నిరుద్యోగులను ఆహ్వానిస్తున్న కేజీబీవీల్లో ఉద్యోగాలు..
x

నిరుద్యోగులను ఆహ్వానిస్తున్న కేజీబీవీల్లో ఉద్యోగాలు..

తిరుపతి జిల్లాలో రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ.


తిరుపతి జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) 32 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష అభియాన్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. 2025–26 విద్యా సంవత్సరానికి నాన్-టీచింగ్ పోస్టులు మహిళా అభ్యర్థులతో భర్తీ చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల మూడో తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆఫ్ లైన్ లో అభ్యర్థులు దరఖాస్తులు చేయాల్సి ఉంటుంది.

తిరుపతి జిల్లా కలెక్టరేట్ లోని సమగ్రశిక్షా కార్యాలయం అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ (APC)కు దరఖాస్తులు అందించాలి. అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్ తెలిపారు.

పోస్టుల వివరాలు
1)టైప్–III KGBV (9 ఖాళీలు)
వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్3, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్–2, అటెండర్–1, అసిస్టెంట్ కుక్–01, స్కావెంజర్–1
2) టైప్–IV KGBV (23 ఖాళీలు)
వార్డెన్–3, పార్ట్ టైమ్ టీచర్–4, చౌకీదార్–4, హెడ్ కుక్–04, అసిస్టెంట్ కుక్–08
అర్హతలు
1) మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు
2)వయోపరిమితి: కనీసం 18 సంవత్సరాలు
3) జనరల్ – 45 సంవత్సరాలు, SC/ST/BC/EWS – 50 సం. దివ్యాంగులు – 52 సం
వార్డెన్ పోస్టుకు: బ్యాచిలర్ డిగ్రీ + B.Ed / M.A (ఎడ్యుకేషన్)
పార్ట్ టైమ్ టీచర్: B.Sc (మ్యాథ్స్) + B.Ed / M.A (ఎడ్యుకేషన్)
కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్: ఇంటర్ + కంప్యూటర్ కోర్సు లేదా కంప్యూటర్స్ డిగ్రీ
వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్: 10వ తరగతి + వృత్తి శిక్షణ లేదా డిప్లొమా, కుక్, అసిస్టెంట్ కుక్, చౌకిదార్, అటెండర్ తదితర పోస్టులకు నిర్దిష్ట విద్యార్హత అవసరం లేదు.
దరఖాస్తు విధానం
అర్హత గల అభ్యర్థులు ఈ నెల మూడో తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆఫ్ లైన్ లో దరఖాస్తులు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు తిరుపతి జిల్లా కలెక్టరేట్ లోని సమగ్రశిక్షా కార్యాలయంలోని అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ (APC) అందించాలి.
ఎంపిక విధానం
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) నియామకాలకు ఎంపిక ప్రక్రియ ఇలా ఉంటుంది. మండలాన్ని యూనిట్‌గా తీసుకుంటారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులు నేరుగా ( వాక్-ఇన్) ఇంటర్వ్యూకు హాజరు కావాలి. తుది మెరిట్ జాబితా జనవరి 28 తేదీ ప్రకటిస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి విధులకు హాజరయ్యే విధంగా నియామకాలు జరుగుతాయని కలెక్టర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన స్పష్టం చేసింది. ఎంపికైన వారికి APCOS మార్గదర్శకాల ప్రకారం గౌరవ వేతనం చెల్లిస్తారని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.
Read More
Next Story