శ్రీవారి లడ్డూలో సుగంధం ఎలా పోయింది సుగంథ్...
x

శ్రీవారి లడ్డూలో సుగంధం ఎలా పోయింది సుగంథ్...

తిరుపతిలో ఇద్దరిని విచారణ చేస్తున్న సిబిఐ బృదం. వారు ఏమి చెప్పారంటే..


తిరుమల శ్రీవారి లడ్డు లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై సిబిఐ సిట్ దర్యాప్తు మరింత లోతుగా సాగుతోంది. ఇది త్వరగా కొలికి వచ్చే అవకాశం కనిపించడం లేదు.

కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో సిబీఐ సీట్ అరెస్టు చేసిన ఢిల్లీకి చెందిన రసాయనాల వ్యాపారి అజయ్ కుమార్ సుగంథ్, టిటిడీ మార్కెటింగ్ విభాగం ప్రొక్యూర్మెంట్ మేనేజర్ గా పనిచేసిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సుబ్రహ్మణ్యం మంగళవారం విచారణ చేశారు.
నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న వారిద్దరి సుగంధీ, టీటీడీ ఈఈ Rssvr సుబ్రహ్మణ్యంను సీబీఐ అధికారులు విచారణకు మంగళవారం తిరుపతికి తీసుకుని వచ్చారు.
తిరుపతి లోని శ్రీ వెంకటేశ్వర రామ్ నారాయణ రుయా ఆసుపత్రికి సుగంథ్ పాటు టీటీడీ ఈఈ సుబ్రమణ్యంను మధ్యాహ్నం రెండు గంటల తర్వాత తీసుకొని వచ్చారు. ఆసుపత్రిలో వారికి ఆరోగ్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద ఉన్న సిబిఐ తాత్కాలిక విచారణ కార్యాలయానికి సుగంధిని తరలించారు.
టీటీడీ మాజీ చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డికి పీఏగా పనిచేసిన చిన్న అప్పన్న అరెస్టు తరువాత దర్యాప్తులో ఢిల్లీ రసాయనాల వ్యాపారి సుగంథ్ తెరపైకి వచ్చారు. సుగంథ్ ను ఈ ఏడాది నవంబర్ పదో తేదీ అరెస్టు చేశారు. ఆయన ఏ 16 నిందితుడిగా ఉన్నారు. పాల సేకరణ లేకుండానే నెయ్యి సరఫరా చేసిన బోలే బాబా డైరీ కి సుగంథ్ కెమికల్స్ పంపించినట్లు కూడా సిబిఐ అధికారులు నిర్ధారించారు. ఈ కేసులో అరెస్టు అయిన సుగంథ్ నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండులో ఉన్నారు.

తిరుపతి రుయా ఆస్పత్రిలో టీటీడీ ఈఈ సుబ్రమణ్యంకు వైద్య పరీక్షలు

టీటీడీలో తొలి అరెస్ట్
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి మార్కెటింగ్ విభాగం ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ గా పని చేసిన Rssvr సుబ్రహ్మణ్యంను సిబిఐ సిట్ అధికారులు గత నెల 27వ తేదీ అరెస్టు చేశారు. టీటీడీ సిబ్బందిలో మొదటి అరెస్టు ఆయనదే. కల్తీ నెయ్యి కేసులో సుబ్రమణ్యం ఏ 24 నిందితుడిగా ఉన్నారు. టీటీడీ మాజీ చైర్మన్, ప్రస్తుత ycp రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి మాజీ పిఏ చిన్న అప్పన్న ఈ కేసులో ఏ 24 నిందితుడిగా ఉన్నారు.
"చిన్న అప్పన్నకు టీటీడీ ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ గా పనిచేసిన సమయంలో ఇంజినీరింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుబ్రమణ్యం సహకరించారు" అనేది CBI నమోదు చేసిన అభియోగం. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో సిబిఐ సిట్ అధికారులు ఇప్పటివరకు మిల్క్ డైరీ కాంట్రాక్టర్లు, యజమానులు, వ్యాపారస్తులు తో సహా పదిమందిని సిబిఐ ఇప్పటివరకు అరెస్టు చేసింది.
అప్పన్న అరెస్టుతో కీలక మలుపు
రాష్ట్రంలో వైసిపి అధికారంలో ఉండగా అంటే 2019 నుంచి 20 24 మధ్యకాలంలో నాలుగు సంవత్సరాల పాటు వైసిపి రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా పనిచేశారు. నెయ్యి కల్తీ కేసులో రాజకీయ ప్రతినిధులకు సంబంధించి మొదట వైవి సుబ్బారెడ్డికి పీఏ గా పనిచేసిన ఆంధ్ర భవన్ ఉద్యోగి చిన్న అప్పన్నను సిబిఐ అధికారులు అరెస్టు చేయడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది.
టీటీడీ మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డికి వ్యక్తిగత సహాయకుడుగా పని చేసిన అప్పన్న ఢిల్లీలోని రసాయనాల వ్యాపారి అజయ్ కుమార్ సుగంధి ద్వారా బోలె బాబా డైరీతో లింకులు ఏర్పరచుకున్నారు అనే విషయం సిబిఐ అధికారులు బయటికి వచ్చింది.
మీ ఇద్దరి బంధం ఏమిటి?
తిరుమలలో ప్రసాదం తయారీలో వాడిన కల్తీ నెయ్యి అని గుర్తించినప్పటికీ ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వకపోవడమే అప్పటి ప్రొకీర్ మెంట్ జనరల్ మేనేజర్ సుబ్రమణ్యం పొరపాటు చేశాడనే విషయం ఆలస్యంగా గ్రహించినట్లు కనిపిస్తోంది.
కల్తీ నెయ్యి వ్యవహారంలో అన్ని వివరాలను టీటీడీ మాజీ చైర్మన్ వైబి సుబ్బారెడ్డి పిఏ గా పనిచేసిన చిన్న అప్పన్నకు సుబ్రమణ్యం అందించారనేది ప్రధాన అభియోగంగా ఉంది.
"టీటీడీకి నెయ్యి సరఫరా చేసే డైరీలు.. ప్రతినిధుల వివరాలు ఇచ్చారు. వీటి ఆధారంగా అప్పన్న ప్రీమియర్ అగ్రి ఫుడ్ సంస్థకు టెండర్ దక్కడంలో కీలకంగా వ్యవహరించారు. దీనికి హవాలా మార్గంలో 50 లక్షలు లంచం తీసుకున్నారు.. కల్తీ నెయ్యి వస్తుందని తెలిసినా సుబ్రహ్మణ్యం అభ్యంతరం చెప్పకపోవడం. దీనికి ప్రతిఫలంగా దీనికి ప్రతిఫలంగా అప్పన్న నుంచి సుబ్రహ్మణ్యంకు కూడా ప్రతిఫలం ముట్టింది" అనేది సిబిఐ అధికారులు గుర్తించిన తర్వాతే అరెస్ట్ చేసినట్లు అధికార వర్గాల సమాచారం.
దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది..
లడ్డూ కల్తీలో సీబీఐ దర్యాప్తు ఇంకెంత కాల సాగేటట్లు కనిపిస్తోంది. టీటీడీ మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్ గా పనిచేసిన సుబ్రహ్మణ్యం అరెస్టుతో. ఆ సంఖ్య పదికి చేరింది. ఫిబ్రవరిలో దాఖలు చేసిన తొలి చార్జిషీట్లో టిటిడి కొనుగోళ్ల విభాగంలో విధులు నిర్వహించిన ఎడం నాగేంద్రప్రసాద్ A-9, కరమల శేఖర్ A-10గా ఉన్నారు. వీరిని గతంలోనే సిట్ అధికారులు విచారణ చేశారు. టిటిడి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అరెస్టుతో నిందితుల సంఖ్య 29 మందికి చేరింది. A-25 నుంచి A-28 వరకు నిందితులు ఎవరనేది వెల్లడి కాలేదని తెలుస్తోంది. ఈనెల చివరిలోపు దాఖలు చేసే మలి విడత ఛార్జ్ షీట్లో ఏం కొంతమంది నిందితులు తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
మీ వ్యవహారం ఏమిటి..
శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి కొనుగోలు చేసిన నెయ్యి కల్తీ వ్యవహారంపై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యం, బోలె బాబా డైరీ కి రసాయనాలు సుగంథ్ ను సిబిఐ అధికారులు తిరుపతిలో వేర్వేరు గదుల్లో విచారణ చేస్తున్నట్లు సమాచారం. బోలె బాబా డైరీ యాజమాన్యాలతో సంబంధాలు ఏర్పడడానికి దారి తీసిన పరిస్థితిపై సుగంథ్ ను మరోసారి సిబిఐ అధికారులు ప్రశ్నించారని సమాచారం. మిల్క్ డైరీ కి ఎంత మేరకు రసాయనాలు సరఫరా చేశారు? దీనికి సంబంధించిన వివరాలపై ఆరా తీసినట్లు తెలిసింది. టీటీడీ మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి మాజీ పిఏ అప్పన్నతో ఉన్న సంబంధాలను కూడా మరోసారి తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది.
ఎలాంటి ప్రయోజనాలు దక్కాయి?
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి కల్తీ సరఫరా చేస్తున్న విషయం గుర్తించిన ఉన్నతాధికారులకు ఎందుకు చెప్పలేదనే విషయంపై గత నెలలో అరెస్ట్ చేసిన టిటిడి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ప్రోక్యుర్మెంట్ జనరల్ మేనేజర్ గా పని చేసిన సుబ్రహ్మణ్యం సిబిఐ అధికారుల బృందం ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డికి పిఏగా పనిచేసిన అప్పన్న సంబంధ బాంధవ్యాలతో పాటు కానుకలు తీసుకున్న వ్యవహారంపై కూడా మరోసారి సుబ్రహ్మణ్యం ను సిబిఐ అధికారులు లోతుగా విచారణ చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో టీటీడీ లో ఉన్న మార్కెటింగ్ విభాగం సిబ్బంది పాత్రపై కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
టీటీడీలో ఇదే చర్చ
టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యం మలిదశ విచారణకు మంగళవారం తిరుపతికి తీసుకురావడం మరోసారి ఉద్యోగ వర్గాల్లో చర్చకు దారితీసింది. మార్కెటింగ్ విభాగంలో పనిచేసిన కొంతమంది కూడా ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి విచారణ తర్వాత దర్యాప్తులో భాగంగా ఇంకొంతమంది సిబ్బందిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.. ఆ తర్వాత సమగ్ర నివేదికతో రెండో విడత చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

సీఎం వ్యాఖ్యలతో కదిలిన డొంక

తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ జరిగింది అనే విషయాన్ని సరిగ్గా 18 నెలల కిందట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు టిడిఎల్పి సమావేశంలో ప్రకటించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం, దర్యాప్తు పూర్తయ్యే లోపు సుప్రీంకోర్టులోకే సుధాకర్ అయిన నేపథ్యంలో సిపిఐ విచారణకు ఆదేశించింది. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన సిబిఐ సిట్ అధికారుల పూర్తిస్థాయి దర్యాప్తు ద్వారా అనేక విషయాలను బయటికి వస్తున్నాయి.

2025 ఫిబ్రవరి నెలలో మొదటి దశ అరెస్టులకు తెరతీసింది. అందులో భోలే బాబా డైరీ మాజీ డైరెక్టర్లు పోమిల్ జైన్, విపిన్ జై, శ్రీ వైష్ణవి డైరీ సీఈవో అపూర్వ వినయకాంత్ చావడ, తమిళనాడులోని దిండిగల్ వద్ద ఉన్న ఏ.ఆర్ మిల్క్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ రాజు రాజశేఖర్ అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు.

ఆ తర్వాత టీటీడీ మాజీ చైర్మన్, వైసిపి రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డికి పిఏగా పనిచేసిన చిన్న అప్పన్న అరెస్టు చేయడంతో వైసిపి నాయకులకు షాక్ ఇచ్చారు. టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పని చేస్తున్న సుబ్రహ్మణ్యం ను అరెస్టు చేయడంతో ఆ సంఖ్య పదికి చేరింది.

సిట్ గుర్తించిన నిందితులు

2025 వనంబర్ Cbi, స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం సంయుక్తంగా చేస్తున్న దర్యాప్తులో తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ కావడం వెనుక 29 మంది నిందితులు ఉన్నారని సిబిఐ తన ఎఫ్ ఐ ఆర్ లో నమోదు చేసింది. టిటిడి ఉద్యోగులు, పాల కర్మాగారాల ప్రతినిధులతో కలిపి పనిని నిందితులు ఉన్నారు. దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో కొత్తగా నిందితులు కూడా తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

టీటీడీకి బోలె బాబా డైరీ ప్రతినిధులు శ్రీ వైష్ణవి, ఏఆర్ డైయిరీల ద్వారా కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్లు ప్రాథమికంగా గుర్తించింది. ఇందులో ఆ డైరీలతో లోపాయికారీగా వ్యవహరించిన వైసీపీ ప్రభుత్వంలో రాజకీయ ప్రతినిధులు,. టీటీడీ అధికారులు, సిబ్బంది పాత్ర పై ఇంకా అధ్యయనం చేసే పరిస్థితి ఉన్నట్లు సిబిఐ వర్గాల కథనం.

Read More
Next Story