అమ్మాయికి మొగుడు.. అత్తకు ప్రియుడు..
x

అమ్మాయికి మొగుడు.. అత్తకు ప్రియుడు..

సత్యవేడులో వికటించిన ప్రేమాయణం. పోలీస్ స్టేషన్ కు చేరిన పంచాయతీ.


గిరిజన కాలనీలో చరణ్ (18) ఓ బాలికను మూడు నెలల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మామ చనిపోవడంతో అత్తతో కూడా ప్రేమాయణం సాగించాడు. వారి వ్యవహారం కొన్నాళ్లు సజావుగానే సాగింది. తల్లితో వివాహేతర సంబంధానికి అడ్డు చెప్పిన భార్యను, వదినపై కూడా దాడి చేసిన సంఘటన ఇది.

ఈ ఎపిసోడ్ లో ఆ యువకుడి డ్యూయల్ ప్రేమ వ్యవహారం పోలీస్ స్టేషన్కు చేరింది. గాయపడిన వదిన భర్త బంగారయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని కే వి బి పురం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ నరేష్ చెప్పారు.

తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం కెవిబిపురం మండల కేంద్రానికి సమీపంలో ఉన్న గిరిజన (యానాది) కాలనీలో శనివారం రాత్రి జరిగిన సంఘటన వివరాలు ఇవి.
కేవీపీ పురం గిరిజన కాలనీకి చెందిన చరణ్ అదే గ్రామంలోని 17 ఏళ్ల బాలికను మూడు నెలల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. అంతకుముందు నుంచే ఆ బాలిక తల్లితో వివాహేతర సంబంధం ఉన్నట్లు కాలనీలోని గిరిజనుల ద్వారా ఆరోపణలు ఉన్నాయి. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తల్లితో సంబంధం కొనసాగించడంపై చరణ్ భార్య అభ్యంతరం చెప్పింది. చరణ్ కు వదిన వరుస అయిన బంగారయ్య భార్య దీపిక కూడా మందలించింది. ఈ విషయంలో చాలా రోజులుగా ఆ రెండు కుటుంబాల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నట్లు పోలీసుల ద్వారా తెలిసింది. ఇదిలా ఉంటే,
అల్లుడి ఇంట్లోనే జీవనం..
భర్త చనిపోవడం వల్ల వెంకటమ్మ (40) కూతురు, అల్లుడు చరణ్ తోనే కలిసి ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు. తల్లితో భర్త చరణ్ ఉంటున్న తీరు నచ్చక ప్రశ్నించిన కూతురుపై తల్లి వెంకటమ్మ, భర్త చరణ్ కలిసి దాడి చేశారు.
"మీరు చేస్తున్నది తప్పు. భార్యతో బుద్ధిగా సంసారం చేసుకోండి". అని చరణ్ కు వదిన వరుస అయ్యే (భార్య అక్క) కల్పన మందలించింది. వారి మధ్య తీవ్ర వాగ్వివాదం నడిచినట్లు సమాచారం. అత్త వెంకటమ్మ తో కలిసి చరణ్ వారిద్దరిపైన దాడి చేసి గాయపరిచారు. ఈ వ్యవహారం కే వి బి పురం ఎస్టీ కాలనీలో చర్చనీయాంశంగా మారింది.
స్టేషన్ కు చేరిన పంచాయతీ
బుద్ధి మాటలు చెప్పినందుకు నా భార్యపై చరణ్, అతని అత్త వెంకటమ్మ దాడి చేశారని ఆరోపిస్తూ, కల్పనా భర్త బంగారయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలికను ప్రేమించి పెళ్లి చేసుకుని, అత్తతో వివాహేతర సంబంధం సాగిస్తున్న వ్యవహారం పోలీస్ స్టేషన్కు చేరింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించిన తరువాత కేసు నమెదు చేసినట్లు కేవీపీ పురం ఎస్సై నరేష్ చెప్పారు.
"నిన్న సాయంత్రమే కాలనీ మొత్తం స్టేషన్ కు వచ్చింది. కేసు వద్దని కూడా కోరారు. చరణ్ భార్య తోపాటు ఆమెకు అండగా నిలిచిన కల్పనకు కూడా రక్తగాయాలు కావడం వల్ల కేసు నమోదు చేశాం" అని ఎస్ఐ నరేష్ వివరించారు. ఈ ఎపిసోడ్ లో డ్యుయల్ ప్రేమాయణం కథ ఎలా సుఖాంతం అవుతుందనేది కాలనీ పెద్దలే నిర్ణయిస్తారని సమాచారం.
Read More
Next Story