TIRUPATI | వైసీపీ ఎమ్మెల్సీ 'సిపాయి' కిడ్నాప్ అయ్యారా?
డిప్యూటీ మేయర్ ఎన్నిక రాజకీయ వేడి రాజేసింది. తిరుపతిలో అనేక రకాల హైడ్రామాలకు తెరలేసింది. ఇంతకీ ఇక్కడ ఏమి జరుగుతోంది?
తిరుపతి మరోసారి వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. టీడీపీ కూటమి వైసీపీ మధ్య రగడ పీక్ కు చేరింది. గతంలో వైసీసీ తరహా మార్కు రాజకీయాలు సాగించడంలో కూటమి నేతలు ఏమాత్రం తగ్గడం లేదు. దీనికి ప్రధానంగా
తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నిక కీలకంగా మారింది. వైసీపీ అధికారంలో ఉండగా జరిగిన ఎన్నికల్లో తిరుపతి నగర పాలక సంస్థను కైవసం చేసుకుంది. మేయర్ తోపాటు ఇద్దరు డిప్యూటీ మేయర్లు కూడా ఆ పార్టీ వారే ఎంపికయ్యారు. అని చెప్పడం కంటే, మార్చుకున్నారనడంలో సందేహం లేదు.
తిరుపతిలో 50 డివిజన్లలో 48 స్థానాల్లో వైసీపీ కార్పొరేటర్లు విజయం సాధించారు. టీడీపీ నుంచి ఆర్సీ. మునికృష్ణ మాత్రమే విజయం సాధించగా, ఓ స్థానంలో తీర్పు న్యాయస్థానంలో ఉంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు డిప్యూటీ మేయర్ పదవికి తిరుపతి మాజీ ఎమ్మెల్యే కొడుకు భూమన అబినయరెడ్డి రాజీనామా చేశారు. కాగా,
అంతకుముందకు తిరుపతి కార్పొరేషన్ కు నిర్వహించిన ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న వైసీపీ నేతలు, మద్దతుదారులు టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు.
చివరికి బీజేపీ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేసిన అభ్యర్థికి ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జీ. భానుప్రకాష్ రెడ్డి ప్రతిపాదించారు. ఆయనకు తెలియకుండానే మరో వ్యక్తితో ఆ నామినేషన్ తిరస్కరింప చేశారని భాను ప్రకాష్ రెడ్డి అలిపిరి పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు కూడా దిగారు.ఇదిలా వుండగా
వన్నెకుల క్షత్రియ ఓట్లకు గాలం
చిత్తూరు జిల్లాలో వన్నెకుల క్షత్రియ ఓట్లు కీలకం. అందులో తిరుపతి తరువాత శ్రీకాళహస్తిలో వారి ప్రాబల్యం ఎక్కువ. దీంతో తిరుపతిలో రష్ ఆస్పత్రి అధినేత డాక్టర్ సిపాయి సుబ్రమణ్యంను వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం కూడా అప్పట్లో ఆ పార్టీలో చర్చకు దారితీసింది. డాక్టర్ సిపాయి శ్రీకాళహస్తి ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం, ఆయనకు మంచిపేరు ఉంది. దీంతో ఆయన 2024 ఎన్నికల్లో తిరుపతి, శ్రీకాహస్తిలో ప్రచారానికి దిగినా, వైసీపీ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి, అసమ్మతి ముందు ఎమ్మెల్యే అభ్యర్థులు విసయం సాధించలేకపోయారనేది అందరికీ తెలిసిందే.
ఇప్పుడేమైంది...?
2024 ఎన్నికల తరువాత టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో స్థానిక సంస్థలపై ఆధిపత్యం కోసం తెరలేసింది. దీంతో డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ మేరకు సోమవారం నిర్వహించిన సమావేశానికి కోరం లేక వాయిదా పడింది. దీంతో మళ్లీ మంగళవారం (ఫిబ్రవరి4)కు సమావేశం వాయిదా పడింది. అయితే, సోమవారం రాత్రి నుంచి వైసీపీ ఎంఎల్సీ సిపాయి సుబ్రమణ్యం ఆచూకీ తెలియడం లేదని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతలే ఆయనను కిడ్పాప్ చేశారని చెబుతున్నారు.
ఎంఎల్సీ సిపాయి సుబ్రమణ్యం సౌమ్యుడుగా పేరుంది. ఈ విషయం పక్కకు ఉంచితే, భద్రతా సిబ్బంది మధ్య తిరిగే ఎమ్మెల్సీని బలవంతంగా తీసుకుని వెళుతుంటే అంగరక్షకులు ఏమి చేస్తున్నారు? నిఘా వర్గాలు ప్రతి రోజూ సాయంత్రం సమాచారం సేకరిస్తుంటుంది. ఈ పరిస్థితుల్లో ఆయనను ఎలా తీసుకుని వెళ్లారనేది సమాధానం చెప్పలేకున్నారు.
ఆ ఓటు కీలకం
తిరుపతి కార్పొరేషన్ లో 50 డివిజన్లు ఉంటే, గత ఏడాది కొందరు టీడీపీ గూటికి చేరారు. ఇంకొందరు పార్టీ మారకుండా నివారించడంలో వైసీపీ స్థానిక నేతలు, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఆయన కొడుకు అభినయరెడ్డి కీలకంగా వ్యవహరించారు. పార్టీలు మారిన నేతల వల్ల టీడీపీ, వైసీపీ కార్పొేటర్ల బలాబలాల్లో తేడాలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో తమకు బలం ఉందని వైసీపీ మాజీ డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డి చెబుతున్నారు. మంగళవారం నిర్వహించే సమావేశంలో ఎంఎల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, తిరుపతి వైసీపీ ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి ఓట్లు కీలకం కానున్నాయి. వారిద్దరూ ఓటింగ్ కు హాజరైతే డిప్యూటీ మేయర్ పదవి దక్కించుకోవచ్చనే ధీమాతో వైసీపీ ఉంది. ఈ పరిస్థితుల్లో ఎంఎల్సీ డాక్టర్ సిపాయి అజ్ణాతం నుంచి సమావేశానికి హాజరవుతారా? నిజంగా ఆయన కిడ్పాప్ జరిగి ఉంటే, టీడీపీ కూటమి ఆయనను సమావేశానికి తీసుకుని వస్తుందా? డిప్యూటీ మేయర్ పదవి ఎవరికి దక్కుతుందనేది కొన్ని గంటల్లో తేలనుంది. అంతవరకు వేచిచూడాల్సిందే.
Next Story