తిరుమల లడ్డూ : సిట్ విచారణకు విరామం ఎందుకిచ్చారు?
x

తిరుమల లడ్డూ : 'సిట్' విచారణకు విరామం ఎందుకిచ్చారు?

తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై సిట్ విచారణ మొదటి దశ పూర్తయింది. ఈ దర్యాప్తునకు తాత్కాలికంగా విరామం ప్రకటించడం వెనక కారణమేంటి?


తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారనేఅభి యోగాలపై సిట్ ( స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) ముమ్మరంగా విచారణ చేస్తోంది. ఈ దర్యాప్తును తాత్కాలికంగా నిలుపుదల చేయాలని సిట్ అధికారులు భావించినట్లు సమాచారం. సిట్ చీఫ్ , గుంటూరు రేంజ్ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి సారధ్యంలోని బృందం మొదటి దశ దర్యాప్తు పూర్తి చేసింది. నాలుగు రోజుల వ్యవధిలో మొదటి దశ దర్యాప్తులో భాగంగా అధికారులు ప్రాథమిక సమాచారాన్ని మొత్తం సేకరించారు. ఇప్పటివరకు సేకరించిన సమాచారాన్ని డిజిపి ద్వారకా తిరుమల రావుకు నివేదిక అందించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

సెప్టెంబర్ 18: " తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యిని వినియోగించారు. ఇందులో గొడ్డు, పంది కొవ్వుతో పాటు చేప నూనెను కూడా కలిపారు" అని సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో చెప్పడం ద్వారా ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేశారు.
ఈ ప్రకటనతో రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో అలజడి చెలరేగింది.
జూలై 16వ తేదీ : శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి నెయ్యిని దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ఐదు సంస్థల నుంచి సరఫరా జరిగేది. అందులో తమిళనాడులోని దిండిగల్ వద్ద ఉన్న ఏఆర్ డైరీ ఫుడ్స్ లిమిటెడ్ సంస్థ నుంచి అందిన నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్స్ (వనస్పతి) తరహా పదార్థాలు ఉన్నాయని విషయం తెలిసిందని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. దీనికి భిన్నంగా..
సెప్టెంబర్ 20: సీఎం చంద్రబాబు చెప్పిన మాటలను టీటీడీ ఈవో జే శ్యామల రావు కూడా నిర్ధారించారు. మొదట స్వతహాగా ఈవో చెప్పిన మాటలకు, సీఎం చంద్రబాబు నాయుడు స్పందించిన తర్వాత చేసిన ప్రకటనకు పొంతన లేకుండా పోయింది.
ఇదిలా ఉండగా..
"తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం అపవిత్రమైంది. ఈ అంశాన్ని నిగ్గు తేల్చేందుకు సిట్ వేస్తున్నట్లు "సీఎం చంద్రబాబు ప్రకటించారు.
ఆ మేరకు ఆయన గుంటూరు రేంజ్ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి, సారథ్యంలో విశాఖ రేంజ్ ఐజి గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ విజయరామరాజు సారధ్యంలో తిరుపతి అదనపు ఎస్పి అడ్మిన్ వెంకటరావు, డీఎస్పీలు జి జి సీతారామారావు, శివ నారాయణస్వామి, అన్నమయ్య జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ టి సత్యనారాయణ, ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఇన్స్పెక్టర్ కే ఉమామహేశ్వర్, చిత్తూరు జిల్లా కల్లూరు ఎస్సై ఎం. సూర్యనారాయణ ను ఈ బృందంలో సభ్యులుగా నియమించారు.
మూడు రోజుల కిందట తిరుపతికి చేరుకున్న అధికారుల బృందం లడ్డు ప్రసాదం తయారీకి వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణలపై ఎక్కడి నుంచి దర్యాప్తు ప్రారంభించాలని సుదీర్ఘంగా చర్చించారు. ఇందులోని అధికారులతో మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత..
తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. టీటీడీ జే. శ్యామల రావును కలిసి న సిట్ దర్యాప్తు బృందం వివరాలు సేకరించింది. సిట్లోని ఓ బృందం తిరుమలలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు పర్యటించింది. లడ్డు తయారీకి అందుతున్న నే ఈ వివరాలు. ఆహార దినుసులను పొడి చేసే మిల్లు, లడ్డు పోటు, ఈ ఆహార పదార్థాలను ప్రాథమికంగా టెస్ట్ చేసే ల్యాబ్ లో కూడా సందర్శించి, కొన్ని నమూనాల సేకరించారు. అంతేకాకుండా తిరుమల పోటోలో పనిచేసే కార్మికులు, లడ్డు తయారీ ప్రక్రియను పర్యవేక్షించే టిటిడి అధికారులు, నాణ్యత ప్రమాణాలు పరిశీలించే సిబ్బందితోపాటు, తిరుమలలోని వివిధ విభాగాల అధికారుల నుంచి కూడా సమాచారం సేకరించినట్లు తెలిసింది. ఈ వివరాలన్నిటినీ క్రోడీకరించి డీజీపీ ద్వారకా తిరుమలరావు నివేదిక సమర్పించడానికి సిట్ బృందం సంసిద్ధమైనది. ఇదిలా ఉండగా,
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్యం స్వామి ఒకపక్క, టిటిడి మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డతో పాటు మరో భక్తుడు విక్రమ్ సంపత్, సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
వీటిపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి తురకలు అంటించే విధంగా జస్టిస్ బి ఆర్ గవాయ్, జస్ట్ కె.వి విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. నెయ్యి కల్తీ వివాదంపై సిట్ను కొనసాగించాలా? స్వతంత్ర సమస్తను దర్యాప్తుకు నియమించాల అనే విషయంలో స్పష్టత కోసం కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం మళ్లీ విచారణ చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా,
సుప్రీం కోర్టులో ఈ వివాదం పై ఒకపక్క విచారణ జరుగుతుండగా, తమకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన తన లో భాగంగా సిట్ అధికారులు తిరుమలలో తమ విధులు నిర్వర్తించారు. వివిధ కోణాల్లో నెయ్యి వినియోగం, స్వీకరించే విధానంతో పాటు ఇతరత్రా అనేక అంశాలను ప్రామాణికంగా తీసుకుని దర్యాప్తు మొదటి దశ పూర్తి చేశారు. కాగా,
అకస్మాత్తుగా..
తిరుమలలో దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం అందింది. దీని వెనక మతలబు ఏంటనేది ప్రస్తుతం చర్చకు దారి తీసింది. .
దీనిపై డీజీపీ ద్వారకా తిరుమల రావు స్పందించారు.
"అక్టోబర్ 3వ తేదీ వరకు సిట్‌ దర్యాప్తు ఆపుతున్నాం" అని చెప్పారు. " సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండటం వల్ల దర్యాప్తు ఆపుతున్నాం" అని స్పష్టత ఇచ్చారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలను కల్తీ నెయ్యి వాడరన్ ఆరోపణల తీవ్రతను పరిగణలోకి తీసుకొని సిట్‌ వేశాం. అని చెబుతున్న ఆయన ఈ నెల మూడవ తేదీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తదుపరి దర్యాప్తు ఉంటుందని డీజీపీ ద్వారకా తిరుమలరావు అంటున్నారు.


Read More
Next Story