రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసు పోలీసులకు కూడా చుట్టుకుంది. హైకోర్టు ఆదేశాలతో క్రిమినల్ కేసులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. టిటిడిలో పనిచేసిన పోలీసు అధికారుల్లో ఇద్దరు సిఐలు, ఒక ఎస్సై పై క్రిమినల్ కేసు నమోదయ్య అవకాశం ఉంది. వారితో పాటు ప్రస్తుత వన్ టౌన్ సిఐ విజయకుమార్ పై కేసు నమోదు చేయాలా? అయితే ఎలా చేయాలి? అనే విషయంలో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారని సమాచారం. దీనిపై పోెలీసు వర్గాల్లో ఉత్కంఠ ఏర్పడింది.
సీఐడీ నివేదికలో
నిందితులతో కొందరు పోలీసులు చేతులు కలిపినట్లు సీఐడీ సమర్పించిన నివేదికలో స్పష్టంగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో వారిపై శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ చర్యలు కూడా అవసరమని అభిప్రాయపడింది. చోరీ ఘటన మినహా, దర్యాప్తులో తేలిన ఇతర అంశాలపై సీఐడీ, ఏసీబీ విచారణ కొనసాగించవచ్చని న్యాయస్థానం వెసులుబాటు కల్పించింది
తిరుమల వన్టౌన్ సీఐ విజయ్ కుమార్ వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని సమాధానం వచ్చింది.
కేసు ఇదీ..
2023 ఏప్రిల్ 29వ తేదీ తిరుమల పరకామణి విధులకు వెళ్లిన పెద్ద జీయర్ మఠం ఏకాంగిగా ఉన్న పీవీ రవికుమార్ 900 అమెరికన్ డాలర్లు చోరీ చేస్తూ పట్టుబడ్డారు. ఈ ఘటనపై అప్పటి టీటీడీ ఏవీఎస్ఓ వై సతీష్ కుమార్ ఫిర్యాదు చేశారు. అప్పట్లో తిరుమల వన్ టౌన్ సిఐగా పనిచేసిన జగన్ మోహన్ రెడ్డి, ఎస్ఐ లక్ష్మీరెడ్డి, టూ టౌన్ సిఐ చంద్రశేఖర్ విధుల్లో ఉన్నారు. చోరీ కేసు తర్వాత ఆ ముగ్గురిని పోలీసు ఉన్నదాధికారులు వి ఆర్ కు పంపించారు. ప్రస్తుతం నెల్లూరు పి టి సి డిఎస్పీగా పనిచేస్తున్న గిరిధర్ టిటిడి విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్నారు.
తిరుమల పరకామణిలో జరిగిన చోరీపై టీటీడీ మాజీ ఏవీఎస్ఓ వై సతీష్ కుమార్ నిందితుడు రవికుమార్ను పట్టుకున్నారు. తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తిరుమల వన్ టౌన్ సిఐ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎండ్ ఆఫ్ చేయడంతో ఎస్సై లక్ష్మి రెడ్డి కేసు నమోదు చేశారు.
2023 మే 30వ తేదీన పరకామణిలో చోరీ చేసిన నిందితుడు పివి రవికుమార్ పై తిరుపతి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. తేలికపాటి సెక్షన్లలో అంటే దొంగతనం కేసు నమోదు చేశారు.
2023 సెప్టెంబర్ 9న పరకామణి కేసులో నిందితుడు రవి కుమార్ తో మాజీ ఏవీఎస్ఓ వై సతీష్ కుమార్ తిరుపతి ఫస్ట్ క్లాస్ సెకండ్ అడిషనల్ జ్యుడీషియల్ రేట్ కోర్టులో రాజీ అయ్యారు. టీటీడీ పాలకమండలి కూడా నిందితుడు రవికుమార్ నుంచి కొన్ని ఆస్తులు తిరుమల శ్రీవారికి విరాళంగా తీసుకోవడానికి సమ్మతి తెలిపింది.
ఈ వ్యవహారంలో పరకామణి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ప్రస్తావించిన నివేదికలోని అంశాలు కీలకంగా మారాయి.
"ఈ కేసులో రాజీ చేసుకోవాలని ఒత్తిళ్లు వచ్చిన వ్యవహారాన్ని సతీష్ కుమార్ టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులకు ఇచ్చిన నివేదికలో ప్రస్తావించారు. ఒక సీఐ స్థాయి అధికారి తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు" అని మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ తన నివేదికలో ప్రస్తావించిన అంశాల రికార్డులను బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రస్తుత టిటిడి పాలక మండలి సభ్యుడు జి భాను ప్రకాష్ రెడ్డి మీడియాకు ఆ పత్రాలు విడుదల చేయడమే కాకుండా రాష్ట్ర డిజిపి, గవర్నర్ కూడా ఫిర్యాదు చేశారు.
2023 సెప్టెంబర్ 10వ తేదీ తిరుమల కేంద్రంగా ఓ పత్రిక నిర్వహించే జర్నలిస్ట్ ఎం శ్రీనివాసులు టీటీడీ ఈఓ కు వినతి పత్రం ఇచ్చారు. స్పందన లేకపోవడం వల్ల ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
"పరకామణి ఉద్యోగి సివి రవికుమార్ డాలర్ల రూపంలో భారీగా నగదు, బంగారు చోరీ చేశారు. తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన తర్వాత దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు చర్చిట్ దాఖలు చేశారు ఆరోగ్యంగా మాజీ ఏవీఎస్ ఓ సతీష్ కుమార్ నిందితుడు రవికుమార్ తో స్వచ్ఛందంగా లోక్ అదాలత్ లో రాజీ పడ్డారు" అని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో ప్రస్తావించారు.
హైకోర్టు ఆగ్రహం...
ఒక సంస్థలో జరిగిన వ్యవహారాలకు సంబంధించి వ్యక్తులు ఎలా రాజీ పడతారు? దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేసి రికార్డులు కోర్టు ముందు ఉంచాలని హైకోర్టు ఏపీ సిఐడిని ఆదేశించింది. దీంతో ఏపీ సిఐడి డిఐజి రవిశంకర్ అయ్యన్నార్ 2024 అక్టోబర్ 10వ తేదీ తిరుమలలో పరకామణిని పరిశీలించారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రికార్డులు స్వాధీనం చేసుకొని సీల్ చేసిన కవర్లో హైకోర్టుకు సమర్పించారు. ఆ తరువాత హైకోర్టు కూడా అనేక సూచనలు చేసినా, చోరీకి పాల్పడిన నిందితుడుతో సంబంధాలు ఉన్న పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలనే ఆదేశంతో టీటీడీలో ప్రకంపనలు సృష్టించింది.
తిరుమలలో ప్రస్తుతం ఈ స్టేషన్ సీఐ గా ఉన్న విజయ్ కుమార్ పై కూడా క్రిమినల్ కేసు నమోదు చేసే వ్యవహారంపై ఏపీ సిఐడి, ఏసీబీ అధికారులు అనేక కోర్టు కేసులో తీర్పులను పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పరకామణి చోరీ కేసులో తిరుమల వన్ టౌన్ సిఐ విజయకుమార్ కేసు పత్రాలు తారుమారు చేశారనే అభియోగాలు ఎదుర్కొంటున్నారు. తిరుమల పోలీసు వర్గాల్లో కూడా ఇదే చర్చనీయాంసంగా మారింది.