తిరుమల లడ్డు: తమిళనాడులో కుట్ర ..!
x

తిరుమల లడ్డు: తమిళనాడులో కుట్ర ..!

"శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వాడే నెయ్యిలో కల్తీ జరిగింది" ఈ ఆరోపణలు ఎల్లలుదాటాయి. తమిళనాడులో భారీ కుట్రకు స్కెచ్ వేశారు. అభ్యంతరకర ట్రోలింగ్ చేస్తున్నార. గుజరాత్లో ఇద్దరు వైసీపీ మద్దతుదారులపై కేసు నమోదైంది.



రాజకీయాలకు తిరుమల, శ్రీవారి లడ్డూ ప్రసాదం కేంద్ర బిందువుగా మారింది. తమిళనాడులో ఈ వ్యవహారం కేంద్రీకృతమైంది. అక్కడి హిందువుల మనోభావాలను రెచ్చగొట్టడానికి భారీ స్కెచ్ వేశారు. అది కూడా బీజేపీ మద్దతుదారులు కావడం ప్రస్తావనార్హం. వైసీపీ పాలనలో 'అమూల్' సంస్థకు మాజీ సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఆ సంస్థ గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో వైసీపీ మద్దతుదారులపై కూడా కేసు నమోదైంది. హిందూ ధార్మిక సంస్థలు, ఆలయాలు పూజలు అంటే హిందువులకు గొప్ప నమ్మకం విశ్వాసం. ఈ విశ్వాసాలను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని నిరీక్షిస్తున్న కొందరికి ఈ మాటలు అందివచ్చాయి.
"తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యిలో గొడ్డు, పంది కొవ్వు, చేప నూనెతో కలిశాయి. అనే సీఎం చంద్రబాబు మాటల తో చెలరేగిన ప్రకంపనలు అన్ని రాష్ట్రాలకు విస్తరించాయి. ఇలాంటి అవకాశం కోసం నిరీక్షించే కొన్ని రాజకీయ అరాచక శక్తులు కూడా తమ క్రిమినల్ మైండ్ కు పదును పెట్టినట్లు కనిపిస్తోంది. తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ మద్దతుదారులు కొందరు అరాచకానికి తెరతీయబోయి అడ్డంగా బుక్కయ్యారు. తిరుమలలో తయారుచేసే లడ్డు ప్రసాదానికి అవసరమైన ఐదు సంస్థలతో పాటు తమిళనాడులోని దిండిగల్ వద్ద ఉన్న ఏఆర్ డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నెయ్యి అందేది.

"ఈ ఏడాది జూన్, జూలైలో మాత్రమే మా సంస్థ నుంచి నెయ్యి సరఫరా జరిగింది. అందులో ఎలాంటి కల్తీ లేదు" అని ఆ సంస్థ యజమాని రాజశేఖరన్ తో పాటు సంస్థ ప్రతినిధులు కూడా స్పందించారు.
"ఇందులో ఇలాంటి కల్తీ లేదు. కల్తీ జరిగినట్టు టీటీడీ చెబుతోంది. దీనికి సంబంధించి టీటీడీ అధికారుల ద్వారా మాకు ఎలాంటి నివేదిక అందలేదు" అని ఏఆర్ డైరీ మిల్క్ ఫుడ్స్ సీనియర్ మేనేజర్ పాండియన్ పెరుమాళ్ ' ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్' ప్రతినిధికి స్పష్టం చేశారు.

దిండిగల్ లో ఏమి జరిగింది..
ఇదిలా ఉంటే, తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదానికి అవసరమయ్యే నెయ్యిని దిండిగల్ లోని ఏఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ నుంచి నెయ్యి అందుతుంది. తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లా పళణిలోని సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం కూడా తిరుమల తరహాలో అత్యంత విశిష్ట దేవాలయం. ఈ ఆలయంలో తయారుచేసే పంచామృతానికి శ్రీవారి ప్రసాదానికి ఉన్నంత భక్తి భావం ఉంది.
దీనిని ఆసరాగా చేసుకున్న బీజేపీ నాయకులు హిందువుల మనోభావాలతో చెలగాటం ఆడడం ద్వారా, ఏఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సంస్థకు మసక పూయాలని భావించినట్లు కనిపిస్తోంది.

ఏమి జరిగింది ?
దిండిగల్ సమీపంలోని పళణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో తయారు చేసే పంచామృత ప్రసాదానికి కూడా నెయ్యి వినియోగిస్తారు. ఇందుకు అవసరమైన నెయ్యి, ఏ ఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్ నుంచే సరఫరా జరుగుతోంది.
"తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో గొడ్డు, పంది కొవ్వుతో పాటు చేప నూనె వినియోగించారు" అని సీఎం చంద్రబాబు చేసిన సంచలన ఆరోపణలను టీటీడీ ఈవో జే శ్యామలరావు నివేదిక బయట పెట్టడం ద్వారా ధ్రువీకరిచారు.
ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడం ద్వారా బీజేపీ మద్దతుదారులైన బీసెల్వం, సెల్వ కుమారన్ సోషల్ మీడియాలో ప్రచారానికి తెర తీశారు. అంతేకాకుండా, పలని సుబ్రమణ్య స్వామి ఆలయానికి ఏఆర్ డైరీ ఫుడ్ సంస్థ యజమాని చైర్మన్గా ఉన్నారు. అందువల్లే ఈ ఆలయానికి ఆ సంస్థ నుంచి నెయ్యి సరఫరా జరుగుతోంది " అని భయంకరమైన ఆరోపణలు చేశారు. వాస్తవానికి ఆ ఆలయ ట్రస్టు బోర్డు మెంబర్గా మాత్రమే రాజశేఖర న్ ఉన్నట్లు చెన్నైలోని ఓ సీనియర్ జర్నలిస్ట్ ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధికి స్పష్టం చేశారు.
"తమిళనాడులో ఏ ఆలయానికి కూడా తమ సంస్థ నుంచి నెయ్యి సరఫరా జరగదు. జరగడం లేదు" అని ఏ ఆర్ ఫుడ్స్ సీనియర్ మేనేజర్ పాండియన్ పెరుమాళ్ స్పష్టం చేశారు. " తమ సంస్థ ద్వారా డీలర్లకు మాత్రమే అందిస్తాం" అని పాండియన్ చెప్పారు.
టీటీడీ అధికారులు వెల్లడించిన నివేదికతో తీవ్ర ఆందోళనలో ఉన్న ఏఆర్ ఫుడ్ సంస్థ యాజమాన్యం ప్రతినిధులు, స్థానిక బిజెపి నాయకులు చేసిన కుట్ర కోణంపై భగ్గుమన్నారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పలని పట్టణ పోలీసులు బిజెపి నాయకులు ఇద్దరిని అరెస్టు చేయడం ద్వారా ఈ కుట్ర కోణానికి తెలదించారు.
ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తే, తిరుమల లడ్డు ప్రసాదం తయారీ లో వినియోగించిన నెయ్యికి సంబంధించి చెలరేగిన ఆరోపణలు దేశంలో తీవ్ర ప్రభావం చూపుతున్నాయని విషయం స్పష్టం అవుతుంది. వీటిని ఎక్కడికక్కడ, ఎవరికివారు సొమ్ము చేసుకోవడం ద్వారా లబ్ధి పొందడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారనేది స్పష్టమవుతుంది.

గుజరాత్లో ఏమి జరిగింది?
పాడి రైతుల ప్రయోజనాలు కాపాడాలని మహోన్నత ఆశయం ఉందంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ గుజరాత్ రాష్ట్రం లోని అమూల్ సంస్థ పాదం మోపడానికి అవకాశం కల్పించారు. అదే సంస్థ వైసిపి సోషల్ మీడియా ప్రతినిధులపై సైబర్ క్రైమ్ పోలీస్ విభాగం కేసులు నమోదు చేసింది. "అమూల్ సంస్థ తయారు చేసే నెయ్యి కూడా కల్తీ అయ్యింది" అని వైసిపి సోషల్ మీడియా ప్రతినిధులు స్క్రోలింగ్ చేశారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ విభాగం మహిళా పోలీసు అధికారిని ఇద్దరు వైసీపీ ప్రతినిధులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఆ పార్టీలకు సంబంధం ఉందో.. లేదో!? అనే విషయాన్ని పక్కకు ఉంచితే తిరుమలలో చోటు చేసుకున్న ది అని చెబుతున్న వ్యవహారాన్ని ఎవరికి వారు ఎక్కడికక్కడ సొమ్ము చేసుకోవడమే కాదు. హిందూ మనోభావాలను రెచ్చగొట్టడం ద్వారా అరాచకాన్ని సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని విషయానికి ఈ రెండు ఉదాహరణలుగా భావించడానికి అవకాశం లేకపోలేదు. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రం కూడా స్పందించి దురతిగతిన తిరుమల వ్యవహారానికి తెరదించకపోతే మరింత నష్టం జరుగుతుందనేది కొందరు అభిప్రాయం. ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి.


Read More
Next Story