
తిరుమల ఆలయం (ఫైల్)
తిరుమల: శ్రీవారి దర్శనం వీఐపీ లేఖలకు రెండు రోజుల విరామం
వీఐపీలు సామాన్యులకే ప్రాధాన్యం ఇవ్వనున్న టీటీడీ.
తిరుమలలో శ్రీవారి దర్శనానికి ఈ నెలలో రెండు రోజుల పాటు విరామం ప్రకటించారు. ఈ నెల ఏడు, 16వ తేదీల్లో వీఐపీ సిఫారసు లేఖలు తీసుకోవడం లేదని టీటీడీ అధికారులు ప్రకటించారు.
ఆ మరుసటి రోజుల్లో ప్రొటోకాల్ పరిధిలోని అధికారులు, ప్రముఖులను శ్రీవారి దర్శనానికి అనుమతి ఉంటుంది. అంటే ఆ రోజు పూర్తిగా సామాన్య యాత్రికులకు మాత్రమే స్వామివారి దర్శనం దక్కనుంది.
చంద్రగ్రహణం :శ్రీవారి ఆలయాన్ని చంద్రగ్రహణం నేపథ్యంలో ఈ నెల ఏడో తేదీ మధ్యాహ్నం 3.30 గంటల నుంచే మూసి వేస్తారు. తిరిగి ఎనిమిదో తేదీ వేకువజామను మూడు గంటలకు సంప్రోక్షణ అనంతరం ఆలయాన్ని తెరుస్తారు. అంటే మొత్తం మీద 12 గంటల పాటు శ్రీవారి ఆలయం మూతపడుతుంది.
శ్రీవారి దర్శనానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇతర శాఖల కీలక అధికారులు సిఫారసు లేఖలు ఇస్తుంటారు. ఒక రోజు ముందు ఆ లేఖ తిరుమల జేఈఓ కార్యాలయంలో సమర్పిచడం ద్వారా మరుసటి రోజుకు టికెట్ తీసుకునేందుకు అనుమతిస్తారు. అయితే
ఈ నెల ఏడో తేదీ రాత్రి చంద్రగ్రహణం కావడం వల్ల మరుసుటి రోజుకు అంటే ఎనిమిదో తేదీ దర్శనం కల్పించడానికి సిఫారసు లేఖలు తీసుకోరు. ఆ రోజు సామన్య యాత్రికులకు మాత్రమే శ్రీవారి దర్శనం పరిమితమయ్యే అవకాశం ఉంటుంది.
శ్రీవాణి ట్రస్టు కోటాలో ఈ నెల ఏడో తేదీకి టికెట్లు తీసుకున్న యాత్రికులకు దర్శన వేళలు కూడా మార్పు చేశారు. ఉదయం కాకుండా, మధ్నాహ్నం ఒంటి గంటకు క్యూలోకి అనుమతిస్తారని టీటీడీ అధికారులు తెలిపారు.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ నెల 16వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. అందువల్ల ఈ నెల 15వ తేదీ కూడా స్వామివారి దర్శనానికి వీఐపీ సిఫారసు లేఖలు తీసుకోవడం లేదని టీటీడీ ప్రకటించింది.
తిరుమలలో ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల ప్రారంభానికి వారం ముందే శ్రీవారు కొలువైన సన్నిధితో పాటు ప్రాకారాలు, ఆలయంలో తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
Next Story