టిటిడి పరిపాలనా భవనంలో అగ్ని ప్రమాదం
x

టిటిడి పరిపాలనా భవనంలో అగ్ని ప్రమాదం

టిటిడి ప్రధాన పరిపాల కార్యాలయంలో ఏమి జరిగింది. ఉన్నట్లుండి ఫైల్స్ ఎందుకు కాలిపోయాయి?

 &


తిరుపతిలోర ఉన్న తిరుమల తిరుపతి దేవవస్థానం పరిపాలన భవనంలో శనివారం ఆగ్నిప్రమాదం జరిగింది. కీలకమయిన ఫైళ్లు కాలిపోయాయి. టిటిడిలో గత ప్రభుత్వ హయాంలో అనేక అవకతవకలు జరిగాయిని దాని మీద విచారణ జరపాలని డిమాండ్ వస్తున్న తరుణంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. తిరుమలేశుని సన్నిధిలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటి సారి. ఈ ప్రమాదం లో అనేక కీలకమయిన దస్త్రాలు కాలిపోయినట్లు తెలుస్తున్నది.


తిరుపతిలోలి టిటిడి ప్రధాన పరిపాలన భవనంలో ఏం జరిగింది. కీలక ఫైల్స్ ఎందుకు కాలిపోయాయి. ఈ సంఘటన ఎలా జరిగింది. ప్రమాదమా? ప్రమాదాన్ని సృష్టించారా? మొత్తానికి టిటిడి ప్రధాన పరిపాలన భవనంలో ఫైలు దగ్ధం ఘటన మరో సంచలనంగా మారింది.





చిత్తూరు జిల్లా మదనపల్లిలో గత నెల 21వ తేదీ రెవెన్యూ రికార్డులు దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ సంఘటన రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. రెవిన్యూ రికార్డుల దగ్ధంపై దర్యాప్తు కొనసాగుతోంది. సిఐడిని ఈ కేసును విచారణ చేస్తోంది. ఈ విషయం ఇంకా కొలిక్కి రాకముందే..

టీటీడీలో ఘటన

తిరుపతి కేంద్రంగా టిటిడి పరిపాలన వ్యవహారాల సాగుతుంటాయి. దాదాపు 5 వేల కోట్ల రూపాయల బడ్జెట్ తో చిన్న రాష్ట్రాన్ని ఇక్కడ పరిపాలన వ్యవహారం తలపిస్తుంది. అయితే శనివారం మధ్యాహ్నం టిటిడి ప్రధాన పరిపాలన కార్యాలయం ఇంజనీరింగ్ విభాగంలో ఫైల్స్ తగ్గమయ్యాయి. ఈ ఘటన వెనుక ప్రధాన కారణం ఏంటి అనేది ప్రస్తుతం చర్చకు తెరతీసింది.



మదనపల్లి తర్వాత టీటీడీలో కూడా గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ కాలంలో జరిగిన కార్యకలాపాలపై రాష్ట్ర విజిలెన్స్ విభాగం విచారణ జరుపుతోంది. ఇందులో ప్రధానంగా శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల వ్యవహారంతో పాటు అత్యంత ప్రధానమైనదిగా ఇంజనీరింగ్ విభాగంలో నిధుల వినియోగంపై అనేక ఆరోపణలు ఉన్నాయి. నిధుల విడుదల, అవసరం లేని చోట్ల కూడా రోడ్డు నిర్మాణ పనులు చేశారని అభియోగాలను కొంతమంది అధికారులు ఎదుర్కొంటున్నారు. దీనిపై విచారణ సాగుతోంది. ఈ పరిస్థితులు నేపథ్యంలో.. తిరుపతి టీటీడీ ఎడి బిల్డింగ్ లో ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కర్ క్యాబిన్లో ఫైల్లు దగ్ధమయ్యాయి.

దీంతో ఒక్కసారి అధికారులు ఉలిక్కిపడ్డారు.
శనివారం కావడంతో టిటిడి ప్రధాన కార్యాలయంలోని అన్ని విభాగాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి పూజలు చేయడం సర్వసాధారణం. అదే క్రమంలో డి ఈ భాస్కర్ క్యాబిన్లో కూడా దీపం వెలిగించారని, అది కిందపడి మంటలు తెలరేగినట్లు చెబుతున్నారు.
ఫైళ్లు దగ్ధమైన కార్యాలయాన్ని టిటిడి చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సి వి ఎస్ ఓ) శ్రీధర్ తనిఖీ చేశారు. ఈ విషయంపై ఆయన ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్ మాట్లాడారు. "డి ఈ భాస్కర్ కార్యాలయంలో దేవుని చిత్రపటం ముందు దీపం వెలిగించారు. అది కిందపడి మంటలు వ్యాపించడంతో ఫైలు దగ్ధమయ్యాయి. కంప్యూటర్లో ఆ ఫైల్స్ సంబంధించిన వివరాలను భద్రంగా ఉన్నాయి" అని స్పష్టం చేశారు.
ఈ సమాచారం అందిన వెంటనే సిబిఎస్ఓ శ్రీధర్ తోపాటు ఇంజనీరింగ్ విభాగం చీఫ్ నాగేశ్వరరావు కూడా కార్యాలయాన్ని సందర్శించారు.
"ఈ ఫైల్స్ అన్ని భద్రంగానే ఉన్నాయి. కంప్యూటర్ నుంచి ప్రింట్ తీసుకున్న ఫైల్స్ మాత్రమే కాలిపోయాయి" అని చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు చెప్పారు. "రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ఫైల్స్ ఇందులో లేవు" అని సి ఈ నాగేశ్వరరావు చెబుతున్నారు. టీటీడీ ప్రధాన పరిపాలన భవనంలో జరిగిన అగ్నిప్రమాదంపై విచారణ జరుగుతోందని టీటీడీ సివిఎస్ఓ శ్రీధర్ చెప్పారు.



మొత్తానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి సకలక్క కార్యాలయంలో రికార్డులు దగ్ధమైన ఘటన రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. ఈ విచారణ సాగుతుండగానే, టిటిడి ప్రధాన కార్యాలయంలో జరిగిన ఘటన జిల్లా యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. విచారణలో వాస్తవాలు వెలుడయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.



Read More
Next Story