తిరుమల లడ్డు : ప్రసాదంపై  పవన్ ఏమన్నారు?  తిరుమలకు నడక ప్రారంభం..
x

తిరుమల లడ్డు : ప్రసాదంపై పవన్ ఏమన్నారు? తిరుమలకు నడక ప్రారంభం..

ప్రాయశ్ఛిత్త దీక్ష విరమణకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతికి చేరుకున్నారు. కాలినడకన తిరుమలకు బయలేదేరారు. లడ్డూ ప్రసాదంపై ఆయన ఏమి కామెంట్ చేశారంటే..


జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రమం నుంచి అలిపిరి పాదాల మండపం వద్దకు చేరుకున్నారు. అక్కడ పూజల అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలిపిరి కాలిబాటలో తిరుమలకు బయలుదేరారు.


తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారు అనే సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పవిత్రమైన స్వామి లడ్డూ ప్రసాదానికి అపచారం జరిగిందని కలత చెందిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దీక్ష విరమణ చేయడానికి ఆయన తిరుమలకు వెళ్లేందుకు తిరుపతికి చేరుకున్నారు.


రేణిగుంట విమానాశ్రయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఘన స్వాగతం పలికారు. ఆయనకు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసలుతో పాటు జనసేన పార్టీ నేతలు కూడా స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం అలిపిరి చేరుకున్న ఆయన శ్రీవారి పాదాలమండపం వద్ద పూజలు చేశారు. అక్కడి నుంచి కాలిబాటలో తిరుమలకు బయలేదేరారు. రాత్రికి తిరుమలలోనే డిప్యూటీ సీఎం పవన కల్యాణ్ చేరుకున్నారు.


తిరుపతిలో...

తిరుమల శ్రీవారిని బుధవారం ఉదయం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దర్శంచుకుంటారు. ఆ తరువాత పది గంటలకు కొండపై ఉన్న తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రాన్ని సందర్శిస్తారు. అని అధికారిక ప్రకటన స్పష్టం చేసింది. బుధవారం రాత్రి తిరమలలోనే ఆయన బస చేయనున్నారు.
వారాహి సభ
తిరుపతిలో ఈ నెల మూడో తేదీ సాయంత్రం 4.30 గంటలకు వారాహి సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రం ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజలతో మమేకం కానున్నారు. ఆ మేరకు జనసే పార్టీ చిత్తూరు జిల్లా నేతలు కార్యక్రమాలు సిద్ధం చేశారు.
లడ్డూ ప్రసాదంపై..
తిరుమల శ్రీవారి దర్శనానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతికి చేరుకున్నారు. తిరుపతికి బయలుదేరడానికి ముందు మీడియాతో మాట్లాడారు. "సీఎం చంద్రబాబు ఉన్న సమాచారం మాత్రమే తెలిపారు. గత ఐదేళ్లలో అనేక తప్పిదాలు జరిగాయి" అని అన్నారు. "ప్రాయశ్ఛిత్త దీక్ష కేవలం లడ్డూ కోసమే కాదు. లడ్డూ అనేది ట్రిగ్గర్ మాత్రమే" అని కూడా వ్యాఖ్యానించారు. తిరుమల "లడ్డూ వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణలో ఉన్నందువల్ల ఎక్కవ మాట్లాడడం సరికాదు" అని అన్నారు.
Read More
Next Story