తిరుమల: శ్రీవారి దర్శన టికెట్లు కావాలా.. ఇదే షెడ్యూల్
x
తిరుమల శ్రీవారి ఆలయం (ఫైల్)

తిరుమల: శ్రీవారి దర్శన టికెట్లు కావాలా.. ఇదే షెడ్యూల్

శ్రీవారి దర్శనం, వసతి, అంగప్రదక్షిణ టికెట్ల ఆన్ లైన్ కోటా షెడ్యూల్ ప్రకటించారు. రెండు నెలలకు సంబంధించిన తేదీలను టీటీడీ విడుదల చేసింది.


తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శన ఆగష్టు నుంచి రెండు నెలల పాటు ఆన్ లైన్ కోటా విడుదలకు షెడ్యూల్ ప్రకటించింది. ఇందులో శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, శ్రీవారి సేవ, అలిపిరి వద్ద హోమం, వృద్ధులు, వికలాంగుల కోటా టికెట్ల జారీకి క్యాలెండర్ టీటీడీ అధికారులు ప్రకటించారు. ఆగష్టు నెల కోటా ఈ నెల 19వ తేదీ (సోమవారం ) పది గంటల నుంచి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ ప్రకటించింది. తిరుమలకు రావడానికి ముందే యాత్రికులు ఆన్ లైన్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లతో పాటు వసతి కోసం గదులు ముందుగానే రిజర్వు చేసుకునేందుకు కూడా వెసులుబాటు కల్పించింది.

ఇదీ షెడ్యూల్
ఆ ఏడాది ఆగష్టు నెల కోటాలో శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు ఎలక్ట్రానిక్ డిఐపి రిజిస్ట్రేషన్లు 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి.
ఆర్జిత సేవలు : కళ్యాణం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకారసేవా టిక్కెట్ల కోటా బుకింగ్ 22వ తేదీ ఉదయం 10:00 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి.
కల్యాణోత్సవం : తిరుమలలోని శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం,హస్ర దీపాలంకార సేవ, (వర్చువల్ పార్టిసిపేషన్) కనెక్ట్ చేయబడిన దర్శన కోటా బుకింగ్ 22వ తేదీ మూడు గంటల నుంచి అందుబాటులో ఉంటాయి.
అంగప్రదక్షిణ : తిరుమల శ్రీవారి ఆలయ సన్నిధిల అంగప్రదక్షిణ కోసం టోకెన్లు 23వ తేదీ ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి.
శ్రీవాణి ట్రస్టు : శ్రీవాణి ట్రస్ట్ కు దర్శనం, వసతి కోటా 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు. ఈ కోటాలో రూ.10,500 రూపాయలు చెల్లించాలి. రూ. పది వేలు ట్రస్టుకు వెళుతుంది. రూ. 500 టికెట్ జారీ చేస్తారు. దాతలకు 23వ తేదీ 11 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి.
పెద్దల కోసం : సీనియర్ సిటిజన్లు, శారీరకంగా వికలాంగుల కోటా 23వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేస్తారు.
ప్రత్యేక ప్రవేశం : తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 24వ తేదీ ఉదయం పది గంటలకు విడుదల చేస్తారు.
గదులు : తిరుమల తోపాటు తిరుపతిలో టీటీడీ అందుబాటులో ఉంచిన గదులను కూడా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. 24వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేస్తారు.
తిరుచానూరు : శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం టికెట్లు 24వ తేదీ ఉదయం పది గంటలకు విడుదల చేస్తారు. ఇక్కడ రూ.200 టికెట్ అందుబాటులో ఉంటుంది.
శ్రీవారి సేవ : స్వచ్ఛందంగా సేవలు అందించే సేవకులు కూడా ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేసుకునే వెసులుబాటు టీటీడీ కల్పించింది. తిరుపతి స్థానిక ఆలయాల్లో సేవలు అందించడానికి జూన్ 26వ తేదీ ఉదయం పది గంటలకు సేవా కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయి.
అలిపిరి : అలిపిరిలోని సప్త గోవు ప్రదక్షిణ శాల వద్ద శ్రీ శ్రీనివాస దిన్యానుగ్రహ విశేష హోమం లో పాల్గొనే యాత్రికుల కోసం టికెట్లను టీటీడీ ఆన్ లైన్ టికెట్లు విడుదల చేయనుంది. జూన్ 26వ తేదీ ఉదయం పది గంటలకు ఈ కోటా టికెట్లు విడుదల చేస్తారు.
Read More
Next Story