తిరుపతి: సమరానికి సీపీఎం సన్నద్ధం.. కార్యవర్గం భేటీ
x
సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ. బేబికి స్వాగతం పలుకుతున్న ఆ పార్టీ నేతలు

తిరుపతి: సమరానికి సీపీఎం సన్నద్ధం.. కార్యవర్గం భేటీ

భవిష్యత్ కార్యాచరణకు ఆ పార్టీ కార్యదర్శివర్గ సమావేశాలు తిరుపతిలో ప్రారంభమయ్యాయి. సిపిఎం ప్రధాన కార్యదర్శి బేబీ కూడా హాజరయ్యారు.


భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై కార్యక్రమాలు రూపొందించడానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం కొద్దిసేపటి కిందటే ప్రారంభమైంది. 25 సంవత్సరాల తర్వాత సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశాలు తిరుపతిలో జరగడం గమనార్హం.

తిరుపతి cpm జిల్లా కార్యాలయంలోని వేమన విజ్ఞాన కేంద్రంలో గురువారం నుంచి ప్రారంభమైన కార్యదర్శి వర్గ సమావేశాలు మూడు రోజులపాటు జరగనున్నాయి.
ఈ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత ఉన్నట్లు సిపిఎం వర్గాల ద్వారా తెలిసిన సమాచారం. సిపిఎం రాష్ట్ర కార్యవర్గ దర్శి సమావేశాలకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీబీ రాఘవులుతో కలిసి ఈ సమావేశాలకు హాజరైన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి యంఏ.బేబీ ప్రారంభ ఉపన్యాసం చేశారు.

దేశంలో ప్రధాని నరేంద్ర మోది సారధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పైన, సాగించాల్సిన పోరాటాలను సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ వివరించారని తెలిసింది. మతసామరస్యాన్ని కాపాడే దిశగా మైనార్టీ వర్గాలకు రక్షణ పై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి దిశా నిర్దేశం చేయనున్నట్లు చెబుతున్నారు. అందులో ప్రధానంగా,
"రానున్న మూడేళ్లలో ప్రజా సమస్యలపై పోరాట కార్యక్రమాలకు సన్నద్ధం కావడంపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు" అని సిపిఎం పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
దేశ రాజకీయాలు ప్రధానంగా రాష్ట్రంలో టిడిపి కూటమి అనుసరిస్తున్న విధానాలపై మూడు రోజుల కార్యదర్శి వర్గ సమావేశాల్లో చర్చించడంతోపాటు భవిష్యత్తు ఆందోళన కార్యక్రమాలను సిద్ధం చేయనున్నట్లు సిపిఎం వర్గాల ద్వారా తెలిసిన సమాచారం.
ఇందులో ప్రధానంగా
"2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ మ్యానిఫెస్టో అమల్లో జరుగుతున్న నిర్లక్ష్యం, వైఫల్యాలపై పోరాట కార్యక్రమాలు ఉంటాయి" అని సిపిఎం సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. అంతేకాకుండా, రాష్ట్రంలో విద్యుత్ రంగా సంస్కరణలపై జరిగిన అక్రమాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఆ దానికి కట్టబెట్టిన ప్రాజెక్టుల విషయంలో జరిగిన అవినీతిపై పోరాట కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశాల్లో ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు విశ్వసినీయ సమాచారం.
టీటీడీపై సమరమే
తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati devasthanam TTD) నిధులు తిరుపతి అభివృద్ధికి కేటాయించకూడదు అనే బిజెపి ఆక్షేపణలపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశాల్లో ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది.
2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి ఎలాంటి తీర్మానాలు జరగకుండానే తిరుపతిలో గరుడవారధి ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది.
"దీనిపై అప్పట్లో బిజెపి నాయకులు కోర్టుకు వెళ్లారు" అని సిపిఎం నాయకుడు కందారపు మురళి కూడా ప్రస్తావించారు.
" ఆ తర్వాత వైసిపి అధికారంలోకి వచ్చినప్పటికీ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ఆపలేదు" అని కూడా గంగార మురళి గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే..
తిరుపతిలో టీటీడీ నిధులతో అభివృద్ధి పనులు చేయడానికి వీలు లేదు అనే బిజెపి ద్వంద నీతి పై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశాల్లో ఓ తీర్మానం ఆమోదించే అవకాశం ఉంది. తద్వారా బిజెపికి వ్యతిరేకంగా నిరసిస్తూ, టీటీడీపై ఒత్తిడి పెంచడానికి సిపిఎం మూడు రోజుల సమావేశంలో నిర్దిష్ట కార్యాచరణ సిద్ధం చేసే అవకాశం ఉంది.
టీటీడీ పరిపాలన వ్యవహారాలు సాగించడానికి 5000 కోట్లకు పైబడే బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఈ నిధులతో తిరుపతిలో రోడ్ల నిర్మాణం, విద్యుత్ దీపాలు, కొన్ని పార్కులతో పాటు విద్యాసంస్థలు, ఆసుపత్రులు కూడా టిటిడి నిర్వహిస్తోంది.
ఈ పరిస్థితుల్లో టీటీడీ నిధులతో దేశంలోని అనేక ప్రాంతాల్లో కళ్యాణ మండపాలు, ఆలయాల నిర్మాణానికి వెచ్చిస్తున్నారు. మొదటినుంచి తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులు కేటాయిస్తున్న విషయాన్ని కూడా సిపిఎం నేతలు గుర్తు చేస్తున్నారు.
ఈ పద్ధతికి విరుద్ధంగా వ్యవహరించాలి అనే బిజెపి ఆలోచన, నిర్ణయాలను సిపిఎం నాయకులు తప్పుపడుతున్నారు. స్థానిక సంస్థలు, కొన్ని ప్రభుత్వ కార్యాలయాల నుంచి కూడా అద్దె, పన్నులు చెల్లించకుండా ఎగవేస్తున్న విషయాన్ని కూడా సిపిఎం నాయకులు గుర్తు చేస్తున్నారు.
మొత్తానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశాలలో రాష్ట్ర రాజకీయ పరిస్థితిని సమీక్షించడం. భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేయడం. వీటన్నిటితోపాటు సామాన్య ప్రజలు, యాత్రికులకు కల్పించాల్సిన వస్తుల నేపథ్యంలో టీటీడీ నిధులు వెచ్చించాల్సిందే" అనే తీర్మానాలను ఆమోదించనున్నట్లు సిపిఎం నాయకుల మాటలతో స్పష్టమవుతుంది.
ఈస్ కార్యదర్శి వర్గ సమావేశాల అనంతరం ప్రజా సమస్యలు, ప్రధానంగా టిడిపి కూటమి విధానాలు, టీటీడీ నిధులు వినియోగించే అంశాలపై పగడ్బందీ ఆందోళనలు సాగించే విధంగా కార్యాచరణ సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది.
తిరుపతిలో పరమమైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశాలకు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి ఎం ఏ బేబీ ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు సిపిఎం నేత కందారపు మురళి, పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.


Read More
Next Story