ప్రియురాలిని హత్య చేసి.. ప్రియుడి ఆత్మహత్య..
x

ప్రియురాలిని హత్య చేసి.. ప్రియుడి ఆత్మహత్య..

తిరుపతిలో వెలుగు చూసిన ఘటన ఇదీ.


ఓ వివాహితను ఇంటికి పిలిపించుకుని హత్య చేశాడు. ఆ తరువాత ఆమె ప్రియుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వారిద్దరూ వివాహితులే. తిరుపతి నగరం అలిపిరి బైపాస్ రోడ్డులోని కొర్లగుంట ప్రాంతంలో మంగళవారం ఉదయం ఈ సంఘటన వెలుగు చూసింది.

తిరుపతి ఈస్టు డివిజన్ సీఐ శ్రీనివాసులు కథనం మేరకు ఆ వివరాలు ఇవి. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నుంచి వలస వచ్చిన సాంబలక్ష్మి, నాగేశ్వరరావు దంపతులు జీవకోన ప్రాంతంలో కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. వారికి ఓ కొడుకు.
రేణిగుంట మండలం గుత్తివారిపల్లెకు చెందిన సోమశేఖర్ (37) కొర్లగుంటలో ఐదు సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నాడు. గ్యాస్ డెలివరీ బాయ్ గా పనిచేసే సోమశేఖర్ కు సాంబలక్ష్మితో పరిచయం ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో సాంబలక్ష్మి కుటుంబంలో కలతలు ఏర్పడ్డాయని పోలీసుల ద్వారా తెలిసింది. ఇదిలావుండగా,

ఇంటికి పిలిచి...

కొర్లకుంటలో ఒంటరిగా నివాసం ఉంటున్న సోమశేఖర్ ఆదివారం సాయంత్రం సాంబలక్ష్మిని తన ఇంటికి బలవంతంగా పిలిపించుకున్నట్లు చెబుతున్నారు. ఇంటికి వచ్చిన సాంబలక్ష్మిని హత్య చేయడం, ఆ తరువాత సోమశేఖర్ కూడా ఉరి వేసుకున్నాడనేది పోలీసుల కథనం. రాత్రి పొద్దుపోయినా, భార్య ఇంటికి రాకపోవడంతో నాగేశ్వరరావు సందేహం వచ్చింది. అదే సమయంలో స్నేహితుల ద్వారా అందిన సమాచారంతో కొర్లగుంటలో నివాసం ఉంటున్న సోమశేఖర్ ఇంటికి వచ్చి, చూసేసేరికి తన భార్య సాంబలక్ష్మి కూడా శవమై కనిపించింది. ఈ మేరకు నాగేశ్వరరావు ఫిర్యాదు చేశాడని తిరుపతి ఈస్టు సీఐ శ్రీనివాసులు తెలిపారు.
తిరుపతి నగరం కొర్లగుంటలోని ఘటనా స్థలాన్ని ఈస్టు డీఎస్పీ భక్తవత్సలం, సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ స్వాతి పరిశీలించారు. హత్యకు గురైన సాంబలక్ష్మి, సోమశేఖర్ మృతదేహాలను తిరుపతి రుయా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసిన ఈస్టు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Read More
Next Story