తిరుపతి: ఆ పచ్చబొట్టుతోనే జనసేన నేతలు అడ్డంగా బుక్కయ్యారు..
x
శ్రీకాళహస్తి జన్ సేన ఇన్చార్జి వినూత దంపతుల మధ్య మృతుడు శ్రీనివాసులు (ఫైల్)

తిరుపతి: ఆ 'పచ్చబొట్టు'తోనే జనసేన నేతలు అడ్డంగా బుక్కయ్యారు..

చెన్నైలో శవమైన కారు మాజీ డ్రైవర్.


జనసేన నాయకురాలి మాజీ కారు డ్రైవర్ చెన్నైలో అనుమానాస్పద స్థితిలో శవమయ్యాడు. ఆ మృతదేహం ఛాతీపై జనసేన పార్టీ గుర్తు, ఆ పార్టీ నాయకురాలి పేరుతో ఉన్న పచ్చబొట్టు కేసు మిస్టరీ వీడేలా చేసింది. ఆ గుర్తలు ఆధారంగా తమిళనాడు పోలీసులు రంగంలోకి దిగారు.

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి జనసేన ( Janasena party ) పార్టీ ఇన్చార్జి కోట వినూత, ఆమె భర్త చంద్రబాబుతో పాటు ముగ్గురిని అరెస్టు చేశారు. జనసేన నుంచి వినూత దంపతులను బహిష్కరించింది.
ఒంటరి పోరు
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ వ్యవహారాలను రేణిగుంటకు చెందిన కోట వినూత, ఆమె భర్త చంద్రబాబు కీలకంగా వ్యవహరించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా నిరసన కార్యక్రమాలతో సాగించిన పోరాటాలతో అరెస్టు కూడా అయ్యారు. ఆ తరువాత..
2014 ఎన్నికల్లో కూడా అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించిన కోట వినూత, చంద్రబాబు దంపతులు ఒంటరి పోరాటం సాగించారని చెప్పడంలో సందేహం లేదు. ఇదిలావుంటే, శ్రీకాళహస్తి ఇన్చార్జ్ కోట వినూత వద్ద బొక్కసంపాళ్యం గ్రామానికి చెందిన శ్రీనివాసులు కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. వ్యక్తిగత సహాయకుడిగా పార్టీ కార్యక్రమాల్లో వినూతకు కుడిభుజంగా మెలిగాడనేది ఈ ప్రాంతంలో అందరికీ తెలిసిన విషయమే. అంతలా జనసేన నాయకురాలు కోట వినుత, చంద్రబాబు కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన శ్రీనివాసులను ఇటీవల కొన్ని రోజులుగా దూరం పెట్టారు.
2025 జూన్ 21న జనసేన నాయకురాలు కోట వినూత ఓ ప్రకటన చేశారు.
"డ్రైవర్ శ్రీనివాసులు మాకు ద్రోహం చేశాడు. అతనితో మాకు ఎలాంటి సంబంధం లేదు" అని కోట వినూత చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైసీపీ నేతలకు శ్రీనివాసులు సమాచారం ఇస్తూ, కోవర్టుగా మారినట్లు వినూత దంపతులు సందేహించినట్లు చెబుతున్నారు. కాగా,
చెన్నైలో అనుమానాస్పద మృతి
జనసేన నాయకురాలు కోట వినూతతో మృతుడు శ్రీనివాసులు (ఫైల్)

జనసేన నాయకురాలు కోట వినూతతో మృతుడు శ్రీనివాసులు (ఫైల్)

చెన్నై నగరం మింట్ ( చెన్నై Mint ) సమీపంలోని కూవం నదిలో ఓ యువకుడి గుర్తు తెలియని శవాన్ని అక్కడి పోలీసులు మూడు రోజుల కిందట కనుగొన్నారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు కనిపించలేదు. మృతదేహం ఛాతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగారు. మృతదేహం ఛాతీపై "జనసేన పార్టీ సింబల్, కోట వినూత పేరుతో పచ్చబొట్టు కనిపించింది.
ఆ ఆధారాలతో మింట్ పోలీసులు దర్యాప్తు వేగం చేసి, శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంటకు చేరుకున్నారు.
విచారణలో గుర్తు తెలియని మృతదేహం కోట వినూత, చంద్రబాబు దంపతుల వద్ద డ్రైవర్ గా పని చేసిన శ్రీనివాసులుదిగా పోలీసులు నిర్ధారించుకున్నారు.
జనసేన నాయకురాలు కోట వినూత, ఆమె భర్త చంద్రబాబుతో పాటు మరో ముగ్గురిని చెన్నై నగరం మింట్పో లీసులు అరెస్ట్ చేశారు. వారిని మళ్లీ శ్రీ కాళహస్తికి తీసుకుని వచ్చి, విచారణ చేస్తున్నట్లు పోలీసు వర్గాల సమాచారం.
మొత్తానికి జనసేన నాయకురాలని మృతదేహంపై ఉన్న పచ్చబొట్టు పట్టించిందని చెప్పడంలో సందేహం లేదు. వారి వద్ద పనిచేస్తున్న మాజీ డ్రైవర్ శ్రీనివాసులు హత్య కేసులో వారి ప్రమేయం? పాత్ర ఏమిటి? అనేది విచారణలో తేలాల్సి ఉంది.
శ్రీకాళహస్తి నియోజకవర్గం లో జనసేన పార్టీకి వినూత దంపతులు సూసైడ్ స్క్వాడ్ గా పని చేశారు అనే పేరు ఉంది. ఆందోళనలు, నిరసనలతో అనేకసార్లు అరెస్టు కూడా అయ్యారు.
వారి వద్ద పనిచేసిన డ్రైవర్ శ్రీనివాసులు అనుమానాస్ రీతిలో మరణించడం వెనక ఎవరి పాత్ర ఉంది? శ్రీనివాసులు ఎలా మరణించాడు? అనేది దర్యాప్తులో మాత్రమే తేలాల్సి ఉంది.
Read More
Next Story