. దీంతో అప్పటి నుంచి తిరుమలలో ఉత్సవాలు జరిగితే శ్రీరంగం నుంచి కానుకలు అందుతాయి. అక్కడ విశిష్ట కార్యక్రమాలకు టీటీడీ అధికారులు ప్రత్యేకంగా కానుకలు, పూజసామగ్రి తీసుకుని వెళ్లి, సమర్పించడం ఆనవాయితీగా మారింది. చారిత్రక వారసత్వ సంపద, ఆధ్యాత్మిక బాంధవ్యాన్ని శ్రీరంగం నుంచి వచ్చే శ్రీవైష్ణవులు కొనసాగిస్తున్నారు. శ్రీరంగనాథుడికి ఆశ్రయం ఇచ్చిన తిరుమల శ్రీవారి పట్టపురాణి వాహనవలో 2.5 టన్నుల బరువు ఉండే అమ్మవారి పల్లకీని మోస్తూ, తరిస్తుంటారు.
Read More
Next Story